అమెరికాకు క్రికెట్ పిచ్చి అంటించేద్దామా?

అమెరికాకు క్రికెట్ పిచ్చి అంటించేద్దామా?
నచ్చితే షేర్ చేయ్యండి

క్రికెట్ ఒక పిచ్చి…వేలం వెర్రి. కారల్ మార్క్స్ మతం ఒక మత్తు మందు అన్నాడు కానీ క్రికెట్‌ను మించిన మత్తు మరొకటి లేదు. డ్రింకు, పొగాకు దీని ముందు దిగదుడుపే. ఇండియా మ్యాచ్ ఉందంటే పరీక్షలున్నా, ఆఫీసున్నా చూసితీరాల్సిందే. తప్పనిసరిగా బయటికెళ్ళాల్సి వచ్చినా పది నిముషాలకోసారి స్కోరు తెలుసుకోవాల్సిందే. మరి ఈ ఆట మత్తులో పట్టుమని పది దేశాలే పడ్డాయెందుకని? బ్రిటిష్ వారు తమ వలస రాజ్యాలని తెగ దోచేసుకుని ఇంగ్లీషు, క్రికెట్టు మనకు కానుకగా ఇచ్చివెళ్ళారు నిజమే కానీ బ్రిటిష్ వలసలు ఇంకా చాలా ఉన్నాయి కదా. వాటికి ఈ  ఆట అబ్బలేదెందుకని? పొరుగున ఉన్న చైనాకు గానీ, అగ్ర రాజ్యం అమెరికాకు గానీ ఈ పిచ్చి అంటుకోలేదే? ప్రపంచం మొత్తంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ఆట ఫుట్‌బాల్. పాప్యులారిటీలో రెండో స్థానం క్రికెట్‌దే. గమ్మత్తేమిటంటే…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఏ కులము నీదంటే…

ఏ కులము నీదంటే…
నచ్చితే షేర్ చేయ్యండి

ఒలింపిక్ పతక విజేత పి.వి.సింధు కులం ఏంటని బోలెడంతమంది ఇంటర్నెట్‌లో వెతికేశారంటూ వార్తలొచ్చాయి. దీనిపై ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో ఘాటైన స్పందనలు కూడా వచ్చాయి. ఈ రోజుల్లో కూడా ఇంకా కులం గురించి అంత కుతూహలం ఎందుకని మోడరన్ మేధావులు, అభ్యుదయ వాదులు తెగ బాధపడిపోయారు. అయితే ఇక్కడ కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎదుటివాడి కులం తెలుసుకోవాలన్న కుతూహలం మనందరిలోను ఉంటుందనేది ఓ నగ్న సత్యం. గొప్ప గొప్ప మేధావులు సైతం కొత్తగా పరిచయమైన వాళ్ళ ఇంటిపేరు అడిగి తద్వారా వారి కులం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వారి వారి కులాలను బట్టి వ్యక్తుల ప్రవర్తనను, లక్షణాలను అంచనా వేయడం మనసమాజంలో ప్రతి ఒక్కరికి సంక్రమించిన అంటువ్యాధి. అలాగే ప్రముఖ వ్యక్తుల కులాలు తెలుసుకోవాలన్న కుతూహలం కూడా మనకెప్పుడూ ఉంటూనే ఉంటుంది. నరేంద్ర మోదీ, కేజ్రీవాల్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

గోపి గీసిన బొమ్మ!

గోపి గీసిన బొమ్మ!
నచ్చితే షేర్ చేయ్యండి

మన భారతీయ సంప్రదాయాల్లో ప్రధానమైనది, ప్రత్యేకమైనది గురుశిష్య పరంపర. గురుకులాలు కనుమరుగైనా ఇప్పటికీ అన్ని రంగాల్లో మనకు ఆ సంప్రదాయం కనిపిస్తూనే ఉంటుంది, ముఖ్యంగా క్రీడారంగంలో. కేంద్ర ప్రభుత్వం కూడా ఆటగాళ్ళకు ఇచ్చే అత్యున్నత అవార్డుకు ‘ అర్జున ‘ అని, కోచ్ కిచ్చే అవార్డుకు ‘ద్రోణాచార్య ‘ అని సరైన నామకరణం చేసింది. అలాంటి ఒక ‘అర్జున ‘ గ్రహీత పి.వి.సింధు, ఒక ‘ద్రోణాచార్య ‘ పుల్లెల గోపీచంద్ కలిసి రియో ఒలింపిక్స్‌లో మనం తలెత్తుకునేలాగ చేశారు. ఈ జోడీ తెచ్చిన వెండి పతకంతో రియో వరస వైఫల్యాల వల్ల వాడిపోయి ఉన్న మన ముఖాల్లో మళ్ళీ వెన్నెలలు వెల్లివిరిశాయి. ఫి.టి ఉష లాంటి పరుగుల రాణిని మనకందించిన ఘనత ఆమె కోచ్ నంబియార్‌కు దక్కుతుంది. సింధు విషయంలో గోపీచంద్ పాత్ర కూడా అలాంటిదే. సైనా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

సవాళ్ళపై సంధించిన ‘ఏస్ ‘

సవాళ్ళపై సంధించిన ‘ఏస్ ‘
నచ్చితే షేర్ చేయ్యండి

ఆర్నబ్ గోస్వామి, రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటి జాతీయ ఛానెల్ యాంకర్లు రాజకీయ నాయకులతో, సెలెబ్రిటీస్ తో ఆడుకుంటుంటారు. తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తారు. కానీ సానియా ఇక్కడ…ఈ మధ్య ఇండియా టుడే ఛానెల్ తరఫున ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడ్డంగా దొరికిపోయాడు. ” సెలెబ్రిటీగా వెలిగిపోతున్నావు, బాగానే వుంది కానీ లైఫులో ఇంకా ఎప్పుడు సెటిలవుతావు సానియా… కాపురం ఎక్కడ దుబాయ్ లోనా…తల్లి కావడం సంగతేంటి” అని కుశల ప్రశ్నలు వేశాడా సీనియర్ పాత్రికేయుడు. అంతే, సానియా అతనిపై సివంగిలాగ విరుచుకుపడింది. ” నేను పిల్లల్ని కనడం వదిలేసి ప్రపంచ టెన్నిస్‌లో  నంబర్ వన్ ర్యాంకు సాధనతో తృప్తి పడటం మీకు నిరాశ కలిగించినట్టుంది. ఎన్ని వింబుల్డన్ టైటిల్స్ గెలిచావన్నది గాని, నంబర్ వన్ ర్యాంకు సాధించావన్నది గాని…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

వన్ టప్ ఔట్!

వన్ టప్ ఔట్!
నచ్చితే షేర్ చేయ్యండి

అపార్టుమెంట్లు పుట్టకముందు నగరాల్లో ఆటస్థలాలనేవి ఉండేవి. కార్లు, స్కూటర్లు తక్కువగా ఉన్న రోజుల్లో గల్లీలల్లో క్రికెట్ ఆడుకునే వీలుండేది. పెద్ద గ్రౌండులో ప్యాడ్లు కట్టుకొని, చేతికి గ్లోవ్స్ తొడుక్కుని ఆడేది అసలైన క్రికెట్ కావచ్చు. కానీ గల్లీ క్రికెట్ మజా వేరే. గవాస్కర్ దగ్గరనుంచి గొప్ప క్రికెటర్లందరూ ఇలా వీధుల్లో ఓనమాలు దిద్దుకున్నవారే. పేరుకు హాకీ మన జాతీయ క్రీడ కావొచ్చు గానీ మనలో చాలా మంది హాకీ స్టిక్ ఒక్కసారి కూడా పట్టుకుని ఉండరు. క్రికెట్ మాత్రం ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆడే ఉంటారు. ఒకప్పుడు ఇంటి ముందువైపునో, వెనక వైపునో కాస్తంత జాగా ఉండేది, ఖాళీ స్థలాలు కూడా దొరికేవి. ఇక వీధి ఉండనే ఉంది. మనమంతా అలాంటి చోట్ల క్రికెట్ ఆడినవాళ్ళమే. ఎవరి శక్తి కొలదీ వారు మట్టితోనో, వెండితోనో, బంగారంతోనో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

తండ్రిలో ఆట‌లో.. కూతురు ఆసుప‌త్రిలో..

తండ్రిలో ఆట‌లో.. కూతురు ఆసుప‌త్రిలో..
నచ్చితే షేర్ చేయ్యండి

కూతురు ఆసుప‌త్రిలో ఉన్నా, మ‌న‌సును ఆట‌పై ల‌గ్నం చేసి, మంచి ఫ‌లితాన్ని రాబ‌ట్టం అంత ఈజీ కాదు. కానీ క్రికెట్‌లో త‌మ జ‌ట్టు గెల‌వాల‌నే క‌సితో ఆడాడు అత‌డు. ఒక‌వైపు కూతురుకి ఆసుప‌త్రిలో ఐసీయులో చికిత్స జ‌రుగుతున్నా, మైదానంలో న్యూజిలాండ్ వికెట్లు ప‌డ‌గొట్ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. అత‌ని ల‌క్ష్యం నెర‌వేరింది.. కివీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. మ‌రి కూతురి ప‌రిస్థితి ఎలా ఉంది..? కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో మ‌హ్మ‌ద్ ష‌మీ కుమార్తె తీవ్ర అస్వస్థతకు గురైంది. అయినప్పటికీ అత‌డు సహచరులతో కలిసి ఆటలో పాల్గొన్నాడు. మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో సహచరుడు భువనేశ్వర్‌ కుమార్‌తో కలిసి మహ్మద్‌ షమీ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఆరు వికెట్లు తీశాడు….

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

మ‌ళ్లీ ఆమె మేనియా

మ‌ళ్లీ ఆమె మేనియా
నచ్చితే షేర్ చేయ్యండి

మ‌ళ్లీ ష‌ర‌పోవా హ‌వా మొద‌లైంది. గ‌త కొంత‌కాలంగా రాకెట్‌కు దూర‌మైన ఆమె వ‌చ్చే ఏప్రిల్‌లో టెన్నిస్‌కోర్టులోకి అడుగు పెడుతోంది. దీంతో స్పాన్స‌ర్లు ఆమె వెంట ప‌డుతున్నారు. ఇంత‌కాలం ఆట‌కు దూర‌మైనా ఆమె హ‌వా త‌గ్గ‌లేద‌నే చెప్పొచ్చు. ఆట ప్ల‌స్ అందం జ‌త క‌లిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించ‌వ‌చ్చో చెప్ప‌డానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం ష‌ర‌పోవా. ఇక ఆమె టైమ్ స్టార్ట్ అయింద‌ని వేరే చెప్పాలా..! రష్యా టెన్నిస్‌ తార మరియా షరపోవాపై విధించిన రెండేళ్ల నిషేధాన్ని క్రీడల ఆర్బిట్రేషన్‌ కోర్టు 15 నెలలకు కుదించడంతో ఆమె కోసం స్పాన్సర్లు క్యూ కడుతున్నారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సందర్భంగా నిషేధిత మెల్డోనియం వాడినందుకు మరియాపై కోర్టు రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య ఈ ఏడాది జనవరి 26 నుంచి అమలయ్యేలా.. ఈ జూన్‌లో రెండేళ్ల నిషేధం…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More