ఇండియా మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేసిన బుకీ అరెస్ట్

నచ్చితే షేర్ చేయ్యండి

ఇండియా క్రికెట్ మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసిన బుకీ లండన్‌లో అరెస్ట్ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. భారత్ అభ్య‌ర్థ‌న మేర‌కు లండన్‌లో ఉన్న బుకీ సంజీవ్ చావ్లాను యుకె ప్రొటెక్షన్ సర్వీస్ అధికారులు అరెస్ట్ చేశారు. అతనిని అక్కడి నుంచి భారతలోని తీహార్ జైలుకు తరలిస్తారు. ఇప్పటికే దీనిపై ఢిల్లీ పోలీసులతో లండన్ అధికారులు సంప్రదింపులు జరిపారు. జులై 2013లో సంజీవ్ చావ్లాతో పాటు, సౌతాఫ్రికా క్రికెటర్ హాన్సీ క్రానేల పేర్లను ఛార్జ్‌షీట్‌లో నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. 2000 సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు ఫిక్స్ అయిన‌ట్టు తేలింది. ఈ ఫిక్సింగ్ కేసులో వీరివురి పేర్లు నిందితుల జాబితాలో ఉన్నాయి. సంజీవ్ చావ్లా, క్రానేల మధ్య జరిగిన ఫోన్ సంబాషణను పోలీసులు సంపాదించారు. అయితే తర్వాత 2002లో జరిగిన…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

అక్క‌డ జైలుకెళ్లొస్తే…కోచ్ ప‌ద‌వి

నచ్చితే షేర్ చేయ్యండి

ఎక్క‌డైనా..జైలుకెళ్లొస్తే అదో పెద్ద అప‌వాదు. త‌ప్పు చేసినా చేయ‌క‌పోయినా..కారాగార శిక్ష అనుభ‌విస్తే మాత్రం తిప్ప‌లు త‌ప్ప‌వు. అయితే, బ‌రోడాలో మాత్రం ఇందుకు భిన్నంగా జ‌రిగింది. మ‌నుషుల అక్ర‌మ ర‌వాణా కేసులో జైలు జీవితం గ‌డిపిన ఓ వ్య‌క్తిని బ‌రోడా క్రికెట్ అసోసియేష‌న్ అంద‌లం ఎక్కించింది. అత‌నితో పాటు ఎవ‌రూ ఉహించ‌ని ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. లోధా క‌మిటీ సిఫార‌సులు బీసీసీఐని షేక్ చేస్తున్న వేళ‌, అవేవి మాకు మాత్రం ప‌ట్ట‌వ‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రించి కొత్త వివాదానికి తేర‌లేపారు. భార‌త్ త‌ర‌పున 10వ‌న్డేలు ఆడిన జాక‌బ్ మార్టిన్ అనే క్రికెట‌ర్‌..2011లో మ‌నుషుల అక్ర‌మ ర‌వాణా కేసులో శిక్ష అనుభ‌వించాడు. జైలు జీవితం కూడా గ‌డిపిన అత‌న్ని, ఇప్పుడు బ‌రోడా క్రికెట్ అసోసియేష‌న్ రంజీ జ‌ట్టుకు కోచ్‌గా మార్చేసింది. అంతేకాదు..అత‌నికి భారీ ఆఫ‌ర్ కూడా ఇచ్చింది. దీనిపై త‌మ నిర్ణ‌యాన్ని కూడా స‌మ‌ర్థించుకుంది.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఎడారిలో విక‌సించిన స్వ‌ర్ణ క‌మ‌లం

నచ్చితే షేర్ చేయ్యండి

రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం అందించి దేశ కీర్తిని ప్ర‌పంచ న‌లు దిశ‌ల‌కు చాటాడు దేవేంద్ర ఝ‌ఝారియా. 2004 ఏథెన్స్ పారాలింపిక్స్‌లొ కూడా ఝఝూరియా స్వర్ణం సాధించాడు. పారాలింపిక్స్‌లో రెండుసార్లు గోల్డ్ మెడ‌ల్ సాధించడం వెనుక అత‌ని కృషి ఎంతో ఉంది. దేశంలోని క్రీడాకారులు అత‌న్ని ఆద‌ర్శంగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. దేవేంద్ర వయసు 35 ఏళ్లు. స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో కోచ్ గా చేస్తున్నాడు. రాజస్తాన్ లోని చురు జిల్లాలో అతని స్వగ్రామం ఉంది. తొమ్మిదేళ్ల వయసులో ఎలక్ట్రిక్ షాక్ తగలడం వల్ల ఎడమ చేయి కోల్పోవాల్సి వచ్చింది. లైవ్ కేబుల్ ను పట్టుకోవడం వల్ల చేతికి షాక్ తగిలింది. దీంతో ఇక అత‌ని ప‌ని అయిపోయింద‌ని అంతా అనుకున్నారు. ఇక అత‌ను మంచానికే ప‌రిమితం అనుకున్నారు. కానీ దేశం గ‌ర్వ‌ప‌డే విధంగా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఎంపీ క‌విత‌ను క‌లిసిన‌ యంగ్ క్రికెట‌ర్లు

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త్ అండ‌ర్‌-16 జ‌ట్టు ప్రాబ‌బుల్స్‌కు ఎంపికైన ఇద్ద‌రు యంగ్ క్రికెట‌ర్ల‌ను నిజామాబాద్ ఎంపీ క‌విత అభినందించారు. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని, దేశ‌కీర్తితో పాటు రాష్ట్రానికి పేరు తీసుకురావాల‌ని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ ప్ర‌భుత్వం క్రీడ‌ల‌కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని, స్కూల్ స్థాయి నుంచి ఆట‌ల‌ను ఎంక‌రేజ్ చేస్తామ‌ని ఆమె చెప్పారు. తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ అధ్వ‌ర్యంలో ఎంపికైన క్రికెట‌ర్ల‌తో పాటు, కోచ్‌లు, సెక్ర‌ట‌రీలు ఎంపీని క‌లిశారు. గ‌త మూడు నెల‌లుగా..క్యాట్ అధ్వ‌ర్యంలో స్కూల్‌స్థాయి క్రికెట్ పోటీల‌ను నిర్వ‌హించారు. వీటిలో స‌త్తాచాటిన విద్యార్థులు జాతీయ స్థాయిలోనూ త‌న ప్ర‌తిభ‌ను క‌న‌ప‌ర్చారు. అంతేకాదు..ప్ర‌క‌టించిన 38ప్రాబ‌బుల్స్‌లో ఇద్ద‌రు తెలంగాణ‌కు చెందిన వారికి అవ‌కాశం ద‌క్కింది. హైద‌రాబాద్‌కు చెందిన శ్ర‌వ‌ణ్‌తో పాటు, ఖ‌మ్మం అంకుర్ అండ‌ర్‌-16 క్రికెట్ జ‌ట్టులో స్థానం ద‌క్కింది. ఇదే జ‌ట్టుకు మేనేజ‌ర్‌గా సునీల్ బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈయ‌న…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్

నచ్చితే షేర్ చేయ్యండి

టెన్నిస్‌లో ఓ ఆట‌గాడిని డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్‌గా పోల్చాడు ర‌ఫెల్ నాద‌ల్‌. టెన్నిస్ నాద‌లే డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్ అలాంటిది నాద‌ల్ ఓ ఆట‌గాడిని డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్‌గా పోల్చ‌డం ఆసక్తిక‌రంగా మారింది. ఇంత‌కీ నాద‌ల్ ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడ‌ని చెప్పిన ఆట‌గాడెవ‌రు అని అంతా ఆరా తీసే ప‌నిలో ప‌డ్డారు. అయితే అత‌ని పేరును కూడా నాద‌లే చెప్పాడు. డేవిస్‌కప్‌ పోరులో తలపడేందుకు భారత్‌ చేరుకున్న‌రఫెల్‌ నాదల్‌, ఇటీవ‌ల యూఎస్ ఓపెన్‌లో టైటిల్ గెలిచిన వావ్రింకాను డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్‌గా పేర్కొన్నాడు. వావ్రింకాను సూపర్‌ డేంజరస్ ఆటగాడ‌ని అభివర్ణించాడు నాద‌ల్‌. లేటు వయసులో దూసుకొచ్చిన వావ్రింకా టాప్‌ ప్లేయర్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనగలడని, దీనికి యూఎస్‌ ఓపెన్‌ ఫైనలే దానికి ఉదాహరణ అంటున్నాడు. గత రెండేళ్లుగా వావ్రింకా అద్భుతంగా ఆడుతున్నాడని, ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడని తెలిపాడు. నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌లో నాలుగో రౌండ్లోనే నాద‌ల్‌ వెనుదిర‌గ‌గా,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

తంబీ తంగ‌వేలుపై త‌ప్పుడు ప్ర‌చారం..

నచ్చితే షేర్ చేయ్యండి

పారాలింపిక్స్‌లో స్వ‌ర్ణం గెలిచి స‌త్తాచాటిన‌ మ‌రియ‌ప్ప‌న్ తంగ‌వేలుపై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంది. సోష‌ల్ మీడియాలో అత‌ను టార్గెట్‌గా కొంద‌రు అన‌వ‌స‌ర స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఇంకా భార‌త్‌కు రాని ఈ బంగారు విజేత‌ను ఎలాగైనా బ్యాడ్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిపై లోతుగా విచార‌ణ చేసిన తంగ‌వేలుకు షాకింగ్ న్యూస్ తెలిసింది. వెంట‌నే జాగ్ర‌త్త‌ప‌డ్డ తంగ‌వేలు, బ్యాడ్ ప‌బ్లిసిటీపై చాలా తెలివిగా స‌మాధానం చెప్పాడు. రెండు రోజుల క్రితం..త‌న‌కు ప్ర‌క‌టించిన న‌జ‌రానాలో 30ల‌క్ష‌లు తంగ‌వేలు చ‌దువుకున్న స‌ర్కార్ స్కూల్‌కు ప్ర‌క‌టించిన‌ట్టు వార్త షికారు చేసింది. పేప‌ర్ల‌లో, టీవీల్లో అత‌ని ఉదార స్వ‌భావంపై క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే, ఈ విరాళంపై తంగ‌వేలు స్పందించాడు. చ‌దువుకున్న స్కూల్‌కు ఏం చేయాలో త‌న‌కు బాగా తెలుస‌ని, ఇలాంటి వార్త‌లపై స్పందించాల్సిన‌వ‌స‌రం లేద‌న్నాడు. మ‌రోవైపు..తన చేతికి అంద‌ని డ‌బ్బుల‌తో ఏం చేస్తానో ఇప్పుడే చెప్ప‌డం తొంద‌ర‌పాటు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

న‌న్ను టార్గెట్ చేశారు…

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా మాజీ ఓపెన‌ర్ గౌత‌మ్ గంభీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కివీస్‌తో జ‌ర‌గ‌బోయే సిరీస్‌కు ఎంపిక కాక‌పోవ‌డంపై తీవ్ర నిరాశ వ్య‌క్తం చేసిన గంభీర్‌..ట్విట్ట‌ర్‌లో ఘాటుగా స్పందించాడు. అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నా…గంభీర్‌ను టీమ్‌లోకి తీసుకోక‌పోవ‌డంతో అభిమానులు కూడా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో గంభీర్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిలో ఉత్కంఠ పెంచుతున్నాయి. మ‌రోవైపు ఎవ‌రిని టార్గెట్ చేశాడ‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. గంభీర్ ట్విట్ట‌ర్‌లో త‌న‌ని కార్న‌ర్ చేశార‌ని చెప్పుకోచ్చాడు. అంతేకాదు..నేనే నిరాశ చెందాను కానీ ఓడిపోలేద‌న్నాడు. ధైర్య‌మున్న‌వాడిగా ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాన‌ని, ఆ జోరు అలాగే కొన‌సాగుతుంద‌న్నాడు. మ‌రోవైపు..గంభీర్‌కు కోహ్లీకి గ‌తంలో విభేదాలున్నాయి. అంత‌కుముందు ఉన్న ధోనీతో కూడా అభిప్రాయ‌భేదాలున్నాయి. ఇలాంటి టైమ్‌లో గంభీర్ టీమ్‌లోకి రావ‌డం పెద్ద వార్త‌నేన‌ని ఓపెన్‌గానే అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. మ‌రీ..వీటిపై మిగిలిన వారు ఎలా స్పందిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పారాలింపిక్స్‌లో భార‌త్‌కు మ‌రో రికార్డ్ స్వ‌ర్ణం

నచ్చితే షేర్ చేయ్యండి

రియోలో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త్‌కు మ‌రో స్వ‌ర్ణం ద‌క్కింది. జావెలిన్ త్రోలో దేవేంద్ర రుఝారియా బంగారు ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. 63.97మీట‌ర్ల దూరం జావెలిన్‌ను త్రో చేసిన దేవేంద్ర‌…స‌రికొత్త వ‌ర‌ల్డ్ రికార్డ్‌ను నెల‌కొల్పాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లోనూ దేవేంద్ర బంగారు ప‌త‌కం గెలిచాడు. ఇప్పుడు అదే స్పీడ్‌ను ప్ర‌ద‌ర్శించి మ‌రోసారి అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో ప‌త‌కం సాధించ‌డ‌మే కాదు..దేశ‌కీర్తిని రెప‌రెప‌లాడించాడు. పారాలింపిక్స్‌లో భార‌త్ ఇప్ప‌టికే ఓ స్వ‌ర్ణం, సిల్వ‌ర్‌, బ్రాంజ్‌ను సొంతం చేసుకున్నాయి. దేవేంద్ర ఆ ఉత్సాహ‌న్ని రెట్టింపు చేస్తూ ఇప్పుడు మ‌రో ప‌త‌కాన్ని దేశానికి అందించాడు. మొత్తంగా…అత‌ను సాధించిన ప‌త‌కంతోనే ప్ర‌భుత్వ పెద్ద‌లు క‌ళ్లు తేరుస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఓపెనింగ్ సెర్మ‌నీలో దేవేంద్ర జాతీయ ప‌తాకదారి. ఇప్పుడు అత‌ను స్వ‌ర్ణంతో దేశానికి తాను ఎంత విలువైన సేవ‌లు అథ్లెటో మ‌రోసారి అంద‌రికి గుర్తు చేశాడు.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More