సంబ‌రాల హేల‌

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త్‌లో మ‌రోసారి క్రికెట్ ఫీవ‌ర్ ఆవ‌హించింది. ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగి చాలా రోజులు కావ‌డంతో శ‌నివారం మీర్పూర్‌లో జ‌రిగిన మ్యాచ్ చూసేందుకు జ‌నం ఎగ‌బ‌డ్డారు. స్టేడియం క్రికెట్ ఫ్యాన్స్‌లో కిక్కిరిసిపోగా, ఇటు దేశంలోని వివిధ న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో జ‌నం టీవీల‌కు అతుక్కుపోయారు. భార‌త్, పాక్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ను చూసేందుకు జ‌నం ఉత్సాహం చూపించారు. దేశంలోని వివిధ న‌గ‌రాల్లో కొన్నిచోట్ల స్పెష‌ల్ స్ర్కీన్స్ ఏర్పాటు చేశారు. వాటి ద‌గ్గ‌ర జ‌నం కేరింత‌లు కొడుతూ ఆట‌ను ఎంజాయ్ చేశారు. బ‌స్‌స్టేష‌న్‌, రైల్వేస్టేష‌న్‌, టీవీషోరూమ్స్ ఇలా టీవీల్లో మ్యాచ్ లైవ్ టెలికాస్ట్‌ను జ‌నం విర‌గ‌బ‌డి చూశారు.
దేశంలోని వివిధ న‌గ‌రాల్లో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఎక్క‌డ చూసినా మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసే దృశ్యాలే క‌నిపించాయి ఇక మ్యాచ్ ముగిశాక భార‌త్ జెండాలు చేత‌బూని సంబ‌రాలు చేసుకున్నారు. భార‌త్‌, పాక్ మ‌ధ్య మ్యాచ్ ఎప్పుడు జ‌రిగిన అది ఉత్కంఠ‌ను, ఉద్వేగాన్ని క‌లిగిస్తుంది. బంగ్లాదేశ్‌లోని మీర్పూర్‌లో జ‌రిగిన మ్యాచ్ కోసం కూడా క్రికెట్ అభిమానుల్లో అదే ఉద్వేగం క‌నిపించింది. జ‌రిగేది టీ20 మ్యాచ్ కావ‌డంతో జ‌నాల్లో క్రేజ్ మ‌రింత పెరిగింది. అయితే ఎట్ట‌కేల‌కు వ‌న్‌సైడెడ్‌గా జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించ‌డంతో భార‌త్ క్రికెట్ అభిమానులు సంబ‌రాల్లో మునిగితేలారు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts