భార‌త్‌, పాక్ ఆడ‌క‌పోతే న‌ష్టం లేదు

నచ్చితే షేర్ చేయ్యండి

వ‌ర‌ల్డ్ క్రికెట్ అంతా భార‌త్‌, పాక్ సిరీస్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వేళ‌..అస‌లు వారిద్ద‌రి మ‌ధ్య పోటీ జ‌ర‌గ‌క‌పోతే న‌ష్ట‌మేమీ లేద‌న్నాడు గ‌వాస్క‌ర్‌. ఎందుకు అంద‌రూ ఆ సిరీస్ జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నారో, ఆ ఒక్క సిరీస్‌కే ఎందుకు అంత హైప్ క్రియేట్ చేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు. క్రికెట్‌లో ఎవ‌రు ఆడినా డ్రామా ఉంటే స‌రిపోతుంద‌ని, దానికి త‌గ్గ‌ట్టు స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శిస్తే బాగుటుంద‌న్నాడు. రెండు ప‌క్క ప‌క్క దేశాలు క‌ల‌సి ఆడ‌కుంటే న‌ష్ట‌మేమీ లేద‌న్నాడు.

ప్ర‌స్తుతం భార‌త్‌, పాక్ సిరీస్‌పై డైల‌మా కొన‌సాగుతోంది. రెండు జ‌ట్లు క‌లిసి ఆడితే చూడాల‌ని కోట్లాది మంది అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అలాంటి టైమ్‌లో..సునీల్ గ‌వాస్క‌ర్ కామెంట్స్ ఆస‌క్తిని క‌ల్గిస్తున్నాయి. రీసెంట్‌గా గ‌వాస్క‌ర్‌, పాక్ ఆడిన చాలా మ్యాచ్‌లు దుబాయ్‌, షార్జా వేదిక‌ల‌కు వెళ్లి మ‌రీ చూశాడు. వ‌సీం అక్ర‌మ్‌తో పాటు, మిగిలిన కామెంటేట‌ర్స్‌తో ఉన్న రిలేష‌న్‌తో అలా వెళ్లిన‌ట్టు చెప్పిన స‌న్నీ..భార‌త్‌, పాక్ మ్యాచ్‌ను కేవ‌లం ఓ గేమ్‌ను చూడాల‌న్నాడు.

షెడ్యూల్ ప్ర‌కారం..డిసెంబ‌ర్ నెల‌లో భార‌త్‌, పాక్ సిరీస్ జ‌ర‌గాలి. అయితే, రెండు దేశాల స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డ‌టం. అదే టైమ్‌లో పాక్ కాల్పుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ‌టంతో క్రికెట్ కాస్త పొలిటిక‌ల్ వార్‌గా మారింది. వేదిక‌పై కూడా కాస్త గంద‌ర‌గోళం ఏర్ప‌డి, చివ‌రికి శ్రీలంక‌ను డిసైడ్ చేశారు. అయితే, ఇప్ప‌టికీ ఈ సిరీస్‌పై డైల‌మా కొన‌సాగుతూనే ఉంది. ఇలాంటి టైమ్‌లో గ‌వాస్క‌ర్ కామెంట్స్ ఆస‌క్తిని పెంచుతున్నాయి. అంతేకాదు..సిరీస్ ఉండ‌క‌పోవ‌చ్చ‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూర్చుతుంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts