ధావ‌న్ బౌలింగ్ సందేహాస్ప‌దం

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా ఓపెన‌ర్ బౌల‌ర్ అవ‌తారం ఎత్తి కొత్త త‌ల‌నొప్పులు తెచ్చుకుంటున్నాడు. ఢిల్లీ టెస్ట్‌లో పార్ట్‌టైమ్ ఆఫ్‌స్పిన్న‌ర్ అవ‌తారం ఎత్త‌డం ఇప్పుడు అత‌న్ని చిక్కుల్లో ప‌డేసింది. నీ బౌలింగ్ అనుమాన‌స్ప‌దమ‌ని ధావ‌న్‌కు మ్యాచ్ రిఫ‌రీ తేల్చిచెప్ప‌డ‌మే కాకుండా, ఐసీసీకి ఫిర్యాదు చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాదు..మ‌రో 14రోజుల్లో ఐసీసీ ప్యానెల్ ముందు ధావ‌న్ హాజ‌రు కావాల్సిన‌వ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టికే బీసీసీఐకి స‌మాచారం అందింది.

ఢిల్లీ టెస్ట్‌లో డ్రా కోసం ప్ర‌య‌త్నించిన స‌ఫారీల‌ను కంగారుపెట్టేందుకు కోహ్లీ, దావ‌న్‌తో బౌలింగ్ చేయించాడు. మూడు ఓవ‌ర్లు ధావ‌న్ బౌలింగ్ చేశాడు. ఫ‌స్ట్ ఓవ‌ర్లోనే రెండు బంతులు అద్భుతంగా వేసి, ఆమ్లాను ఔట్ చేసినంత ప‌నిచేశాడు. అయితే, అత‌ని బౌలింగ్ తీరుపై అంపైర్లు అనుమానాలున్నాయంటూ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీన్ని విచార‌ణ‌కు స్వీక‌రించిన ఐసీసీ మ‌రో 14రోజుల్లో ధావ‌న్ బౌలింగ్‌ను ప‌రీక్షిస్తామ‌ని చెప్పింది.

ఏదో కెప్టెన్ అడిగాడు క‌దా అని స‌ర‌ద‌గా బౌలింగ్ చేస్తే, ఇలా రూల్స్ అంటే ఎలా అని ధావ‌న్ స‌ర‌దాగా కామెంట్ చేస్తున్నాడు. రూల్స్‌కు వ్య‌తిరేకంగా ఉంటే బౌలింగ్ వేయ‌డం మానేయ‌డం త‌ప్ప వేరే ప‌నేమీ లేద‌న్నాడు. అస‌లు బౌలింగ్ చేయ‌డం వ‌ల్ల త‌న‌కు క‌లిగే లాభం కూడా ఏం లేద‌ని అయితే, కీల‌క టైమ్‌లో అవ‌స‌ర‌మైతేనే ఇలా అంటూ బ‌దులిచ్చాడు. ఐసీసీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎంక్వైరీకి వెళ్తాన‌ని ధావ‌న్ స్ప‌ష్టం చేశాడు. బ్యాటింగ్‌లో విఫ‌ల‌మై, ఇలా వేసిన బంతుల‌తోనూ చిక్కుల్లో ప‌డ‌టం ధావ‌న్‌ను ఇబ్బందిపెడుతోంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts