తెలుగు తేజాల‌కు క్రీడాప‌ద్మాలు

sania-saina_0_0
నచ్చితే షేర్ చేయ్యండి

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌ద్మా అవార్డ్‌ల్లో తెలుగు తేజాలు స‌త్తాచాటారు. టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బ్యాడ్మింట‌న్ ఐకాన్ సైనా నెహ్వాల్‌కు ప‌ద్మ‌భూష‌ణ్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వీరిద్ద‌రు గ‌త కొన్నేళ్లుగా త‌మ ఆట‌స్థాయిని ఉహించ‌ని స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సైనాతో బ్యాడ్మింట‌న్‌కు కొత్త క‌ళ వ‌స్తే, సానియా మీర్జా టెన్నిస్‌ను అగ్ర‌స్థానానికి తీసుకెళ్లింది.

సానియా మీర్జా లాస్ట్ ఇయ‌ర్ రాజీవ్ గాంధీ ఖేల్‌ర‌త్న అవార్డ్ గెల్చుకుంది. ఈ ఏడాది ప‌ద్మ‌భూష‌ణ్‌ను ద‌క్కించుకుంది. ఈరెండు అవార్డ్‌లు ఆమె ఆట‌స్థాయిని అమాంతం పెంచేశాయి. అంతేకాదు, ఇటీవ‌లే మార్టినా హింగీస్‌తో క‌లిసి వ‌రుస‌గా 29విజ‌యాలు సాదించి స‌రికొత్త హిస్ట‌రీని క్రియేట్ చేసింది.

సైనా నెహ్వాల్ కూడా ప‌ద్మ‌భూష‌ణ్‌ను ద‌క్కించుకోవ‌డంపై ఆమె కుటుంబ‌స‌భ్యులు సంతోషం వ్య‌క్తం చేసింది. అంతేకాదు..ఆమెకు ఈ అవార్డ్ ఎప్పుడో రావాల్సింద‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్ప‌టికీ సైనాను గుర్తించార‌ని వారు అన్నారు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts