ఢిల్లీ టెస్ట్‌లో విద్యార్థుల‌పై…

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న నాల్గో టెస్ట్‌లో విద్యార్థుల‌పై పోలీసులు ప్ర‌తాపం చూపారు. రూల్స్ పేరుతో వారు చేసిన ప‌నికి స్టేడియంలో ఉన్న వేలాది మంది చిన్నారులు ప‌స్తులుండిపోయారు. ఢిల్లీ సీఎం ఆదేశించినా..రూల్ అంటే రూలే అన్న‌ట్టు పోలీసులు వ్య‌వ‌హ‌రించ‌డంతో మ్యాచ్ చూడ‌టానికి వ‌చ్చిన చిన్నారులు అంద‌రూ ఖాళీ క‌డుపుల‌తోనే స్టేడియంలో క్రికెట్‌ను ఎంజాయ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

వివాదాల మ‌ధ్య నాల్గో టెస్ట్‌కు అతిధ్య‌మిచ్చిన ఢిల్లీలో..8220 మంది చిన్నారుల‌కు ఒక్కొక్క‌రికి 50రూపాయాల‌తో ఎంట్రీ క‌ల్పించారు. వాళ్లంద‌రికి ఢిల్లీ గ‌వ‌ర్న‌మెంట్ లంచ్‌ను ప్రొవైడ్ చేస్తోంది. అదే టైమ్‌లో ఢిల్లీ క్రికెట్ అసోసియేష‌న్ అంద‌రికి స్నాక్స్ ఇస్తోంది. అయితే, వీటిపై ఢిల్లీ పోలీసులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. మైదానాల్లో సెక్యూరిటీ రీజ‌న్స్‌తో లంచ్ చేయ‌డానికి అనుమ‌తించ‌మ‌ని తేల్చిచెప్పేశారు. దీంతో ఉద‌యం 9 30నిమిషాల‌కు గ్రౌండ్‌లోకి వ‌చ్చిన పిల్ల‌ల‌కు సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు ఖాళీ క‌డుపుతోనే ఉంటున్నారు.

ఈ తీరుపై పోలీసుల‌ను ప్ర‌శ్నిస్తే, మాకు ఉన్న రూల్స్ ప్ర‌కారం..వారిని స్టేడియంలో తిన‌డానికి అనుమ‌తించ‌డం లేద‌ని తేల్చేశారు. అదే టైమ్‌లో విద్యార్థులు బాక్స్‌లు తీసుకురాకుండా ఉంటే మంచిద‌ని చెప్పారు. ఈ తీరుపై ఇప్పుడు అంత‌టా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. టెస్ట్ మ్యాచ్‌ల్లో ఎక్కువ‌గా సీట్లు ఖాళీగా ఉండ‌టంతో జ‌స్టిస్ ముద్గ‌ల్ ఇచ్చిన ఐడియాతో విద్యార్థుల‌ను స్టేడియాల్లోకి అనుమ‌తించారు. ఢిల్లీ గ‌వ‌ర్న‌మెంట్ కూడా వారికి అనుకూలంగా లంచ్‌ను ప్రొవైడ్ చేస్తోంది. అయితే, ఇలా రూల్స్ పేరుతో చిన్నారుల‌ను ఇబ్బంది పెట్ట‌డం ఓ రోజంతా ఆక‌లికి దూరంగా ఉంచ‌డం నిజంగా క్ష‌మించ‌రాని నేర‌మ‌నే విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts