డివిలియ‌ర్స్ హిట్టింగ్‌కు ఇంగ్లండ్ బేజారు

నచ్చితే షేర్ చేయ్యండి

ఇంగ్లండ్‌తో జ‌రిగిన టీట్వంటీ సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్ చేసింది. వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ జ‌ట్టు త‌డ‌బ‌డ‌టం, స‌ఫారీల‌కు ఏబీ డివిలియ‌ర్స్‌, హాషీమ్ ఆమ్లా దూకుడైన ఆట‌తీరుతో అదిరే ఆరంభాన్నివ్వ‌డంతో రెండు మ్యాచ్‌ల టీట్వంటీ సిరీస్‌ను స‌ఫారీలు 2-0తో గెలిచి స‌త్తాచాటారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న స‌ఫారీల‌ను ఆరంభంలో ఇంగ్లండ్ ఎదురుదాడితో కంగారుపెట్టింది. రూట్‌, మోర్గాన్ బారీ షాట్ల‌తో అల‌రించారు. వీరికి తోడుగా బ‌ట్ల‌ర్‌..కేవ‌లం 28బంతుల్లోనే 4ఫోర్లు, 4సిక్స‌ర్ల‌తో 54ర‌న్స్ చేసి టీమ్‌ను ప‌టిష్ట‌స్థితిలో నిలిపాడు. ఈ టైమ్‌లో స‌ఫారీ బౌల‌ర్లు ఒక్క‌సారి మ్యాచ్‌ను మ‌లుపు తిప్పారు. ఫ‌లితంగా..ఇంగ్లండ్ జ‌ట్టు రెండు వంద‌లు దాటాల్సిన మ్యాచ్‌లో కేవ‌లం 171ప‌రుగుల‌కే ప్యాక‌ప్ అయ్యింది. చివ‌రి 7వికెట్లు ఇంగ్లండ్ కేవ‌లం ప‌ద్నాలుగు ప‌రుగుల‌కే కోల్పోయింది.

172ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌ఫారీల‌కు డివిలియ‌ర్స్‌, ఆమ్లా అదిరే ఆరంభాన్నిచ్చారు. డివిలియ‌ర్స్ 29బంతుల్లో 6ఫోర్లు, ఆరు సిక్స‌ర్ల‌తో 71ప‌రుగులు చేస్తే, ఆమ్లా..38బంతుల్లో 8ఫోర్లు 3భారీ సిక్స‌ర్ల‌తో 69ప‌రుగులు చేశాడు. డూప్లిసిస్ 22ర‌న్స్ చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో స‌త్తాచాటిన ఇమ్రాన్ తాహీర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ల‌భించింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts