ట‌పాసుల్లా పేలుతున్న యాడ్స్‌

నచ్చితే షేర్ చేయ్యండి

B94hpJuCYAA1vL7

వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో యాడ్స్ అంద‌రిలో ఆస‌క్తి రేపుతున్నాయి. మోకా మోకా అంటూ క్రికెట్ ఫ్యాన్స్‌లో కొత్త క్రేజ్ తీసుకొచ్చాయి. వ‌ర‌ల్డ్‌క‌ప్‌పై అభిమానుల్లో మ‌రింత ఊపు తీసుకొచ్చేందుకు స్టార్ స్పోర్ట్స్ చాన‌ల్ రూపొందించిన యాడ్స్ స్పోర్ట్స్ ల‌వ‌ర్స్‌ని విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా విజ‌యం కోసం రూపొందించిన యాడ్స్ భార‌త అభిమానుల మ‌న‌సు దోచుకున్నాయి.

sa-ma_1424327743_1424327747

వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌యం సాధించ‌ని పాక్ టీమ్‌ను సెటైరిక్‌గా రూపొందించిన యాడ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈసారైనా ట‌పాసులు పేల్చాల‌ని పాక్ అభిమాని మ్యాచ్ చూస్తున్న యాడ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ యాడ్స్‌ల ప‌రంప‌ర అలా మొద‌లైంది. ఆ త‌ర్వాత మ‌రో యాడ్‌లో భార‌త అభిమానుల ద‌గ్గ‌రికి వ‌చ్చిన సౌతాఫ్రికా ఫ్యాన్స్‌, ట‌పాసులు ఈసారైనా పేల్చాల‌ని ఇచ్చేసి వెళ్తారు. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా చ‌రిత్ర సృష్టించింది. స‌ఫారీ టీమ్‌పై ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఇక ట‌పాసులు పేల్చండి అంటూ మీడియాలో ప్ర‌ముఖంగా వార్త‌లు ప్ర‌చురించారు.

B94dGi9CQAAGXXm

ఈ యాడ్స్‌లో భార‌త్ ఓడిపోవాల‌ని ప్ర‌య‌త్నించే పాక్ అభిమాని పాత్ర అంద‌రినీ ఆక‌ట్టుకుంది. చివ‌రికి సౌతాఫ్రికా కూడా టీమిండియా చేతిలో ఓడిపోవ‌డంతో పాక్ అభిమాని అస‌హ‌నానికి గుర‌వుతాడు. యుఏఈ అభిమానికి త‌న చొక్కా ఇచ్చి వెళ్తాడు. తాజా యాడ్‌ కూడా భార‌త అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది.

the-elusive-maukaa

ఆ విధంగా స్టార్‌స్పోర్ట్స్ రూపొందించిన యాడ్స్‌కి మంచి క్రేజ్ రావ‌డంతో ఇక వాటికి సీక్వెల్ రూపొందించే ప‌నిలో ప‌డింది చాన‌ల్ యాజ‌మాన్యం. తాజాగా యుఏఈతో జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌కు సంబంధించి కూడా సీక్వెల్ యాడ్ త‌యారు చేశారు. దీంతో అటు ఉత్కంఠ‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌ల‌తో పాటు సెటైరిక్ యాడ్స్ కూడా క్రికెట్ ల‌వ‌ర్స్‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి..

-న‌రేష్ కందుల‌


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts

Leave a Comment