తెలంగాణ ప్రీమియ‌ర్ క‌బ‌డ్డీ లీగ్ విజేత రైడ్ రైడ‌ర్స్‌

నచ్చితే షేర్ చేయ్యండి

తెలంగాణ ప్రీమియ‌ర్ క‌బ‌డ్డీ లీగ్‌ను రెడ్డి రైడ్ రైడ‌ర్స్ ద‌క్కించుకుంది. గ‌ద్వాల్ గ్లాడియేట‌ర్స్‌తో జ‌రిగిన పోటీలో రెడ్డి రైడ్ రైడ‌ర్స్ జ‌ట్టు, 37-17తేడాతో ట్రోఫీని ద‌క్కించుకుంది. కంప్లీట్ వ‌న్‌సైడ్‌గా జ‌రిగిన మ్యాచ్‌లో రెండు జ‌ట్ల డిఫెండ‌ర్లు ఆక‌ట్టుకున్నా, రైడ్ రైడ‌ర్స్ జ‌ట్టు రైడ‌ర్స్ మాత్రం అదిరిపొయే ఆట‌తో ఫుల్‌గా అల‌రించారు. క‌రీంన‌గ‌ర్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ పోటీల్లో ఆట‌గాళ్ల దూకుడు అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

ఫ‌స్టాప్ ముగిసే టైమ్‌కి రైడ్ రైడ‌ర్స్ జ‌ట్టు 16-09తో లీడ్‌లో నిలిచింది. వాళ్లు సెకండాఫ్‌లోనూ ఇదే దూకుడిని ప్ర‌ద‌ర్శించారు. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా దూకుడిగా ఆడి ఆక‌ట్టుకున్నారు. దీంతో..సెకండాఫ్‌లో మ్యాచ్ కంప్లీట్ వ‌న్‌సైడ్‌గా మారింది. ఫ‌లితంగా రెడ్డి రైడ్ రైడ‌ర్స్ విజ‌యం సాధించారు.

ఫైన‌ల్ విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను ఈటెల రాజేంద‌ర్‌తో పాటు, కిష‌న్ రెడ్డి అంద‌జేశారు. వారంతా క‌బ‌డ్డీ ఆట‌కు పెరుగుతున్న క్రేజ్‌తో పాటు, ప్లేయ‌ర్స్ పొరాట‌ప‌టిమ‌ను ఫుల్‌గా అభినందించారు. మొత్తంగా..తొలి క‌బ‌డ్డీ లీగ్ రెండు జిల్లాల్లో ఫుల్‌గా మార్కులు కొట్టేసింది. అయితే, ఈ లీగ్‌ను రాష్ట్ర‌వ్యాప్తంగా క్రేజ్ తీసుకురావ‌డంలో ఆర్గ‌నైజ‌ర్స్ విఫ‌ల‌మ‌య్యారు. కాస్త ప‌బ్లిసిటీపై దృష్టిపెట్టి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌నే కామెంట్స్‌కు చేరువ‌య్యారు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts