న్యూ ఇయ‌ర్ లో జాగృతి క్రికెట్ పోటీలు

నచ్చితే షేర్ చేయ్యండి

తెలంగాణ పండుగ‌ బ‌తుకమ్మ‌కు ప్ర‌పంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన తెలంగాణ జాగృతి…క్రీడ‌ల పైనా ఫోక‌స్ చేసింది. తెలంగాణ‌లోని ప్ర‌తిభ‌ను వెలికి తీసేందుకు న‌డుం బిగించింది. గ్రామీణ యువ‌తలో క్రీడా నైపుణ్యాల‌ను పెంపొందించ‌డంతో పాటు వారి ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించాల‌నే ల‌క్ష్యంతో తెలంగాణ జాగృతి క్రికెట్ క‌ప్ ను నిర్వ‌హిస్తోంది. ఈ క‌ప్ ను నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత హైద‌రాబాద్ లో ఆవిష్క‌రించారు. జ‌న‌వ‌రి 7 నుంచి 23 వ‌ర‌కు ఈ పోటీలు జ‌రుగుతాయ‌ని తెలంగాణ జాగృతి తెలిపింది.

తెలంగాణ‌లోని పాత ప‌ది జిల్లాల‌నే ప‌ది జోన్లుగా విభజించి క్రికెట్ పోటీల‌ను నిర్వ‌హిస్తోంది. నాకౌట్ ప‌ద్ధ‌తిలో పోటీలు జ‌రుగుతాయ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ప్ర‌తీ జోన్ నుంచి గ‌రిష్టంగా 24 టీమ్ లు పాల్గొన‌నున్నాయి. మొత్తం 240 జ‌ట్లు ఈ పోటీలు పాల్గొన‌నున్నాయి. ప్ర‌తీ జోన్ లో రెండు కేంద్రాల్లో ఈ పోటీలు జ‌రుగుతాయి. ప్ర‌తీ జోన్ లో విజేత‌గా నిలిచిన జ‌ట్టు రాష్ట్ర స్థాయిలో ఆడుతుంది. జ‌న‌వ‌రి 17 నుంచి 22 వ‌ర‌కుహైద‌రాబాద్ లో జ‌రిగే మ్యాచుల్లో 10 జ‌ట్లు త‌ల‌ప‌డుతాయి. సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి రోజున (జ‌న‌వ‌రి 23) హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతుంది.

ప్రైజ్ మ‌నీ కూడా భారీగానే ఏర్పాటు చేసింది తెలంగాణ జాగృతి. జోన్ స్థాయిలో విజేత‌కు 30వేల రూపాయ‌లు, ర‌న్న‌ర‌ప్ కు 15 వేల రూపాయ‌లు అంద‌జేయ‌నుంది. ఫైన‌ల్లో విజేత‌కు రూ.3ల‌క్ష‌లు, ర‌న్న‌ర్ కు రూ.1.50ల‌క్ష‌లు అందజేయ‌నున్న‌ట్టు తెలంగాణ జాగృతి తెలిపింది. జ‌న‌వ‌రి 2 నుంచి 4వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్లు చేసుకోవాల‌ని, జిల్లాల్లోని జాగృతి కార్యాల‌యాల్లో ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5గంట‌ల‌కు వ‌ర‌కు టీంల వివ‌రాలు ఎంట‌ర్ చేసుకోవాల‌ని నిర్వాహ‌కులు తెలిపారు. అద‌న‌పు స‌మాచారం కోసం 040-40213214(తెలంగాణ జాగృతి ప్ర‌ధాన కార్యాల‌యం)లో సంప్ర‌దించాల‌ని తెలిపారు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts