టీమిండియాను దాటేసిన ఆస్ట్రేలియా

నచ్చితే షేర్ చేయ్యండి

స‌ఫారీల‌పై రెండో వ‌న్డేలో ఓడి, కీల‌క‌మైన మ్యాచ్ కోసం సిద్ధ‌మ‌వుతున్న భార‌త్‌ను…ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా దాటేసింది. వ‌రుస విజ‌యాల‌తో ట్రై సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆసీస్‌, ర్యాంకింగ్స్‌లో రెండోస్థానంలోకి దూసుకెళ్లింది. ఏకంగా ఆసీస్ టీమ్ 15పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 126రేటింగ్ పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్న పాకిస్తాన్‌తో స‌మానంగా నిలిచింది ఆసీస్‌. అయితే, 0.19 వ్య‌త్యాసం కార‌ణంగా ఆసీస్ రెండోస్థానానికి ప‌రిమిత‌మైంది.

ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న మూడు టీట్వంటీల సిరీస్‌లో ప్ర‌స్తుతం 1-1తో రెండు జ‌ట్లు స‌మానంగా ఉన్నాయి. అయితే, ఈ సిరీస్‌లో ఉన్న మూడు మ్యాచ్‌ల్లో ఓట‌మి లేకుండా మ‌నోళ్లు ముందుకెళ్లి ఉంటే, ర్యాంకింగ్స్‌లోనూ మ‌నోళ్లు అదే స్థానంలో ఉండేవారు. కానీ, రెండో టీట్వంటీ క్లాసెన్ మెరుపులు, డుమినీ డ‌మ‌రుకం ఆడించ‌డంతో సీన్ రివ‌ర్సైంది.

ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన ర్యాంకింగ్స్ లిస్ట్ క్రింద ఇవ్వ‌బ‌డిన‌ది గ‌మ‌నించ‌గ‌ల‌రు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts