ఫైన‌ల్లో నిరాశ‌ప‌ర్చిన సింధు

నచ్చితే షేర్ చేయ్యండి

బీడ‌బ్ల్యూఎఫ్ సూప‌ర్ సిరీస్ ఫైన‌ల్స్‌లో తెలుగుమ్మాయి పీవీ సింధు విజ‌యం ఫైన‌ల్లో ఓడిపోయింది. ఫైన‌ల్లో య‌మ‌గూచితో త‌ల‌ప‌డ్డ సింధు, అద్భుతైన పోరాట‌ప‌టిమ చూపించినా..విజ‌యం సమాత్రం సాధించ‌లేదు. ఈ టైటిల్‌ను గెల్చుకున్న తొలి భార‌త ష‌ట్ల‌ర్‌గా రికార్డ్‌ను సొంతం చేసుకోవాల‌నుకున్న సింధుకు నిరాశే మిగిలింది.

తొలి గేమ్‌లో పీవీ సింధు అద్భుత‌మైన ఆట‌తీరుతో అద‌ర‌గొట్టింది. య‌మ‌గూచిపై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌త్య‌ర్థికి అస‌లేమాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా తిరుగులేని దూకుడితో ప్ర‌త్య‌ర్థిని కంగారుపెడుతూ 21-15తో విజ‌యం సాధించింది. ఈ గేమ్ త‌ర్వాత జ‌రిగిన రెండో గేమ్‌లో య‌మ‌గూచి పుంజుకుంది. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా దూకుడు పెంచి, సింధును ఇర‌కాటంలో ప‌డేసింది. 21-12తో య‌మ‌గూచి, సింధును ఈ గేమ్‌లో ఓడించింది,

మూడో గేమ్ నువ్వా-నేనా అన్న‌ట్టు హోరాహోరీగా జ‌రిగింది. దీంతో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ ద‌శ‌లో వీరిద్ద‌రూ దూకుడిగా ఆడి స్కోర్ల‌ను స‌మం చేశారు. ఫ‌లితంగా…మ్యాచ్‌పై అభిమానుల్లో ఎక్క‌డ‌లేని ఉత్కంఠ పెరిగింది. చివ‌రికి య‌మ‌గూచి త‌న అనుభ‌వాన్నంతా ఉప‌యోగించ‌డంతో సింధుకి ఓట‌మి త‌ప్ప‌లేదు. వ‌రుస మ్యాచ్‌ల‌తో సింధు, మూడో గేమ్‌లో అనుకున్న స్థాయిలో రాణించ‌లేక‌పోయింది. దీంతో మూడో గేమ్‌లో సింధు 19-21తో మ్యాచ్‌ను కోల్పోయి ర‌న్న‌ర‌ప్‌గా మిగిలింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts