సిద్ధిపేట స్టేడియం చూడ‌త‌ర‌మా….!

నచ్చితే షేర్ చేయ్యండి

అది సిద్దిపేట‌….తెలంగాణ సిరుల జిల్లా. మా ఊరు మంచిర్యాలకు బ‌స్సుల పొయే ప్ర‌తిసారి చూసే ఊరే. సిద్దిపేట వ‌చ్చిందంటే మ‌రో రెండుగంట‌ల్లో హైద‌రాబాద్‌లా ఉంటం. లేదంటే, క‌రీంన‌గ‌ర్ ద‌గ్గ‌రికి వ‌చ్చేసినం అనుకునేటోళ్లం. అంతే, ఆ త‌ర్వాత హ‌రీష్ రావు గారు వ‌చ్చాకా…సిద్దిపేట ఇష్ట‌మైన న‌గ‌రంగా కూడా మారింది. అలాంటి సిద్దిపేట‌లో ఆదివారం నేను చూసిన దృశ్యం క‌ళ్ల‌ను ఇంకా వెంటాడుతూనే ఉంది. మెద‌డులో తొలుస్తూనే ఉంది.

2011లో అనంత‌పురంలో దూర‌ద‌ర్శ‌న్ త‌ర‌పున‌, ఓ సెల‌బ్రేటీ మ్యాచ్‌ను క‌వ‌రేజ్ చేయ‌డానికి వెళ్లి ఆర్డీటీ స్టేడియం చూసి ఎంత‌గా ఆశ్చ‌ర్య‌ప‌డ్డానో, అంత‌కంటే ఎక్కువే, సిద్దిపేట స్టేడియాన్ని చూసి అవాక్క‌య్యా. ఉప్ప‌ల్ స్టేడియం త‌ర్వాత‌, తెలంగాణ‌లో ఉన్న మ‌రో అద్భుత‌మైన గ్రౌండ్ ఏదైనా ఉంటే అది ఖ‌చ్చితంగా ఇదేన‌ని నొక్కి చెప్పొచ్చు. అంత‌లా, అద్భుతంగానే కాదు, క్రికెట్‌పై మ‌క్కువ ఉన్న క్రికెట‌ర్లు ఒక్క‌సారైనా ఆడాల‌నుకునేలా ఆక‌ట్టుకుంటోంది.

సిద్దిపేట‌లో మూడు రోజులుగా క్రికెట్ సంద‌డి క‌నిపిస్తోంది. హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అంతా ఇక్క‌డే పాగా వేసింది. తెలుగు రాష్ట్రాల ఎల‌క్ట్రానిక్ మీడియా ప్ర‌తినిధులంద‌రూ స్వ‌యంగా వెళ్లి క‌వ‌రేజ్ చేసుకొచ్చారు. యంగ్‌స్ట‌ర్స్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. అంత‌లా, సిద్దిపేట స్టేడియం హాట్‌టాపిక్‌గా మారింది. మైదానం, స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా, శాట్స్ ఆధ్వ‌ర్యంలోనే ఉన్నా…ఇంత చ‌క్క‌టి గ్రౌండ్‌ని భావిత‌రాల‌కు అందించాల‌నే ఉద్దేశంతో ఉన్న హెచ్‌సీఏ చ‌క్క‌గా వినియోగించుకుంటోంది.

హారీష్ రావు చేయూత‌…యువ‌త‌కు ఆస‌రా
మంత్రి హ‌రీష్ రావుకు, ఈ గ్రౌండ్‌కు అవినభావ సంబంధం ఉంది. ఆయ‌న‌…ఈ మైదానం కోసం ప‌దికోట్ల‌కుపైగానే ఖ‌ర్చుపెట్టార‌ని స్థానికులు చెబుతున్నారు. ఏళ్ల చ‌రిత్ర ఉన్న హెచ్‌సీఏ వ‌ల్ల కానీ, స్ఫూర్తివంత‌మైన మైదానాన్ని హారీష్‌రావు కేవ‌లం మూడేళ్ల‌లోనే సాధించి మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకోవ‌డ‌మే కాదు, హెచ్‌సీఏ, మిగిలిన అసోసియేష‌న్ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. మూడు రోజుల పాటు అక్క‌డ జ‌రిగే మ్యాచ్‌ల‌ను చూసేందుకు భారీ సంఖ్య‌లో అభిమానులు వ‌చ్చారు.

సిద్దిపేట స్టేడియం నిర్మించిన తీరు, పెవిలియ‌న్ ఎండ్‌, ప్రేక్ష‌కులు కూర్చునేందుకు చేసిన ఏర్పాట్లు ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. తెలంగాణ‌లో ఇంత మంచి క్రికెట్ మైదానం ఉందంటే కాస్త షాక్ కూడా క‌ల్గుతుంది. ఇదంతా ఒక్క‌డి కార్య‌దీక్షే. ఈ ల‌క్ష్యంతో…హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే..ఇలాంటి స్టేడియం పాత ప‌ది జిల్లాలో చూడ‌టం గ్యారెంటీ. ఇప్ప‌టికే, ఓ ప్రైవైట్ వ్య‌క్తి ఆదిలాబాద్‌లో నిర్మించిన స్టేడియం కూడా అంద‌రిని ఆక‌ర్షిస్తోంది.

ఇలాంటి స్టేడియాలు….యువ‌త‌లో కూడా క్రికెట్‌పై మ‌క్కువ‌తో పాటు, చూసే అభిమానుల్లో అంద‌రికి క్రేజ్ ఏర్ప‌డేలా చేస్తుంది. అంతేకాదు, ప్ర‌స్తుతం గ్రామీణ క్రీడ‌వైపు దృష్టి పెట్టిన వివేక్ అండ్ ప్యానెల్‌, ఇలాంటి మైదానాల‌పైనా ఆసక్తిని ప్ర‌ద‌ర్శిస్తే హెచ్‌సీఏపై అంద‌రికి మ‌రింత గౌర‌వం కూడా పెరుగుతుంది. ఈ లీగ్‌తో అంద‌రి నోటా విన‌ప‌డుతున్న సిద్దిపేట స్టేడియం, వ‌చ్చే సీజ‌న్‌క‌ల్లా, హెచ్‌సీఏ నిర్మించిన స్టేడియాల్లో ఆడితే, ఆట అభివృద్ధి చెంద‌డం గ్యారెంటీ.

వెంక‌ట్ రేగ‌ళ్ల‌
న్యూస్ టెలివిజ‌న్ అవార్డ్ గ్ర‌హీత‌
స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్‌
స్టార్‌స్పోర్ట్స్ ఫ్రీలాన్స‌ర్‌


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts