సిద్ధిపేట‌లో అక్కినేని చిన్నోడి సంద‌డి

నచ్చితే షేర్ చేయ్యండి

టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున త‌న‌యుడు అఖిల్‌, హాలో అంటూ సిద్ధిపేట అభిమానుల‌ను ప‌ల‌క‌రించాడు. హెచ్‌సీఏ టీట్వంటీ లీగ్‌లో ఆడుతున్నఅఖిల్‌, సిద్ధిపేట మినీ స్టేడియంలో మ్యాచ్ ఆడి అంద‌రిని ఎంట‌ర్‌టైన్ చేశాడు. రంగారెడ్డి టీమ్‌కు కెప్టెన్‌గా కూడా ఉన్న అఖిల్‌, ఆరంభం నుంచే సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారాడు.

అఖిల్ హాలో కోసం అమ్మాయిల ఫ్ల‌కార్డ్‌లు

యువ మ‌న్మ‌ధుడిగా అమ్మాయిల మ‌న‌సును కొల్ల‌గొట్టిన అఖిల్ కోసం సిద్ధిపేట‌లో అమ్మాయిలు, ఫ్ల‌కార్డ్‌ల‌తో వెల్‌క‌మ్ చెప్పారు. అఖిల్‌..అఖిల్‌
అంటూ వాళ్లంతా సంద‌డి చేయ‌డ‌మే కాదు, హాలో అన‌వా అంటూ కేరింత‌లు కొట్టారు. అత‌ని ఆటోగ్రాఫ్ కోసం ఎగ‌బ‌డ్డారు. అంతేకాదు, సెల్ఫీలు దిగాల‌ని చాలా మంది ప్ర‌య‌త్నించారు. ఆర్గ‌నైజ‌ర్స్ సైతం, అఖిల్‌తో షేక్‌హ్యాండ్ కోసం పోటీప‌డ్డారంటే, అత‌నికున్న క్రేజ్ ఎంటో మ‌రోసారి తేలిపోయింది.

టాస్‌లో జోరు..బ్యాటింగ్‌లో బేజారు

టాస్ టైమ్‌లో ఫుల్ జోష్‌లో క‌నిపించిన అఖిల్‌, బ్యాటింగ్‌లో మాత్రం డీలాప‌డ్డాడు. కేవ‌లం సింగిల్ డిజిట్‌కే పరిమిత‌మై పెవిలియ‌న్ చేరాడు. అభిమానులు, అఖిల్ ఔటైన టైమ్‌లో ఫుల్‌గా డ‌ల్ అయ్యారు. అయితే, ఫీల్డింగ్ టైమ్‌లో అఖిల్ అంతా తానై టీమ్‌ను న‌డిపించాడు. గ్రౌండ్ న‌లువైపులా ఫీల్డింగ్ చేసి ఫ్యాన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేశాడు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts