సెహ్వాగ్‌కి ఆరోగ్యం బాగాలేదా…? గౌతీ ట్వీట్‌పై దుమారం

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా డాషింగ్ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ హెల్త్‌పై ట్విట్ట‌ర్ సాక్షిగా పెద్ద డిస్క‌ష‌న్‌కు తెర‌తీసింది. గౌత‌మ్ గంభీర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు, మ్యాట‌ర్‌ను మీట‌ర్ మీద కాస్త ఎక్కువే చేసింది. అంతేకాదు…అస‌లు సెహ్వాగ్‌కు ఏమైంది అనుకునేలా చేసింది. ఒకే ఒక్క ట్వీట్‌తో మ‌రోసారి గంభీర్ హీట్ పెంచితే, వీరూ ఫ్యాన్స్ పూర్తిగా కంగారులో ప‌డిపోవ‌డ‌మే కాదు అత‌నికి ఏమైందోన‌ని కంగారుప‌డుతున్నారు.

గంభీర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా…సెహ్వాగ్ శుభ‌కాంక్ష‌లు తెలిపాడు. దీనికి రిప్లే చేస్తూ శుభాకాంక్ష‌లు తెలిపినందుకు థ్యాంక్స్‌, అలాగే మీరూ బాగానే ఉన్నార‌ని అనుకుంటున్నా అనే మేసేజ్ చేశాడు. దీనిపై వీరూ అభిమానులు ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. అంతేకాదు, అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై రీ ట్వీట్స్ చేస్తూ పెద్ద డిబేట్‌కు తెర‌తీశారు. అంతేకాదు, ప్ర‌తి ఒక్క‌రూ వీరూ త్వ‌ర‌గా కొలుకోవాల‌ని ట్వీట్స్ చేశారు.

అయితే, ఈ మ్యాట‌ర్‌పై అటు వీరూ, ఇటు గౌతీ స్పందించ‌లేదు. నిజానికి, వీరిద్ద‌రి మ‌ధ్య గ‌త కొన్నిరోజులుగా విభేదాలు త‌లెత్తాయి. అలాంటి టైమ్‌లో సెహ్వాగ్‌, గంభీర్‌ను విష్ చేయ‌డం, మ‌రోవైపు, గౌతీ ఇచ్చిన రిప్లేతో అంద‌రిలో ఓ గంద‌ర‌గోళం ఏర్ప‌డేలా చేసింది. మ‌రీ..సెహ్వాగ్ ఎలాంటి రిప్లేతో అంద‌రిని శాంతిప‌రుచుతాడ‌తో ఎదురుచూడాలి. ఇది కేవ‌లం అప్యాయ ప‌ల‌క‌రింపుతో పాటు, కుశ‌ల ప్ర‌శ్నే అనే స‌మాధానం కోసం వెయిట్ చేయాలి.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts