స్పోర్ట్స్ కోటా మెడిక‌ల్ స్కామ్ క‌థ అట‌కెక్కిన‌ట్టేనా…? పార్ట్‌-1

నచ్చితే షేర్ చేయ్యండి

గ‌త మూడు నెల‌లుగా అంత‌టా హాట్‌టాపిక్‌గా మారిన‌, స్పోర్ట్స్ కోటా మెడిక‌ల్ స్కామ్ అట‌కెక్కిన‌ట్టే క‌నిపిస్తుంద‌నే ఉహ‌గానాలు జోరందుకున్నాయి. కాళోజి నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలో ఉన్న అన్ని కాలేజీల్లో మెడిక‌ల్ సీట్ల‌ను స్పోర్ట్స్ కోటాలో నిర్ణ‌యించిన తీరులో పెద్ద స్కామే జ‌రిగింద‌ని, ప్ర‌భుత్వం వేసిన క‌మిటీలో కూడా బ‌ట్ట‌బ‌య‌లైంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ క‌మిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండా ఇప్పుడు మ‌రో క‌మిటీ వేయ‌డం, మ్యాట‌ర్‌ను మ్యానేజ్ చేయ‌డానికేన‌నే కామెంట్స్‌కి చేరువ‌చేశాయి.

అస‌లేంటి స్కాం…?

2017-18 విద్యాసంవ‌త్స‌రానికి గానూ, కాళోజి నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యంలో మెడిక‌ల్ సీట్ల‌ను స్పోర్ట్స్ కోటాలో భ‌ర్తీ చేశారు. దీని కోసం రాష్ట్రానికి చెందిన శాట్స్ అధికారులు స్వ‌యంగా, విద్యార్థుల‌ను స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేసే క‌మిటీలో స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రించారు. అయితే, ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. అంత‌ర్జాతీయ స్థాయిలో మెరుగ్గా రాణించ‌డ‌మే కాకుండా, జాతీయ‌స్థాయిలో ప‌త‌కాలు సాధించిన వారికి కాకుండా, కేవ‌లం టోర్న‌మెంట్‌లో పాల్గొన్న అథ్లెట్‌కు మెడిక‌ల్ సీటును ఖ‌రారు చేశారు. దీని కోసం భారీగా డ‌బ్బులు చేతులు మారిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

మూడు రోజుల్లోనే తేల్చేసిన క‌మిటీ

ఈ వ్య‌వ‌హ‌రం, ఆ నోటా, ఈ నోటా బ‌య‌ట‌ప‌డింది. అదే టైమ్‌లో న‌ష్ట‌పోయిన హైద‌రాబాద్‌కి చెందిన భ‌ర‌త్‌తో పాటు, ఏపీకి చెందిన‌ హ‌ర్షితారాజ్ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, మ్యాట‌ర్ సీఎం క్యాంప్ ఆఫీసుకు చేర‌డంతో వెంట‌నే ఎంక్వైరీ ప్రారంభించారు. జ‌న‌వ‌రి 5న స్విమ్మింగ్ కోచ్ హ‌జీరా అబ్బాసీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ డి. విమ‌లాక‌ర్‌రావుతో క‌మిటీని ఏర్పాటు చేశారు. మూడు రోజుల్లో ఈ వ్య‌వ‌హ‌రంపై వీళ్లు స‌మ‌గ్ర నివేదిక‌ను జ‌న‌వ‌రి 8న ఎండీకి అంద‌జేశారు. ఆయ‌న‌, జ‌న‌వ‌రి 17న ప్రిన్సిపాల్ సెక్ర‌ట‌రీ బుర్ర వెంక‌టేశంకి నివేదిక‌ను అంద‌జేశారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ నివేదిక‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు.

మెడిక‌ల్ స్కామ్ వ్య‌వ‌హ‌రంపై కొన్ని పత్రిక‌లు మిన‌హా ఎవ‌రూ పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌డం లేదు. అదే స‌మ‌యంలో, ఈ విష‌యంలో పెద్ద త‌ల‌కాయ పేరు ఉంద‌నే వార్త‌లు రావ‌డంతో మ్యాట‌ర్ పూర్తిగా అట‌కెక్కింద‌ని, రాబోయే రోజుల్లో తెర‌మ‌రుగు అవుతుంద‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూరేలా చేసింది. అయితే, దీనిపై మ‌రో క‌మిటీని ఏర్పాటు చేయ‌డం బ‌ట్టి చ‌ర్చ జోరందుకుంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts