ఆ ఒక్క‌..ఫ్రెంచ్ కిస్ మిగిలింది

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మిర్జా దేని కోసం ఆరాట‌ప‌డుతోందో తెలుసా..? అదే ఫ్రెంచ్ కిస్..గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈసారి మాత్రం ఈ హైద‌రాబాదీ బ్యూటీ ఫ్రెంచ్ ఓపెన్ పై ఎన్నో హోప్స్ పెట్టుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలిస్తే..సానియా కెరియ‌ర్ స్లామ్ ను పూర్తి చేస్తుంది. ఇప్ప‌టికే సానియా ఖాతాలో మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. డ‌బుల్స్, మిక్స్ డ్ డ‌బుల్స్ లో ఈ టైటిల్స్ సాధించింది. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్, యూఎస్ ఓపెన్, వింబుల్డ‌న్ ట్రోఫీల‌ను ముద్దాడిన సానియా, ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని కూడా ముద్దాడాల‌ని ఆరాట‌ప‌డుతోంది.

2015లాగే 2016 కూడా సానియాకు గోల్డెన్ ఇయ‌ర్ గా మారింది. 2015లో సానియా వింబుల్డ‌న్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెల‌వ‌గా…2016లో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ కిరీటం ద‌క్కించుకుంది. ఇక‌ ఈ ఏడాదిని నెంబ‌ర్ వ‌న్ హోదాతోనే ముగించ‌నుంది ఈ రాకెట్ భామ‌. 2016లో సానియా 8 టోర్న‌మెంట్ల‌లో విజ‌యాలు సాధించింది. ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్( ఆస్ట్రేలియ‌న్ ఓపెన్) నూ త‌న ఖాతాలో వేసుకుంది. సానియా ఖాతాలో మూడు గ్రామ్ స్లామ్ టైటిల్స్ ఉండ‌గా…మ‌రో గ్రాండ్ స్లామ్ (ఫ్రెంచ్ ఓపెన్) కూడా చేరితే కెరియ‌ర్ స్లామ్ ను రీచ్ అవుతుంది. ఐతే ఫ్రెంచ్ ఓపెన్ కంటే ముందు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ (జ‌న‌వ‌రి 2017లో)జ‌రుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ మే 22 నుంచి జూన్ 11 వ‌ర‌కు జ‌రుగుతుంది. డ‌బుల్స్ పార్ట్ న‌ర్ బార్బొరా స్ట్రికోవాతో క‌లిసి ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ కోసం రెడీ అవుతోంది.

కెరియ‌ర్ స్లామ్ సాధించ‌డం మిన‌హా జీవితంలో పెద్ద కోరిక మ‌రేమీ లేద‌ని చెబుతోంది సానియా. ఫ్రెంచ్ ఓపెన్ లో కూడా బార్బొరాతోనే క‌లిసి ఆడ‌తాన‌ని, పార్ట్ న‌ర్ ను మార్చే ఆలోచ‌న లేద‌ని తెలిపింది. మార్టినా హింగిస్ తో క‌లిసి నెంబ‌ర్ వ‌న్ గా నిలిచాన‌ని, ఆమె అద్భుతమైన క్రీడాకారిణి అని కితాబిచ్చింది. ఐతే బార్బొరా త‌నకు బాగా తెలుసున‌ని, 14 ఏళ్ల వ‌య‌సులోనే ఇద్ద‌రూ క‌లిసి ఆడామ‌ని సానియా చెప్పింది. ఇక మిక్స్ డ్ డ‌బుల్స్ పార్ట్ న‌ర్ ఇవాన్ డాడిగ్ గాయంతో బాధ‌ప‌డుతున్నాడ‌ని , కోలుకున్న త‌ర్వాతే అత‌డితో ఆడే విష‌యంపై మాట్లాడుతానంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts