సెంచూరీయ‌న్‌లో సౌతాఫ్రికా టార్గెట్‌ 189

నచ్చితే షేర్ చేయ్యండి

రెండో టీట్వంటీలో టీమిండియా స‌ఫారీల ముందు ల‌క్ష్యాన్ని నిర్థేశించింది. ప్ర‌త్య‌ర్థి ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌, మ‌నీష్ పాండే అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఆరంభంలో శిఖ‌ర్ ధావ‌న్‌, సురేష్ రైనా విలువైన ప‌రుగుల‌తో టీమ్‌ను ముందుకు న‌డిపించారు. చివ‌ర్లో ఎప్ప‌టిలాగే, యం. య‌స్ ధోనీ మ‌రోసారి త‌న‌దైన స్ట‌యిల్లో దూకుడు ప్ర‌ద‌ర్శించాడు. దీంతో…టీమిండియా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది.

క‌ల‌సొచ్చిన యూడీఆరెస్‌

నిజానికి..ఇన్నింగ్స్ ఫ‌స్ట్ బాల్‌కే ధావ‌న్ ఔట‌య్యాడు. అయితే, యూడీఆరెస్ తీసుకోవ‌డంతో నాటౌట్‌గా తేలిపోయింది. ఈ అవ‌కాశం త‌ర్వాత రెచ్చిపోయిన ధావ‌న్ వ‌రుస బౌండ‌రీల‌తో హోరెత్తించాడు. అయితే డుమినీ అతన్ని పెవిలియ‌న్ చేర్చాడు. ఈ టైమ్‌లో వ‌చ్చిన సురేష్ రైనా ఆచితూచి ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు. అత‌ను సాధించిన 31ప‌రుగులు టీమ్‌ను మిడిల్ ఓవ‌ర్స్‌లో కాస్త ఊర‌ట క‌ల్గించాయి.

ధోనీ, మ‌నీష్ పాండే కీల‌క పార్ట‌న‌ర్‌షిప్‌

ఐదో వికెట్‌కు మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌నీష్ పాండే, ధోనీ మెరుగైన భాగస్వామ్యాన్ని న‌మోదు చేశాయి. వీరిద్ద‌రూ సఫారీ బౌలర్ల‌ను ఆటాడుకున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి చివ‌రి ప‌ది ఓవ‌ర్ల‌లో ప‌ది ర‌న్‌రేట్‌తో ప‌రుగులు సాధించారు. పాండే అర్థ‌సెంచ‌రీతో అద‌ర‌గొడితే, ధోనీ మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్ద‌రూ క‌లిసి ఐదో వికెట్‌కు 98ప‌రుగులు చేశాడు. ధోనీ చివ‌రి ఓవ‌ర్‌లో ఏకంగా 17ప‌రుగులు చేసి అర్థ‌సెంచ‌రీతో దుమ్మురేపాడు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts