స్వ‌దేశాల్లోనే రో “హిట్‌”…విదేశాల్లో హాం”ఫ‌ట్‌”

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా డాషింగ్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌కు విదేశీ పిచ్‌ల‌కు పిచ్చెక్కిస్తున్నాయి. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా కంగారుపెడుతున్నాడు. ఇండియ‌న్ పిచ్‌ల‌పై ఓ రేంజ్‌లో ప‌రుగ‌ల వ‌ర్షం కురిపించిన రోహిత్‌, విదేశాల్లో మాత్రం బ్యాట్‌కు ప‌నిచెప్ప‌లేక త‌డ‌బ‌డుతున్నాడు. స‌ఫారీ టెస్ట్ సిరీస్‌తో పాటు, వ‌న్డేల్లోనూ మ‌నోడు స్థాయికి త‌గ్గ‌ట్టుకు ఆడ‌లేక చ‌తికిల‌ప‌డుతున్నాడు.

టెస్ట్ సిరీస్‌లో ఘోర వైఫ‌ల్యం

ద‌క్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ రెండు టెస్ట్‌లు ఆడాడు. అందులో రోహిత్ శ‌ర్మ నాల్గు ఇన్నింగ్స్‌ల్లో 11, 10, 10, 47 ప‌రుగుల‌తో నిరాశ‌ప‌ర్చాడు. చివ‌రి మ్యాచ్‌లో అత‌ను చేసిన 47ప‌రుగులు కీల‌క‌మైన‌వే అయినా…ఆ ఇన్నింగ్స్‌ను కొన‌సాగించ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు.

వ‌న్డే సిరీస్‌లోనూ ఫ్లాప్‌

ముగిసిన రెండు వ‌న్డేల్లోనూ రోహిత్ శ‌ర్మ ఆక‌ట్టుకోలేక‌పోయాడు. తొలి మ్యాచ్‌లో 20ప‌రుగులు చేసిన రోహిత్‌, రెండో వ‌న్డేలో కేవ‌లం 15ర‌న్స్ మాత్ర‌మే చేసి పెవిలియ‌న్ చేరాడు. దీంతో..రాబోయే మ్యాచ్‌ల్లో రోహిత్ శ‌ర్మ ఎలా రాణిస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అత‌ని ఆట‌తీరు చాలా కీలక‌మైన టైమ్‌లో మూడో వ‌న్డే ఇంట్రెస్ట్‌ను పెంచుతోంది. ఇప్ప‌టికే, రోహిత్‌పై సోష‌ల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts