నొబాల్ వేశాడ‌ని ఆ సీనియ‌ర్ తిట్ల‌దండ‌కం మొద‌లెట్టాడు

నచ్చితే షేర్ చేయ్యండి

నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కు తిరుగులేని, గూగ్లీ, లెగ్‌స్పిన్‌తో మ్యాజిక్ చేసిన చాహ‌ల్‌, ఇప్పుడు విల‌నయ్యాడు. నాల్గో వ‌న్డేలో టీమిండియా ఓట‌మికి చాహ‌ల్ వేసిన నోబాలే కార‌ణ‌మ‌ని ఇప్పుడు అంద‌రూ మండిప‌డుతున్నారు. ఫాస్ట్ బౌల‌ర్ నోబాల్ వేశాడంటే అర్థ‌ముంది, స్పిన్న‌ర్‌వి నీకేమైందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ్యాచ్ త‌ర్వాత శిఖ‌ర్ ధావ‌న్, ఈ నోబాల్ వ‌ల్లే ఓడామ‌నేలా మాట్లాడితే, ఏకంగా, ఆ నోబాల్ వ‌ల్లే టీమిండియా ఓడిందంటూ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్క‌ర్ తీవ్ర‌స్థాయిలో చాహ‌ల్‌పై ధ్వ‌జ‌మెత్తాడు.

చాహ‌ల్‌కు ఆ మాత్రం తెలియ‌దా…?

డివిలియ‌ర్స్ ఔట్ త‌ర్వాత టీమిండియా విక్ట‌రీ క‌న్ఫార్మ్ అనుకున్నాన‌న్న గ‌వాస్క‌ర్‌, మిల్ల‌ర్ కూడా ఓట‌వ్వ‌డంతో ఆ జోష్ రెట్టింప‌యింద‌న్నాడు. అయితే, మిల్ల‌ర్ ఔటైన బాల్, నోబాల్ అని తెలియ‌డంతో తీవ్రంగా నిరాశ చెందాన‌ని…పదే, ప‌దే నోబాల్స్ వేయ‌డం తీవ్ర అస‌హ‌నానికి లోన‌య్యేలా చేసింద‌న్నాడు. ఆ బాల్ క‌నుక నోబాల్ కాకుంటే, టీమిండియా గెలిచేద‌ని, మంచి అవ‌కాశాన్ని కోల్పోయామ‌న్నాడు స‌న్నీ. స్పిన్న‌ర్లు, నోబాల్స్ వేయ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ల్గించింద‌న్నాడు.

వాస్త‌వానికి…చాహ‌ల్ లాంటి స్పిన్న‌ర్ నోబాల్ వేయ‌డం కాస్త ఆలోచించాల్సిందే. అయితే, అదే పెద్ద అప‌రాద‌మైన‌ట్టు, అందువ‌ల్లే ఓడామంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం నిజంగా సిగ్గుచేటే. అత‌ను ఒక్క‌డు ఔట్ చేయ‌క‌పోతే, అత‌ను ఒక్క‌డు నోబాల్ వేస్తే, మిగిలిన బౌల‌ర్లు ఏం చేస్తున్న‌ట్టు, అస‌లు ఏ మాత్రం ప్ర‌య‌త్నం చేయ‌కుండా ఉన్న వాళ్ల‌కంటే, చాహ‌ల్ కాస్తైనా బెట‌రే క‌దా అని మ‌రికొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా, ఒక రోజు పొగ‌డ‌టం, మ‌రో రోజు తిట్ట‌డం, సీనియ‌ర్ల‌కు, ఎక్స్‌ఫ‌ర్ట్స్‌కు కామ‌న్‌గా మారింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts