మూడు ముళ్ల బంధంలో విరాట్‌-అనుష్క‌

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రియురాలు అనుష్క శ‌ర్మ‌ను పెళ్లిచేసుకున్నాడు. ఇట‌లీలోని ఓ రిసార్ట్‌లో కోహ్లీ, అనుష్క‌…అతి కొద్ది మంది బంధువులు, స‌న్నిహితుల మ‌ధ్య మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. అంద‌రూ అనుకున్న‌ట్టుగా 12న కాకుండా 11నే పెళ్లిచేసుకోని విరాట్‌, అనుష్క షాకివ్వ‌డ‌మే కాదు, మ్యారేజీపై వ‌చ్చిన వంద‌తుల‌ను నిజం చేశారు.

శ్రీలంక భార‌త్ టూర్‌కు ముందే విరాట్, అనుష్క‌ల పెళ్లి నిశ్చ‌య‌మైంది. అయితే, ఈ విష‌యంపై ఇద్ద‌రూ మాట్లాడ‌లేదు. అంతేకాదు, ఒక్కొక్క‌రుగా మారువేషాల్లో ఇట‌లీ చేరుకున్నారు. అనుష్క షూటింగ్ పేరు చెప్పి వెళ్లినా…విరాట్ మాత్రం స‌రికొత్త గెట‌ప్‌లో ఇట‌లీ వెళ్లాడు. వీళ్లిద్ద‌రూ త‌మ పెళ్లి వేడుక‌ను జ‌న‌వ‌రి 4న బాంద్రా కోర్ట్‌లో రిజిష్ట‌రు చేసుకోనున్నారు. డిసెంబ‌ర్ 21న స‌న్నిహితుల‌కు విందు పార్టీని ఢిల్లీలో ఇవ్వ‌నున్నారు.

 


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts