నేను రోబోను కాదు…నా చ‌ర్మాన్ని కోసుకొండి

నచ్చితే షేర్ చేయ్యండి

కోహ్లీ హార్ట‌య్యాడు. మాములుగా కూడా కాదు…కాస్త గ‌ట్టిగానే జ‌వాబిచ్చాడు. వ‌రుస‌గా క్రికెట్ ఆడ‌టం వ‌ల్ల ఎంత‌గా అల‌సిపోతున్నాడో చెప్ప‌డ‌మే కాదు, ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా త‌న ప‌రిస్థితిని వివ‌రించాడు. శ్రీలంక‌తో జ‌ర‌గ‌బోయే సిరీస్‌కు ముందు కోహ్లీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. అంతేకాదు…ఇండియ‌న్ క్రికెట్ హిస్ట‌రీలోనే అత్యంత ఫిట్‌నెస్‌తో ఉన్న ఓ ప్లేయ‌ర్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం క్రీడావ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తేర‌లేప‌డ‌మే కాదు, మ‌న క్రికెట‌ర్ల ప‌రిస్థితిని తెలియ‌జేస్తుంది.

నేను రోబోను కాదు…నాకూ విశ్రాంతి కావాలి. ఎందుకు తీసుకోకూడదంటూ మీడియాను ప్ర‌శ్నించిన కోహ్లీ, మీకు అనుమానం ఉంటే, నా చ‌ర్మాన్ని కోసి ర‌క్తం కారుతుందో లేదో చూసుకోవ‌చ్చంటూ చెప్పుకొచ్చాడు. మూడు ఫార్మాట్ల‌లో కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ, టీమిండియాకు అత్యంత విలువైన ఆట‌గాడు. అటు అంత‌ర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇటు ఐపీఎల్ లాంటి లీగ్‌లోనూ టీమ్‌ను లీడ్ చేస్తున్నాడు. అలాంటి కోహ్లీ ఏ రోజు, విశ్రాంతి గురించి మాట్లాడ‌లేదు. అయితే, వ‌రుస‌గా క్రికెట్ ఆడుతుండ‌టంతో అత‌ను కూడా విశ్రాంతి తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది కోహ్లీ ఆడిన మ్యాచ్‌లు క్రింద ఇవ్వ‌బ‌డిన‌వి గ‌మ‌నించ‌గ‌ల‌రు.

ఫార్మాట్ మ్యాచ్‌ల సంఖ్య‌
వ‌న్డేలు 26
టీట్వంటీలు 10
టెస్ట్‌లు 07
అద‌నంగా ఐపీఎల్‌లో కూడా టీమ్‌ను లీడ్ చేశాడు కోహ్లీ. ఈ క్యాలెండ‌ర్‌లో ఇన్ని మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెట‌ర్ కోహ్లీనే కావ‌డం విశేషం. ఎక్కువ ప‌ని ఉన్న ఆట‌గాళ్ల‌కు అప్పుడ‌ప్పుడూ విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై మాజీలు, కోచ్ ర‌విశాస్త్రి ఎలా స్పందిస్తార‌నేది ఇప్పుడు ఇంట్రెస్ట్‌ను పెంచుతోంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts