ధోనీతో డేట్‌కి వెళ్తా…కోహ్లీతో క‌లిసి హాట్‌హాట్‌గా…!

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా కెప్టెన్‌, మాజీ కెప్టెన్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది బాలీవుడ్ బ్యూటీ కైరా అడ్వాణీ. యం.య‌స్ ధోనీ మూవీలో సాక్షి రోల్ ప్లే చేసిన కైరా అడ్వాణీ, ధోనీతో క‌లిసి డిన్న‌ర్ డేట్‌కి వెళ్లాల‌నుకుంటున్న‌ట్టు చెప్పింది. అంతేకాదు, డిన్న‌ర్ డేట్ అంటే ఏంటో అర్థం తెలియ‌ద‌ని, కానీ, అవ‌కాశం వ‌స్తే మాత్రం ధోనీతో వెళ్లాల‌నుకుంటున్న‌ట్టు మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టేసింది.

ధోనీ మూవీలో సాక్షి రోల్‌తో ఫేమ‌స్‌

ధోనీ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన మూవీలో కైరా, అద్భుత‌మైన న‌ట‌న‌తో అంద‌రి మ‌న‌సులు గెల్చుకుంది. అలాంటి ఆమె ధోనీ ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చుతాడ‌ని చెప్పింది. అంతేకాదు, కూత‌రు జీవా ప‌ట్ల‌, ఫ్యామిలీ ప‌ట్ల అత‌ను చూపించే ప్రేమ‌, అప్యాయ‌త చాలా బాగుంటుంద‌ని అలాంటి వ్య‌క్తితో క‌లిసి డేట్‌కి వెళ్ల‌డం మంచి అనుభ‌వ‌మ‌ని చెప్పింది. అంతేకాదు, రియ‌ల్ లైఫ్‌లో కూడా ధోనీ నిజ‌మైన హీరో అని ప్ర‌శంసించింది.

కోహ్లీ చాలా హాట్ గురూ..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా హాట్‌గా ఉంటాడ‌ని, అత‌న్ని చూస్తేనే ఎవ‌రైనా ఫిదా అవుతారంది కైరా. ప్ర‌జెంట్ ధోనీతో పాటు కోహ్లీ అంటే త‌న‌కు బాగా ఇష్ట‌మ‌ని చెప్పింది. అయితే, నేరుగా ఎప్పుడూ కోహ్లీని క‌ల‌వ‌లేద‌న్న కైరా, అవ‌కాశ‌మోస్తే మాత్రం ఖ‌చ్చితంగా ఆటోగ్రాఫ్ తీసుకుంటానంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts