ఎవ‌రీ బెహ్ర‌న్ డార్ఫీ….అలా కుమ్మేశాడు

నచ్చితే షేర్ చేయ్యండి

రెండో టీట్వంటీలో టీమిండియా టాపార్డ‌ర్ టాప్ లేపిన లెఫ్టార్మ్ పేస‌ర్ బెహ్ర‌న్‌డార్ఫ్‌పై ఇప్పుడు అంత‌టా హాట్‌హాట్‌గా డిస్క‌ష‌న్ మొద‌లైంది. రాంచి టీట్వంటీతో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన డార్ఫ్‌…రెండో మ్యాచ్‌కే భార‌త టాప్‌క్లాస్ ప్లేయ‌ర్స్‌కు చెమ‌ట‌లు ప‌ట్టించ‌డ‌మే కాదు…అభిమానుల చేత ఔరా అనిపించాడు. వ‌రుస ఓవ‌ర్ల‌లో అత‌ను తీసిన నాల్గు వికెట్లు మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేశాయి.

4ఓవ‌ర్లు…21ర‌న్స్‌…4 వికెట్లు

బెహ్ర‌న్‌డార్ఫ్‌….ఆరంభ ఓవ‌ర్‌లోనే అర‌ద‌గొట్టాడు. రెండు బౌండ‌రీలు సాధించి ఫామ్‌లో క‌నిపించిన రోహిత్‌ను, వికెట్ల ముందు అదిరే బంతితో కంగారెత్తించాడు డార్ఫ్‌. అదే ఓవ‌ర్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా వికెట్ల ముందు కంగారెత్తించాడు. డార్ఫ్ బౌలింగ్ దెబ్బ‌కు ఏకంగా….టీట్వంటీ కెరీర్‌లోనే ఫ‌స్ట్ డ‌కౌట్‌ను రుచిచూశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌నీష్ పాండేను కూడా ఔట్ చేశాడు డార్ప్‌. ఇక‌, ఫామ్‌లో ఉన్నాడ‌నుకున్న శిఖ‌ర్ ధావ‌న్‌ను కూడా ఇన్‌స్వింగ్‌తో బొల్తాకొట్టించాడు.

ఎవ‌రీ బెహ్ర‌న్‌డార్ప్‌

కాన్‌బెర్రాకు చెందిన డార్ప్‌….ఆస్ట్రేలియ‌న్ క్యాపిట‌ల్ టెరీట‌రికి జూనియ‌ర్‌, సీనియ‌ర్ లెవ‌ల్ క్రికెట్ ఆడాడు. ఎడ‌మ‌చేతివాటం బౌల‌ర్‌గా అతి త‌క్కువ టైమ్‌లోనే ఎంతో పేరు సాధించుకున్నాడు. పెర్త్ స్కార్చ‌ర్స్ త‌ర‌పున బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన డార్ప్‌….ఆ జ‌ట్టు రెండుసార్లు టైటిల్ గెలిచిన టైమ్‌లో జ‌ట్టులో ఉన్నాడు. లెఫ్టార్మ్ బౌలింగ్‌లో మెరుగైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించే డార్ప్‌..ఎట్ట‌కేల‌కు జ‌ట్టులోకి రావ‌డ‌మే కాదు, ఒకే ఒక్క స్పెల్‌తో తన ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. కీల‌కంగా మార‌బోయే మూడో టీట్వంటీలోనూ మ‌నోడే కీ రోల్ ప్లే చేయ‌నున్నాడు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts