35 ఓవ‌ర్ల‌లో 200/2…..చివ‌రి 15ఓవ‌ర్ల‌లో 89/5

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా నాల్గో వ‌న్డేలో ఘోరంగా త‌డ‌బ‌డింది. బ్యాడ్ వెద‌ర్ జోరుకు బ్రేక్ ఇస్తే, ఆ త‌ర్వాత మ‌నోళ్లు పూర్తి బేజారైపోయారు. ధావ‌న్ దంచికొట్టినా, కోహ్లీ క‌మాల్ ఇన్నింగ్స్ ఆడినా..మిడిలార్డ‌ర్ వైఫ‌ల్యం టీమ్‌ను త‌క్కువ స్కోర్‌కే ప‌రిమితం చేసింది. అంతేకాదు, టీమిండియాను నాల్గో వ‌న్డేలో డిఫెన్స్‌లో ప‌డేసింది. ఇక బౌల‌ర్లు రాణించ‌డంపైనే భార‌త్ విజ‌య‌వ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి. ఏబీ డివిలియ‌ర్స్ రావ‌డం స‌ఫారీల‌కు కాస్త ఊర‌ట క‌ల్గిస్తున్న విష‌యం.

34.2ఓవ‌ర్ల‌లో 200/ 2

రోహిత్ మ‌రోసారి విఫ‌ల‌మైనా…కోహ్లీ, ధావ‌న్ జోడీ టీమ్ స్కోర్ బోర్డ్‌ను ముందుకు న‌డిపించారు. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా అద‌ర‌గొట్టారు. కోహ్లీ, త‌న‌లోని దూకుడును మ‌రోసారి కొన‌సాగించాడు. 75ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరిన కోహ్లీ, టీమ్‌ను ప‌టిష్ట‌స్థితిలో నిలిపాడు. ఆ త‌ర్వాత‌…
ధావ‌న్ దుమ్మురేపాడు. వందో వ‌న్డేలో వంద ప‌రుగులు చేసి వండ‌ర్ సృష్టించాడు. ఈ టైమ్‌లో బ్యాడ్ వెద‌ర్ కార‌ణంగా మ్యాచ్‌ను నిలిపేశారు.

15ఓవ‌ర్ల‌లో 89/5
ఆట తిరిగి ప్రారంభ‌మైన త‌ర్వాత‌, స‌ఫారీలు అనుహ్యంగా పుంజుకున్నారు. మ‌న బ్యాట్స్‌మెన్‌ను వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు చేర్చారు. అంతేకాదు, చివ‌రి కీల‌క‌మైన 15ఓవ‌ర్ల‌లో కేవ‌లం 89ప‌రుగులు సాధించేలా చేసింది. అందులో ధోనీ సాధించ‌న‌వే 42ర‌న్స్‌. పాండ్యా, ర‌హానే, శ్రేయాస్ అయ్య‌ర్‌, అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. ఈ ప‌రుగుల కోత మ‌న‌నుంచి విక్ట‌రీని దూరం చేసేలా క‌నిపిస్తోంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts