ఆశ‌లు రేపి….వ‌ర్షం క‌రుణించి…మ్యాచ్ ర‌ద్దై…!

నచ్చితే షేర్ చేయ్యండి

క్రికెట్ క్రేజీ ప్లేస్‌లో…రెయిన్ చేసిన మ్యాజిక్ అంద‌రిని నిరాశ‌కు గురిచేసింది. ఏకంగా సిరీస్ విన్న‌ర్‌ని డిసైడ్ చేసే మ్యాచ్ ర‌ద్దైంది. వ‌ర్షం క‌రుణించినా…..అంత‌కుముందు చేసిన విధ్వంసం వ‌ల్ల మ్యాచ్‌ను కొన‌సాగించ‌లేమ‌ని చేతులేత్తేశారు అంపైర్లు. ఔట్‌ఫీల్డ్ చిత్త‌డిగా మార‌డం, ఎంత ప్ర‌య‌త్నించినా మాములు స్థితికి తీసుకురాలేక‌పోవ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు.

టీట్వంటీ సిరీస్‌కు వ‌ర్షం ముప్పు

ఈ టీట్వంటీ సిరీస్ ఆరంభం నుంచే వ‌రుణుడు వెంటాడుతున్నాడు. తొలి టీట్వంటీ జ‌రిగిన రాంచిలోనూ కీల‌క స‌మ‌యంలో వ‌ర్షం అంత‌రాయం క‌ల్గించింది. దీంతో..డ‌క్‌వ‌ర్త్ లూయిస్ కీ రోల్ ప్లే చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజ‌యం సాదించింది. అయితే, పూర్తి ఓవ‌ర్ల పాటు మ్యాచ్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు.

ఇక సెకండ్ టీట్వంటీకి కూడా వ‌ర్షం అంత‌రాయం క‌ల్గించింది. అయితే, మ్యాచ్ టైమ్‌లో మాత్రం స‌జావుగా సాగేలా స‌హ‌క‌రించింది. దీంతో…ఫ్యాన్స్ ఆ మ్యాచ్‌ను బాగానే ఎంజాయ్ చేశారు. అయితే, ఉహించ‌ని విధంగా మూడో మ్యాచ్‌ను కూడా వ‌ర్షం వెంటాడింది. మ్యాచ్‌కు ముందు వ‌ర్షం త‌గ్గినా…ఔట్ ఫీల్డ్ మాత్రం చిత్త‌డిగా ఉండ‌టంతో ర‌ద్దు చేస్త‌న్న‌ట్టు అంపైర్లు ప్ర‌క‌టించారు. రాబోయే సిరీస్‌పైనైనా వ‌రుణుడు కాస్త క‌రుణిస్తే అభిమానుల‌కు కాస్త ఊర‌ట ల‌భిస్తుంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts