అటు ర‌నౌట్లు…ఇటు లుంగీ డ్యాన్స్‌..

నచ్చితే షేర్ చేయ్యండి

ముచ్చ‌ట‌గా మూడు వ‌న్డేల్లో కలిసి ఫుల్ జోష్‌లో క‌నిపించిన మెన్ ఇన్ బ్లూకు, పింక్ డ్రెస్‌లో స‌ఫారీలు కొట్టిన దెబ్బ కోలుకోకుండా చేస్తోంది. కీల‌క‌మైన ఐదో మ్యాచ్‌లో కూడా స‌ఫారీల బౌలింగ్ ముందు, మ‌న బ్యాట్స్‌మెన్ చేతులేత్తేశారు. ఎప్ప‌టిలాగే, ధావ‌న్‌, కోహ్లీ దూకుడిగా ఆడితే, రోహిత్ శ‌ర్మ ఎట్ట‌కేల‌కు శ‌త‌కం సాధించాడు. అయితే, ప‌రోక్షంగా, ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్ ర‌నౌట్ కావ‌డంలో కీ రోల్ ప్లే చేశాడు.

40ఓవ‌ర్ల త‌ర్వాత మారిన సీన్‌

ఆరంభం నుంచి దూకుడిగా ఆడిన ఇండియా…40ఓవ‌ర్ల వ‌ర‌కు మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ప‌టిష్ట‌స్థితిలో నిలిచింది. క్రీజులో రోహిత్ శ‌ర్మ‌తో పాటు, శ్రేయాస్ అయ్య‌ర్‌, హార్థిక్ పాండ్యా, ధోనీ ఇలా భారీ పించ్ హిట్ట‌ర్లు ఉన్నారు. అయితే, ఉహించ‌ని విధంగా, భార‌త్ కుప్ప‌కూలింది. నాల్గో వ‌న్డే స్ట‌యిల్లోనే పూర్తిగా డీలాప‌డింది. అస‌లేమాత్రం ఆక‌ట్టుకోలేని ఆట‌తీరుతో ప్ర‌త్య‌ర్థికి వికెట్లు స‌మ‌ర్పించుకుంది. ఫ‌లింత‌గా, 7వికెట్లు కోల్పోయి 274ప‌రుగులు చేసింది టీమిండియా.

ఎంగిడి మ‌రోసారి లుంగీ డ్యాన్స్‌

అప్ప‌టి వ‌ర‌కు క్లాసిక్ ట‌చ్‌లో క‌నిపించిన రోహిత్ శ‌ర్మ అండ్ కో, ఎంగిడి రాక‌తో డీలాప‌డ‌ట‌మే కాదు, పెవిలియ‌న్‌కు క్యూక‌ట్టారు. ఒక‌రి వెనుక మ‌రొక‌రు పోటీప‌డి మ‌రీ పెవిలియ‌న్ చేరారు. ఫ‌లితంగా, ఎంగిడి మ‌రోసారి హీరోగా, మ‌న‌ మిడిలార్డ‌ర్ జీరోగా మారిపోయారు. ఈ ఆట‌తీరు ఇప్పుడు మ‌రోసారి మ‌నోళ్ల‌ను ప్ర‌శ్నించేదిగా మారింది. మ‌రీ, రాబోయే రోజుల్లోనైనా దీనికి ప‌రిష్కారం వెతుక్కుంటారో లేదోకానీ, ఇలాగే ఆడితే మాత్రం సిరీస్ స‌మం కావ‌డం గ్యారెంటీ.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts