ప‌డింది పంచ్‌..ఇక హైద‌రాబాద్‌లోనే క్లైమాక్స్‌

నచ్చితే షేర్ చేయ్యండి

రెండో టీట్వంటీలో టీమిండియాకి ఝ‌ల‌క్ ప‌డింది. ఆసీస్ బౌల‌ర్ల అద్భుత‌మైన బౌలింగ్‌కి తోడు, బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో చేసిన మార్పుల‌తో టీట్వంటీ సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌ర్షం అంత‌రాయం క‌ల్గిస్తుంద‌నుకున్న మ్యాచ్‌లో, మ‌న దూకుడికి ఆసీస్ క‌ళ్లెం వేసింది. టీట్వంటీలోనే స్పెష‌లిస్ట్‌గా పేరున్న ప్లేయ‌ర్స్ అంద‌రూ వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు క్యూక‌ట్ట‌డంతో భార‌త్‌కు ఘోర ఓట‌మి త‌ప్ప‌లేదు.

త‌డ‌బ‌డి..నిల‌బ‌డ‌లేక‌

ప్ర‌త్య‌ర్థి ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ ఆరంభంలోనే కుప్ప‌కూలింది. కొత్త పేస‌ర్ బెహ్ర‌న్‌డార్ప్ దాటికి స్టార్ బ్యాట్స్‌మెన్ వ‌రుస‌గా డ‌గౌట్‌కు చేరుకున్నారు. జాద‌వ్ కాసేపు మెరిసినా, పాండ్యా, కుల్దీప్ నిల‌బ‌డ్డ‌ట్టు కనిపించినా, బెహ్ర‌న్‌కు తోడుగా జంపా రాణించ‌డంతో భార‌త్ 118ప‌రుగుల‌కే ఆలౌటైంది. టీట్వంటీలో ఇటీవ‌ల కాలంలో భార‌త్ సాధించిన అతి త‌క్కువ స్కోర్ ఇదే.

ఛేజింగ్‌లో త‌డ‌బాటు..

119ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే మ‌న పేస‌ర్లు షాకిచ్చారు. ఓపెన‌ర్లు ఫించ్‌, వార్న‌ర్ ఇద్ద‌రూ సింగిల్ డిజిట్‌కే పెవిలియ‌న్‌కు చేరారు. బూమ్రా, భువి చెరో వికెట్ తీయ‌డంతో ఆసీస్ 13ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది.

క‌లిసొచ్చిన బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మార్పు

వ‌రుస‌గా రెండు వికెట్లు కోల్పోవ‌డంతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మార్పులు చేసింది. హెడ్‌కు తోడుగా హెన్రిక్స్‌ను పంపించింది. మాక్స్‌వెల్ ఫామ్‌లో లేక‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇది వాళ్ల‌కు క‌ల‌సివ‌చ్చింది. వ‌స్తూనే భార‌త బౌల‌ర్ల‌పై ఎటాక్ చేయ‌డంతో సీన్ మారింది. అంతేకాదు..భార‌త్‌కు టీట్వంటీలో తొలి ఓట‌మి ఎదుర‌య్యింది. ఇక హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లోనే ట్రోఫీ విజేత ఎవ‌రో డిసైడ్ కానుంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts