మ్యాచ్ లేదు క‌దా….మ‌రీ టికెట్ డ‌బ్బులు తిరిగిస్తారా…?

నచ్చితే షేర్ చేయ్యండి

వ‌ర్షం మ‌రోసారి అభిమానుల‌ను నిరాశ‌లోకి నెట్టింది. అంతేకాదు….కీల‌క‌మైన మ్యాచ్‌ను ఫ‌లితం తేల‌కుండానే ముగించేలా చేసింది. ఇలాంటి టైమ్‌లో ఫ్యాన్స్ భారంగా స్టేడియాన్ని వ‌దిలారు. చాలా కాలం త‌ర్వాత జ‌రుగుతున్న మ్యాచ్‌ను చూసేందుకు ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చిన అభిమానులు, ఇలా జ‌రిగిందేట‌ని మాట్లాడుకుంటూ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు.

టికెట్ డ‌బ్బులు తిరిగిస్తారా…?

నిజానికి….ఇలాంటి సంద‌ర్భాలు గ‌తంలోనూ ఎద‌రుయ్యాయి. మ్యాచ్ జ‌రిగే రోజు వ‌రుణుడు ప్ర‌తాపం చూపించ‌డంతో ర‌ద్దైన్న‌ట్టు ప్ర‌క‌టించారు. అలాంటి టైమ్‌లో హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ డ‌బ్బులు తిరిగి ఇచ్చింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న‌వారితో పాటు, జింఖానా స్టేడియం ద‌గ్గ‌ర అమ్మిన‌వాళ్ల‌కు తిరిగి డ‌బ్బులు ఇవ్వ‌డం అన‌వాయితీ. ఈ సారి కూడా అదే తీరున ఫ్యాన్స్‌ను డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌డం గ్యారెంటీగా క‌నిపిస్తోంది.

అధికార‌కంగా రేపు ప్ర‌క‌టించే చాన్స్‌

ఈ మ్యాచ్ టిక్కెట్ల రిఫండ్ గురించి హెచ్‌సీఏ పెద్ద‌లు ఇప్ప‌టికే ఓ క్లారిటీకి వ‌చ్చినా….రేపు పేప‌ర్‌లో ఈ విష‌యంపై స్ప‌ష్టంగా త‌మ నిర్ణ‌యాన్ని వెలువ‌రించ‌నున్నారు. మ్యాచ్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఇప్ప‌టికే తీవ్ర నిరాశ‌లో ఉన్న ఫ్యాన్స్‌కు ఈ వార్త కాస్త సంబ‌రాన్ని క‌ల్గించేలా ఉంటుంద‌ని హెచ్‌సీఏ స‌భ్యుడొక‌రు వ్యాఖ్యానించారు. రీసెంట్‌గా జ‌రిగిన ఓ ప్రెస్‌మీట్‌లో 3.4కోట్లు ఆదాయం టిక్కెట్ల రూపంలోనే వ‌చ్చింద‌ని హెచ్‌సీఏ తెలిపింది. ఈ మ్యాచ్‌కు 29,851 మంది హాజ‌ర‌య్యారు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts