HCA TTLలో మ‌ల్లిక్ రికార్డ్ సెంచ‌రీ..జైశ్వాల్ చెడుగుడు ఇన్నింగ్స్‌

నచ్చితే షేర్ చేయ్యండి

మెద‌క్ మావ్‌రిక్స్ ఓపెన‌ర్ మ‌ల్లికార్జున్…హెచ్‌సీఏ తెలంగాణ టీట్వంటీ లీగ్‌లో రెచ్చిపోయి ఆడాడు. కాక‌తీయ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బౌండ‌రీలైన్ హ‌ద్దుగా చెల‌రేగి దుమ్మురేపాడు. ఆరంభం నుంచే బౌల‌ర్ల‌పై దూకుడు ప్ర‌ద‌ర్శించిన మ‌ల్లిక్‌….అదే జోరును కొన‌సాగించి స్కోర్‌కార్డ్‌ను పరిగెత్తించాడు. టీటీఎల్ తొలి ఎడిష‌న్‌లో తొలి సెంచ‌రీని ఖాతాలో వేసుకోని అరుదైన రికార్డ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అత‌ని ఆట‌తీరుకు, స్టేడియంలోని ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు, గ్రౌండ్‌లోని ప్లేయ‌ర్స్ కూడా చ‌ప్ప‌ట్ల వ‌ర్షం కురిపించారు.

52 బంతుల్లోనే 110 ర‌న్స్‌

మ‌ల్లికార్జున్, మ్యాచ్ ఆరంభంలోనే బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. భారీ సిక్స‌ర్లు, బౌండ‌రీల‌తో బెంబేలెత్తించాడు. క్రికెట్‌లోని అన్ని ర‌కాల షాట్స్ ఆడుతూ, స్కోర్‌కార్డ్‌కు వేగాన్ని రుచిచూపించాడు. ఏకంగా 8ఫోర్లు, 9సిక్స‌ర్లు 110ర‌న్స్ చేశాడు. అంటే బౌండ‌రీల రూపంలోనే 86ప‌రుగులు సాధించాడు. ఈ సీజ‌న్‌లో ఇదే తొలి సెంచ‌రీ. ప్ర‌స్తుతం మ‌ల్లికార్జున్ ఓవ‌రాల్ టోర్నీలో 180ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా ఉన్నాడు.

మ‌ల్లిక్‌కు తోడుగా, జైశ్వాల్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌

మ‌ల్లికార్జున్‌కి తోడుగా…జైశ్వాల్ 39బంతుల్లో 81 ప‌రుగులు చేశాడు. ఇందులో, 5ఫోర్లు, 6సిక్స‌ర్లు ఉన్నాయి. జైశ్వాల్ కూడా సాధించిన ప‌రుగుల్లో 56ప‌రుగులు బౌండ‌రీల రూపంలోనే వ‌చ్చాయి. వీరిద్ద‌రి దూకుడితో, మెద‌క్ టీమ్ 2వికెట్ల న‌ష్టానికి 234ప‌రుగులు చేసింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts