HCA ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా టీసీఏ టోర్న‌మెంట్‌

నచ్చితే షేర్ చేయ్యండి

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా, తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీని నిర్వ‌హించింద‌ని ఆ సంస్థ స‌భ్యులు స్ప‌ష్టం చేశారు. ఎల్‌బి స్టేడియం వేదిక‌గా వారం రోజుల పాటు జ‌రిగిన టోర్నీలో మెరుగైన ఆట‌గాళ్లు వెలుగులోకి వ‌చ్చార‌ని, వాళ్లంద‌రి భ‌విష్య‌త్‌కు తాము భ‌రోసాగా ఉంటామ‌న్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో టీసీఏ ప్రెసిడెంట్‌, కార్య‌ద‌ర్శి, భ‌విష్య‌త్ కాలెండ‌ర్‌తో పాటు, హెచ్‌సీఏకు ప్ర‌శ్న‌ల‌ను సంధించారు.

హెచ్‌సీఏ లీగ్‌కు బీసీసీఐ అనుమ‌తి లేదు
హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ నిర్వ‌హిస్తున్న తెలంగాణ టీట్వంటీ లీగ్‌కు బీసీసీఐ నుంచి అనుమ‌తి లేద‌ని, టీసీఏ ఆరోపించింది. ప‌ర్మిష‌న్ ఉన్న‌ట్టు అబ‌ద్దాలు చెబుతూ, అంద‌రిని త‌ప్పుదొవ ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా, ఇలాంటి చౌక‌బారు ప్ర‌క‌ట‌న‌లు చేయోద్ద‌ని హిత‌వు ప‌లికారు. హెచ్‌సీఏ నిర్వ‌హిస్తున్న లీగ్‌లో చాలా అవ‌క‌త‌క‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని, జిల్లాల ఆట‌గాళ్లు కేవ‌లం న‌లుగురు మాత్ర‌మే ఉన్నార‌ని, మిగిలిన ప్లేయ‌ర్స్ అంతా బ‌య‌టివారేన‌ని మండిప‌డ్డారు.

2018-19 క్యాలెండ‌ర్ రిలీజ్‌
తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ త్వ‌ర‌లో చేయ‌బోయే కార్య‌క్ర‌మాల‌ను ఈ సంద‌ర్భంగా ప్రెసిడెంట్ యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ‌, సెక్ర‌ట‌రీ గురువా రెడ్డి రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో మ‌రింత వేగంగా తెలంగాణ గ్రామీణ క్రికెట్‌ను ముందుకుతీసుకెళ్తామ‌ని, ఇప్ప‌టికే, ఆ దిశ‌గా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌ని వీరిద్ద‌రూ చెప్పారు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts