హెచ్‌సీఏ నిర్ల‌క్ష్య‌మా…? బీసీసీఐ వ్యూహ‌మా..?

నచ్చితే షేర్ చేయ్యండి

రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ స్టేడియం…ఇండియాలోనే అత్యుత్త‌మ గ్రౌండ్‌గా అభిమానుల మ‌న్న‌లు మాత్ర‌మే కాదు, బీసీసీఐ చేత ప్ర‌శంస‌లు అందుకుంది. అలాంటి మైదానంలో ఔట్‌ఫీల్డ్ బాగాలేద‌నే కార‌ణంతో మ్యాచ్ ర‌ద్దైంది. వ‌ర్షం ఆగి 24గంట‌లు గ‌డిచినా మ్యాచ్ ర‌ద్ద‌వ్వ‌డంపై అంత‌టా తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి హెచ్‌సీఏ పాల‌కుల శైలే కార‌ణ‌మ‌ని, కేవ‌లం డ‌బ్బుల ద్యాస‌లో ప‌డి ఇలా చేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిలో నిజ‌మెంత అనేది ప‌క్క‌న పెడితే, అస‌లు హెచ్‌సీఏ మ్యాచ్‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌క‌పోవ‌డానికి ప్రధాన‌కార‌ణ‌మేమిట‌నేది ఇప్పుడు కీల‌కంగా మారింది.

గ్రౌండ్ సిద్ధం చేయ‌డంలో నిర్ల‌క్ష్యం…?

నిజానికి మ్యాచ్‌కు ముందురోజు భారీ వ‌ర్షం ప‌డింది. అంతేకాదు..దాదాపుగా 20రోజుల నుంచి భారీ వ‌ర్షాలు హైద‌రాబాద్‌ను ఆటాడుకుంటున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఔట్‌ఫీల్డ్‌ను మాత్రం ప‌ర్‌ఫెక్ట్‌గా సిద్ధం చేయ‌లేక‌పోయారు. బౌండ‌రీలైన్ ద‌గ్గ‌ర అంతా బుర‌ద‌మ‌యంగా ఉండ‌టం, టేబుల్ ఫ్యాన్స్‌తో ఆర‌బెట్టినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దుచేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే, ముందు నుంచి ఔట్‌ఫీల్డ్ గురించి ఎందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకోలేద‌న్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. అంతేకాదు..కొత్త పాల‌క‌వ‌ర్గం తొలి టీట్వంటీపై అస‌లేమాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకోలేద‌నే విమ‌ర్శ‌ల‌కు చేరువ చేసింది.

7 20నిమిషాల‌కే హోట‌ల్‌కు ప్లేయ‌ర్స్‌…!

మ్యాచ్‌ను 8గంట‌ల‌కు ర‌ద్దుచేసిన‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. విచిత్ర‌మేమిటంటే, అప్ప‌టికే ప్లేయ‌ర్స్ అంద‌రూ హోట‌ల్‌కు చేరుకున్నారు. గౌహ‌టిలో జ‌రిగిన అల్ల‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకోని ముందే ప్లేయ‌ర్స్‌ను పంపార‌నే ఆరోప‌ణ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. అంతేకాదు…మ్యాచ్‌ను నిర్వ‌హించే ప‌రిస్థితి లేద‌ని అంద‌రికి ముందుగానే తెలుస‌ని, కావాల‌నే కాసేపు హైడ్రామా న‌డిపార‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి.

బీసీసీఐ వ్యూహ‌ముందా..?

ఈ సిరీస్ ముగిసిన వెంట‌నే, మ‌నోళ్లు న్యూజిలాండ్‌తో వ‌న్డే, టీట్వంటీ సిరీస్ ఆడాలి. ఇలాంటి టైమ్‌లో ప్లేయ‌ర్స్ గాయ‌ప‌డితే ఇబ్బంది. మ‌రోవైపు, యాషెస్ టైమ్‌లో ఆస్ట్రేలియా కూడా సాహ‌సం చేసేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. ఇప్ప‌టికే ఆ టీమ్ కెప్టెన్ ఇంజ్యూరీ బారిన‌ప‌డ్డాడు. అందుకే, ఈ రెండు దేశాల బోర్డ్‌లు ముందుగానే ఆట‌ను కొన‌సాగించేందుకు సుముఖ‌త చూప‌లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏదీ ఏమైనా..హెచ్‌సీఏకు ఈ మ్యాచ్ ఆగిపోవ‌డం పెద్ద ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని క‌ల్గించేదే. మ‌రీ..ఇప్ప‌టికైనా పెద్ద‌లు స్టేడియాన్ని టెక్నాల‌జీకి త‌గ్గ‌ట్టుగా సిద్ధం చేస్తారో లేదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts