సీఎం గారూ కొత్త బూట్లు ఇప్పించండి..!

నచ్చితే షేర్ చేయ్యండి

ఒలింపిక్స్‌కు ఎంపికైన ఓ క్రీడాకారిణికి క‌నీసం మంచి షూస్ కూడా లేవు. ఇది విన‌డానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.. భార‌త్ నుంచి వంద మీట‌ర్ల ప‌రుగు పందెంలో పాల్గొంటున్న ఓ అథ్లెట్ ఏకంగా ముఖ్య‌మంత్రిని బూట్లు కొనివ్వాల‌ని వేడుకోవ‌డం ఆవేద‌న క‌లిగించింది. ఇంత‌కీ ఎవ‌రా క్రీడాకారిణి.. ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని షూస్ కోసం వేడుకుందో చూద్దాం..

ఒడిశా రాష్ట్రానికి చెందిన‌ ద్యుతి చంద్‌, ఒలింపిక్స్‌లో వంద మీట‌ర్ల ప‌రుగు పందెనికి ఎంపికైంది. అయితే 36 ఏళ్ల ద్యుతికి క‌నీసం మంచి షూస్ కూడా లేవు. అందుకే తన దగ్గర కనీసం నాణ్యమైన రన్నింగ్‌ షూస్‌ కూడా లేవని వాపోయింది. మా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన చేయమంటూ శుభాకాంక్షలు చెప్పారు. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడానికి నేను చేయాల్సిందల్లా చేస్తా. ఐతే నా దగ్గర రన్నింగ్‌ షూలు లేవు. ప్రస్తుతం వాడుతున్నవి పాడైపోయాయి. నాణ్యమైన బూట్లు కావాలంటే చాలా ఖర్చు పెట్టాలి. నాకు ట్రాక్‌ సూట్‌తో పాటు షూలు కూడా అందజేయాలని.. ఆ సాయం చేస్తే రియోలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తా. ఐతే ఇలా ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సి రావడం బాధేస్తోంది. నేను దేశానికి పేరు తెచ్చా. సాయం కోసం ఇలా అడుక్కోవడమేంటి అని నాకు నేను బిక్షదానిలా కనిపిస్తున్నా. ప్రభుత్వం తనంతట తాను సాయం చేయాలి. కానీ నేను అడగాల్సి వస్తోంది అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది ద్యుతి.

భార‌త దేశంలో క్రీడ‌ల ప‌ట్ల‌, క్రీడాకారుల ప‌ట్ల ఎంత‌టి చిన్న చూపు ఉందో ఈ ఒక్క ఘ‌ట‌న‌తోనే అర్థ‌మ‌వుతోంది. ఒలింపిక్స్‌లో ఇండియా మెడ‌ల్స్ సాధించ‌డం లేద‌ని మాట్లాడే నేత‌లు, విమ‌ర్శ‌కులు ఇప్ప‌టికైనా దేశంలోని క్రీడాకారుల క‌నీస అవ‌స‌రాలు గుర్తించండి.. వారికి అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తే అమెరికా, చైనా లాంటి దేశాల కంటే అధికంగా ప‌తకాలు సాధించే అవ‌కాశం ఉంది. ఇది ఒక్క ద్యుతి స‌మ‌స్య కాదు. దేశంలోని చాలా మంది క్రీడాకారుల‌కు కూడా ఇలాంటి స‌మ‌స్య‌లు ఉన్నాయి. అయితే మిగ‌తా వారు బ‌య‌ట ప‌డ‌లేదు. ద్యుతి బ‌య‌ట‌ప‌డింది. కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా అథ్లెట్లకు ఎలాంటి స‌దుపాయాలు అందిస్తున్నారో ఒక్క‌సారి ఆలోచించండి.. !


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts