వామ్మో..ధోనీకి ఇంత కోపం ఎందుకు వ‌చ్చింది..?

నచ్చితే షేర్ చేయ్యండి

రెండో టీట్వంటీలో ధోనీ, మ‌నీష్ పాండే క‌లిసి అద్భుత‌మైన భాగ‌స్వామ్యంతో టీమ్‌ను ముందుకు న‌డిపించారు. వీరిద్ద‌రూ అజేయంగా ఐదో వికెట్‌కు ఏకంగా 98ప‌రుగులు జోడించారు. అంతేకాదు..అర్థ‌సెంచ‌రీలు కూడా సాధించారు. అయితే, అంత చ‌క్క‌టి పార్ట‌న‌ర్‌షిప్‌తో ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేసిన వీరిద్ద‌రూ మ‌ధ్య‌లో ఒక‌రిపై ఒక‌రు అరుచుకున్నారంటే న‌మ్ముతారా. ఈ విష‌యంలో కాస్త మ‌నీష్ పాండే కాస్త వెన‌క్కి త‌గ్గినా..ధోనీ మాత్రం వీరావేశంతో గ‌ట్టిగా అరిచాడంటే నిజ‌మేన‌ని ఒప్పుకుంటారా..?

అచ్చంగా ఇలాగే జ‌రిగింది రెండో టీట్వంటీలో. ఓ ప‌రుగు విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య కాస్త హాట్ సీన్ ఏర్ప‌డింది. ధోనీ ఒక్క‌సారిగా బిగ్గ‌ర‌గా మ‌నీష్ పాండేపై అరుస్తూ, ఎటు చూస్తున్నావ్‌, నేను ఇక్క‌డ పిలుస్తుంటే, నువ్వేంటి అక్క‌డ చూస్తున్నావ్‌…ఆట‌పై శ్ర‌ద్ధ పెట్టంటూ మండిప‌డ్డాడు. ఇప్పుడీ వీడియో అంత‌టా హాట్‌టాపిక్‌గా మారింది. ఇంకా న‌మ్మ‌బుద్ది కాక‌పోతే క్రింద వీడియో చూడండి.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts