దుమ్మురేపిన ధోనీ…సెంచూరీయ‌న్‌లో చెడుగుడు

నచ్చితే షేర్ చేయ్యండి

ధోనీ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. కీల‌క‌మైన మ్యాచ్‌లో, కీల‌క‌మైన టైమ్‌లో తిరుగులేని ఆట‌తీరుతో అద‌ర‌గొట్టాడు. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా చివ‌రి బంతి వ‌ర‌కు మెరుగైన ఆట‌తీరుతో ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దాడు. అత‌ని ఆట‌తీరు అభిమానుల‌ను అల‌రించ‌డ‌మే కాదు, స్కోర్‌కార్డ్‌ను రెండు వంద‌ల‌కు చేరువ చేసింది.

28 బంతుల్లోనే 52 ప‌రుగులు

ధోనీ ఆరంభంలో ఎప్ప‌టిలాగే నిదానంగా ఆడాడు. అయితే, ఆ త‌ర్వాత దూకుడు పెంచాడు. వ‌రుస‌గా మెరుగైన షాట్ల‌తో స్కోర్‌కార్డ్‌ను పరిగెత్తించాడు. మ‌నీష్ పాండేకు త‌గ్గ‌ట్టుగా బ్యాట్‌కు పనిచెప్పాడు. ఫ‌లితంగా, 28 బంతుల్లోనే నాల్గు ఫోర్లు, మూడు భారీ సిక్స‌ర్ల‌తో 52 ప‌రుగులు చేశాడు. చివ‌రి పది ఓవ‌ర్ల‌లో భార‌త్ సాధించిన 102ప‌రుగుల్లో ధోనీవే స‌గం ప‌రుగులున్నాయంటే అత‌ని దూకుడు అర్థం చేసుకోవ‌చ్చు.

చివ‌రి ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు

టీమిండియా ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో ధోనీ దూకుడిగా ఆడాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతిని సిక్స‌ర్‌గా మ‌లిచిన ధోనీ త‌ర్వాత వ‌రుస‌గా రెండు బౌండ‌రీలు సాధించాడు. ఆ త‌ర్వాత మ‌రో రెండు ప‌రుగులు సాధించిన ధోనీ అర్థ‌సెంచ‌రీని ఖాతాలో వేసుకున్నాడు. చివ‌రి బంతికి సింగిల్ తీయడంతో భార‌త్ 188ప‌రుగులు చేసింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts