వ‌న్డేల్లో రోహిత్ శ‌ర్మ మూడో డ‌బుల్ సెంచ‌రీ

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ వ‌న్డేల్లో మ‌రో డ‌బుల్ సెంచ‌రీ సాధించాడు. మొహాలీలో జ‌రుగుతున్న రెండ వ‌న్డేలో రోహిత్ శ‌ర్మ తిరుగులేని ఆట‌తీరుతో ఫ్యాన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే కాదు, స‌రికొత్త రికార్డ్‌ను సృష్టించాడు. అప్ప‌టి వ‌ర‌కు నిల‌క‌డ‌గా ఆడిన రోహిత్‌, ఒక్క‌సారిగా పూన‌కం వచ్చిన‌వాడిలా చెల‌రేగి దుమ్మురేపాడు. కేవ‌లం 153బంతుల్లోనే 13ఫోర్లు, 12సిక్స‌ర్ల‌తో 208ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు రోహిత్‌.

65బంతుల్లో 5ఫోర్ల‌తో మొద‌టి 50ప‌రుగులు చేసిన రోహిత్‌, మొత్తంగా 115బంతుల్లో 9ఫోర్లు, భారీ సిక్స‌ర్‌తో మూడు అంకెల స్కోర్ సాధించాడు. ఆ త‌ర్వాత దూకుడు పెంచిన రోహిత్‌, 133బంతుల్లో ప‌ది ఫోర్లు, ఏడు సిక్స‌ర్ల‌తో 150ర‌న్స్ చేస్తే, డ‌బుల్ సెంచ‌రీని 151బంతుల్లో సాధించాడు. ఇందులో పూర్తిగా 124ప‌రుగులు బౌండ‌రీల రూపంలోనే సాధించాడంటే అత‌ని ఆట‌తీరు ఎంత‌లా కొన‌సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts