లంక పేస్‌కు..మ‌నోళ్ల ఫేస్ మాడింది

నచ్చితే షేర్ చేయ్యండి

ధర్మ‌శాల వ‌న్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ గింగ‌రాలు తిరిగారు. నిన్న‌టి వ‌ర‌కు తిరుగులేని ఆధిప‌త్యం క‌న‌ప‌ర్చిన బౌల‌ర్ల‌పై బ్యాట్స్‌మెన్ అంద‌రూ త‌డ‌బ‌డ్డారు. టాపార్డ‌ర్‌, మిడిలార్డ‌ర్‌లోని ఏడుగురు బ్యాట్స్‌మెన్ అస‌లేమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయారు. శ్రీలంక స్టార్ బౌల‌ర్ ల‌క్మ‌ల్ త‌న ఫుల్ కొటాను ఒకే స్పెల్‌లో ముగించాడంటే, బంతికి పిచ్ ఎంత‌లా దాసోహ‌మైపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు. అత‌నికి తోడుగా, మాథ్యూస్‌, ప్ర‌దీప్ చేసిన మ్యాజిక్ కూడా టీమిండియాను కేవ‌లం 29ప‌రుగుల‌కే 7వికెట్లు కోల్పోయేలా చేసింది.

గంట ముందుకు జ‌ర‌ప‌డ‌మే కొంప‌ముంచిందా..?
నిజానికి…ఇటీవ‌ల కాలంలో టీమిండియా ఎక్కువ‌గా డే అండ్ నైట్ వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతుంది. అయితే, ప్ర‌స్తుతం శీతాకాలం కావ‌డంతో మ్యాచ్‌ల‌ను షెడ్యూల్ కంటే ఒక గంట ముందుగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అయితే, తొలి మ్యాచ్‌లోనే టాస్ ఓడిపోవ‌డం, లంక పేస‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో మ‌న బ్యాట్స్‌మెన్ కంగారుప‌డ్డారు. ఫ‌స్ట్ సెష‌న‌ల్ శ్రీలంక బౌల‌ర్లు ఆఫ్‌స్వింగ్‌, ఇన్‌స్వింగ్‌తో హాడ‌లెత్తించారు. ఓ ద‌శ‌లో బాల్ ఎటు స్వింగ్ అవుతుందో తెలియ‌క మ‌నోళ్లు తెల్ల‌మొహం వేశారు.

మ‌ధ్యాహ్నాం 01 30 త‌ర్వాత మారిన సీన్‌
మ్యాచ్ 20ఓవ‌ర్లు ముగిశాకా సీన్ మారింది. బంతి బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా వ‌చ్చింది. దీంతో, క్రీజులో ఉన్న ధోనీ, యాద‌వ్ కాసేపు వ‌రుస బౌండ‌రీల‌తో హోరెత్తించారు. వీరిద్ద‌రూ క‌లిసి 8వికెట్‌కు 41ప‌రుగులు జోడించారు. ఈ టైమ్‌లో స్పిన్న‌ర్ ఎంట్రీ ఇవ్వ‌డం బ‌ట్టి, పిచ్ మాములుగా మారింద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌వ‌స‌రం లేదు. అయితే, తొలి మ్యాచ్‌కే ఇలాంటి సిచ్యువేష‌న్‌ను ఎదుర్కొన్న మ‌నోళ్లు, రాబోయే రెండు మ్యాచ్‌ల్లో టాస్ ఓడితే సినిమా గ్యారెంటీగా క‌నిపిస్తుంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts