అద్భుతం జ‌ర‌గ‌లేదు…లంక‌ను దాట‌లేదు

నచ్చితే షేర్ చేయ్యండి

తొలి వ‌న్డేలో అద్భుతాన్ని ఆశించిన అభిమానుల‌కు నిరాశే మిగిలింది. టార్గెట్ ఛేజింగ్‌లో లంక‌ను క‌ట్ట‌డి చేస్తార‌నుకున్న మ‌న బౌల‌ర్లు పూర్తిగా తేలిపోయారు. లంక జ‌ట్టు బ్యాట్స్‌మెన్ స్వ‌ల్ప ల‌క్ష్య‌ఛేద‌న‌లో నిల‌క‌డ‌గా ఆడ‌టంతో ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. త‌రంగ‌, డిక్‌విల్లా, మాథ్యూస్ టీమ్‌ను విజ‌య‌ప‌థంలో న‌డిపించారు.

ఆరంభంలో శ్రీలంక నిల‌క‌డ‌గా ఆడింది. బూమ్రా, ఫామ్‌లో ఉన్న గుణ‌తిల‌కను త్వ‌ర‌గానే ఔట్ చేయ‌డంతో మ్యాచ్ ఆస‌క్తిగా మారుతుంద‌ని అంద‌రూ భావించారు. కాసేప‌టికే తిరుమానే కూడా ఔట్ అవ్వ‌డంతో మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది. అయితే, సీనియ‌ర్ ఓపెన‌ర్ ఉపుల్ త‌రంగ టీమ్‌ను ముందుకు న‌డిపించాడు. 49రన్స్ చేసిన త‌రంగ , మాథ్యూస్ (25)తో కీల‌క భాగ‌స్వామ్యం న‌మోదు చేశాడు.

ఈ విజ‌యంతో శ్రీలంక వ‌న్డే సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది. ల‌క్మ‌ల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ల‌భించింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts