తొలి వ‌న్డేలో టీమిండియా 112 ఆలౌట్‌

నచ్చితే షేర్ చేయ్యండి

ధర్మ‌శాల వ‌న్డేలో టీమిండియా 112ప‌రుగుల‌కు ఆలౌటైంది. మ‌హేంద్ర సింగ్ ధోనీ అద్భుత‌మైన ఆట‌తీరుతో….భార‌త్ ఈ మ్యాచ్‌లో మూడు అంకెల స్కోర్ దాటింది. మ‌హేంద్రుడు ఒక్క‌డే అంతా తానై టీమ్‌ను న‌డిపించాడు. చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిలిచి కాసేపు లంక బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. అంతేకాదు, టీమిండియా శిబిరంలో, అభిమానుల్లో కాస్త న‌వ్వులు పూయించాడు. ప్ర‌స్తుతం బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మ‌న బౌల‌ర్లు ఎలా రాణిస్తార‌నేది కీల‌కంగా మారింది.

2ప‌రుగుల‌కే 2వికెట్లు..29ర‌న్స్‌కే 7వికెట్లు

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లంక‌కు బౌల‌ర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా ల‌క్మ‌ల్‌, మాథ్యూస్ జోడీ ఓపెన‌ర్ల‌ను రెండు ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేర్చింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువ‌సేపు క్రీజులో నిలువ‌లేక‌పోవ‌డంతో లంక జోరు కొన‌సాగింది. అంతేకాదు, పాండే, శ్రేయాస్ అయ్య‌ర్‌, హార్థిక్ పాండ్యా లాంటి ప్లేయ‌ర్స్ ఔటవ్వ‌డంతో భార‌త్ 29ప‌రుగుల‌కే 7వికెట్లు కోల్పోయింది.

ఒక్క‌డిగా ఆడిన ధోనీ

ఈ టైమ్‌లో క్రీజులోకి వ‌చ్చిన ధోనీ ఒక్క‌డిగా ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు. లోయ‌ర్ ఆర్డ‌ర్ సాయంతో జ‌ట్టు స్కోర్‌ను 100ప‌రుగులు సాధించాడు. 10ఫోర్లు, రెండు భారీ సిక్స‌ర్ల‌తో 65ర‌న్స్ చేసి చివ‌రి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇలాంటి టైమ్‌లో అంద‌రి అంచ‌నాల‌ను మ‌రోసారి అందుకున్న ధోనీ, జ‌ట్టుకు కెప్టెన్‌, కోచ్ చెప్పిన‌ట్టుగా ఎంత కీల‌క ఆట‌గాడో నిరూపించుకున్నాడు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts