తుఫాన్‌ల ఆరంభించి….చివ‌ర్లో స‌ల్ల‌బ‌డ్డ శ్రీలంక‌

నచ్చితే షేర్ చేయ్యండి

విశాఖ వ‌న్డేలో శ్రీలంక జ‌ట్టు కుప్ప‌కూలింది. టాపార్డ‌ర్ ఇచ్చిన ఆరంభాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక‌, భార‌త స్పిన్న‌ర్ల‌ను ఎలా ఎదుర్కొవాలో అర్థంకాక‌..పూర్తిగా త‌డ‌బ‌డింది. అంతేకాదు…ఓ ద‌శ‌లో ఈజీగా 300దాటుతుంద‌నుకున్న లంక‌, కేవ‌లం 215ప‌రుగుల‌కే ప‌రిమిత‌మై ఓట‌మి అంచుల్లోకి వెళ్లింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ భార‌త స్పిన్న‌ర్ల‌కు పూర్తిగా దాసోహ‌మైపోయారు.

భార‌త ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆరంభంలోనే గుణ‌తిల‌కే వికెట్ కోల్పోయింది. ఈ టైమ్‌లో త‌రంగ‌తో జ‌త‌క‌లిసిన స‌మ‌ర అద్భుత‌మైన ఆట‌తీరుతో ఎంట‌ర్‌టైన్ చేశారు. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా దుమ్మురేపారు. వీరిద్ద‌రి ఆట‌తీరుతో భార‌త బౌల‌ర్లు పూర్తిగా తేలిపోయారు. ఏకంగా రెండో వికెట్‌కు వీళ్లిద్ద‌రూ క‌లిసి 121ప‌రుగులు జోడించారు. స‌మ‌ర 42ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

మ్యాచ్‌ను మ‌లుపుతిప్పిన త‌రంగ ఔట్‌

28వ ఓవ‌ర్‌లో ఉపుల్ త‌రంగ ఔట్ మ్యాచ్‌ను మ‌లుపుతిప్పింది. 95ప‌రుగులు చేసి ఫుల్ జోష్‌లో ఉన్న త‌రంగ‌ను ధోనీ వికెట్ల వెనుక బొల్తాకొట్టించాడు. థ‌ర్డ్ అంపైర్ స్టంపౌట్‌గా ప్ర‌క‌టించిన కాసేప‌టికే, డిక్‌విల్లా కూడా కుల్దీప్‌కు దొరికిపోయాడు. ఆ త‌ర్వా ఆదుకుంటాడుకున్న మాథ్యూస్‌, పెరీరా వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు క్యూక‌ట్టారు. దీంతో లంక‌, 215ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

స్పిన్న‌ర్ల మార్చేసిన ఆట‌

భార‌త యంగ్ స్పిన్ ద్వ‌యం కుల్దీప్ యాద‌వ్‌, చాహ‌ల్ లంక మిడిలార్డ‌ర్‌ను ఆటాడుకున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి చెరో మూడు వికెట్లు తీయ‌డ‌మే కాదు, భారీ స్కోర్ చేస్తుంద‌నుకున్న లంక‌ను త‌క్కువ స్కోర్‌కే ప‌రిమితం చేసి, సిరీస్ గెలిచే అవ‌కాశాన్ని క్రియేట్ చేశారు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts