న్యూ ఇయ‌ర్ లో జాగృతి క్రికెట్ పోటీలు

న్యూ ఇయ‌ర్ లో జాగృతి క్రికెట్ పోటీలు
నచ్చితే షేర్ చేయ్యండి

తెలంగాణ పండుగ‌ బ‌తుకమ్మ‌కు ప్ర‌పంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన తెలంగాణ జాగృతి…క్రీడ‌ల పైనా ఫోక‌స్ చేసింది. తెలంగాణ‌లోని ప్ర‌తిభ‌ను వెలికి తీసేందుకు న‌డుం బిగించింది. గ్రామీణ యువ‌తలో క్రీడా నైపుణ్యాల‌ను పెంపొందించ‌డంతో పాటు వారి ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించాల‌నే ల‌క్ష్యంతో తెలంగాణ జాగృతి క్రికెట్ క‌ప్ ను నిర్వ‌హిస్తోంది. ఈ క‌ప్ ను నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత హైద‌రాబాద్ లో ఆవిష్క‌రించారు. జ‌న‌వ‌రి 7 నుంచి 23 వ‌ర‌కు ఈ పోటీలు జ‌రుగుతాయ‌ని తెలంగాణ జాగృతి తెలిపింది. తెలంగాణ‌లోని పాత ప‌ది జిల్లాల‌నే ప‌ది జోన్లుగా విభజించి క్రికెట్ పోటీల‌ను నిర్వ‌హిస్తోంది. నాకౌట్ ప‌ద్ధ‌తిలో పోటీలు జ‌రుగుతాయ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ప్ర‌తీ జోన్ నుంచి గ‌రిష్టంగా 24 టీమ్ లు పాల్గొన‌నున్నాయి. మొత్తం 240 జ‌ట్లు ఈ పోటీలు పాల్గొన‌నున్నాయి. ప్ర‌తీ జోన్ లో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఎంపీ క‌విత‌ను క‌లిసిన‌ యంగ్ క్రికెట‌ర్లు

ఎంపీ క‌విత‌ను క‌లిసిన‌ యంగ్ క్రికెట‌ర్లు
నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త్ అండ‌ర్‌-16 జ‌ట్టు ప్రాబ‌బుల్స్‌కు ఎంపికైన ఇద్ద‌రు యంగ్ క్రికెట‌ర్ల‌ను నిజామాబాద్ ఎంపీ క‌విత అభినందించారు. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని, దేశ‌కీర్తితో పాటు రాష్ట్రానికి పేరు తీసుకురావాల‌ని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ ప్ర‌భుత్వం క్రీడ‌ల‌కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని, స్కూల్ స్థాయి నుంచి ఆట‌ల‌ను ఎంక‌రేజ్ చేస్తామ‌ని ఆమె చెప్పారు. తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ అధ్వ‌ర్యంలో ఎంపికైన క్రికెట‌ర్ల‌తో పాటు, కోచ్‌లు, సెక్ర‌ట‌రీలు ఎంపీని క‌లిశారు. గ‌త మూడు నెల‌లుగా..క్యాట్ అధ్వ‌ర్యంలో స్కూల్‌స్థాయి క్రికెట్ పోటీల‌ను నిర్వ‌హించారు. వీటిలో స‌త్తాచాటిన విద్యార్థులు జాతీయ స్థాయిలోనూ త‌న ప్ర‌తిభ‌ను క‌న‌ప‌ర్చారు. అంతేకాదు..ప్ర‌క‌టించిన 38ప్రాబ‌బుల్స్‌లో ఇద్ద‌రు తెలంగాణ‌కు చెందిన వారికి అవ‌కాశం ద‌క్కింది. హైద‌రాబాద్‌కు చెందిన శ్ర‌వ‌ణ్‌తో పాటు, ఖ‌మ్మం అంకుర్ అండ‌ర్‌-16 క్రికెట్ జ‌ట్టులో స్థానం ద‌క్కింది. ఇదే జ‌ట్టుకు మేనేజ‌ర్‌గా సునీల్ బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈయ‌న…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

భార‌త్ అండ‌ర్‌-16లో తెలంగాణ క్రికెట‌ర్లు

భార‌త్ అండ‌ర్‌-16లో తెలంగాణ క్రికెట‌ర్లు
నచ్చితే షేర్ చేయ్యండి

క్రికెట్‌ను గ్రామీణ స్థాయి నుండి మాత్ర‌మే కాదు, స్కూల్ లెవ‌ల్ నుండి ఎంక‌రేజ్ చేయాల‌నే కాన్సెప్ట్‌తో మొద‌లైన క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ తెలంగాణ‌(CAT) తొలి విజ‌యం సాధించింది. చాలా యేళ్లుగా తెలంగాణ‌లో టాలెంట్ ప్లేయ‌ర్స్ ఎదుగుద‌ల కోసం పోరాడుతున్న క్యాట్‌, ఇద్ద‌రు నాణ్య‌మైన యువ క్రికెట‌ర్ల‌ను భార‌త్ అండ‌ర్‌-16 టీమ్‌కు అందించింది. ఖ‌మ్మం జిల్లాతో పాటు, హైద‌రాబాద్‌కు చెందిన ఇద్ద‌రు క్రికెట‌ర్లు…అండ‌ర్‌-16 ప్రాబ‌బుల్స్‌కి ఎంపిక‌య్యారు. స్కూల్ స్పోర్ట్స్ ప్ర‌మోష‌న్ ఫౌండేష‌న్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో క‌లిసి నిర్వ‌హించిన టాలెంట్ హంట్‌లో దేశ‌వ్యాప్తంగా స్కూల్ స్థాయిలో జిల్లా లెవ‌ల్ నుండి రాష్ట్ర‌స్థాయి, ఆ త‌ర్వాత దేశ‌స్థాయి వ‌ర‌కు పోటీలు నిర్వ‌హించారు. ఈ ఫౌండేష‌న్‌కు చేత‌న్ శ‌ర్మ చైర్‌ప‌ర్స‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ తెలంగాణ (CAT) తెలంగాణ‌లో బాధ్య‌త‌లు తీసుకుంది. సునీల్ బాబు అధ్వ‌ర్యంలో ముందుకెళ్తున్న క్యాట్‌…ఇద్ద‌రు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆదిలాబాద్ టైగ‌ర్స్ ఫ్రెండ్లీ మ్యాచ్‌

ఆదిలాబాద్ టైగ‌ర్స్ ఫ్రెండ్లీ మ్యాచ్‌
నచ్చితే షేర్ చేయ్యండి

తెలంగాణ ప్రీమియ‌ర్ లీగ్‌లో ప్ర‌త్యేక జ‌ట్టుగా ముద్ర వేసుకున్న ఆదిలాబాద్ టైగ‌ర్స్‌, సీజ‌న్‌-2కు ముందు మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటుంది, తొలి సీజ‌న్‌లో ఆక‌ట్టుకున్న సైబర్‌సిటీ చాంప్స్‌తో క‌లిసి క‌ర్ట‌న్‌రైజ‌ర్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధ‌మైంది. ఈ నెల 19న రెండు జ‌ట్ల మ‌ధ్య ఈ పోటీ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే రెండు జ‌ట్ల ఆట‌గాళ్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. మ్యాచ్‌ను ఆహ్ల‌ద‌క‌రంగా నిర్వ‌హించేందుకు ఆదిలాబాద్ టైగ‌ర్స్ ఫ్రాంచైజీ ఓన‌ర్ బి.వెంక‌టేష్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తొలి సీజ‌న్ నుంచే ఆదిలాబాద్ టైగ‌ర్స్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. మిగిలిన ఫ్రాంచైజీల కంటే భిన్న‌మైన ప్ర‌చార‌శైలితో అంత‌టా మార్మోగేలా చేసుకుంది. ఇప్పుడు అలాంటి పంథాలోనే మ‌రోసారి ప‌య‌నిస్తోంది ఆదిలాబాద్ జ‌ట్టు. సెల‌బ్రేటీల‌తో , అడ‌విపుత్రుల‌కు క్రికెట్ మ్యాచ్‌ను ఏర్పాటు చేసి వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపాల‌ని చూస్తున్నారు. ఈ మేర‌కు బుల్లితెర మెగాస్టార్ ప్ర‌భాక‌ర్‌,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

సెమీస్ రేస్‌లో తెలుగు టైటాన్స్‌

సెమీస్ రేస్‌లో తెలుగు టైటాన్స్‌
నచ్చితే షేర్ చేయ్యండి

ప్రో క‌బ‌డ్డీలో మ‌ళ్లీ తెలుగు టైటాన్స్ దుమ్ము రేపుతోంది. మొద‌ట హ్యాట్రిక్ ఓట‌మి న‌మోదు చేసిన ఈ జ‌ట్టు తీవ్ర నిరాశ ప‌రిచింది. అయితే ఆ త‌ర్వాత పుంజుకుని వ‌రుస విజ‌యాలు సాధిస్తోంది. తాజాగా దబాంగ్ ఢిల్లీపై 36-28 పాయింట్ల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో మొత్తం 37 పాయింట్లు సాధించి, సెమీస్‌కు చేరువైంది తెలుగు టైటాన్స్‌. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రాహుల్‌చౌద‌రి ఆల్‌రౌండ‌ర్‌గా అద‌ర‌గొట్టాడు. రైడింగ్‌లో, డిఫెన్స్‌లో పాయింట్లు సాధించాడు. రైడింగ్‌లో 14 పాయింట్లు, డిఫెన్స్‌లో 2 పాయింట్లు సాధించాడు. దీంతో ఈ మ్యాచ్ విజ‌యంలో కీ రోల్ పోశించాడు రాహుల్ చౌద‌రి. ముందు ముందు కూడా ఇదే ఆట కొన‌సాగిస్తే, టైటిల్‌ను ముద్దాడే అవ‌కాశం ఉంది. ఆల్ ద బెస్ట్ తెలుగు టైటాన్స్‌..!

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పింక్ పాంథ‌ర్స్ అదుర్స్

పింక్ పాంథ‌ర్స్ అదుర్స్
నచ్చితే షేర్ చేయ్యండి

ప్రొ క‌బ‌డ్డీ లీగ్‌లో మ‌రోసారి అద‌ర‌గొట్టింది జైపూర్ పింక్ పాంథ‌ర్స్‌. ఆదివారం బెంగాల్ వారియ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 33- 27 పాయింట్ల తేడాతో విజ‌యం సాధించింది జైపూర్‌. రైడ‌ర్లు  రాజేశ్‌ నర్వాల్‌, జస్వీర్‌సింగ్‌, అజయ్‌ కుమార్‌లు విజృంభించారు. దీంతో 6 పాయింట్ల తేడాతో గెలుపొందింది పింక్ పాంథ‌ర్స్‌. బెంగాల్ టీమ్‌లో విజ‌యం కోసం దీపక్‌ నివాస్‌, అజయ్‌ ఠాకూర్‌ చెరో తొమ్మిది రైడ్‌ పాయింట్లతో పోరాడినా జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయారు. ఫ‌స్ట్ హాఫ్‌లో 17-9గా ఉంది పాయింట్ల ప‌ట్టిక‌. సెకండ్ హాఫ్ మొదలైన ఐదు నిమిషాలకే మరోసారి బెంగాల్ వారియ‌ర్స్‌ని ఆలౌట్‌ చేసి జైపుర్‌ 25-14కు ఆధిక్యాన్ని పెంచుకుంది. దీంతో ఇక జైపూర్‌కు తిరుగు లేకుండాపోయింది. చివ‌రికి 33-27 తేడాతో బెంగాల్ వారియ‌ర్స్‌ను ఓడించింది జైపూర్ పింక్ పాంథ‌ర్స్‌.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

తెలుగు టైటాన్స్ డీలా ..!

తెలుగు టైటాన్స్ డీలా ..!
నచ్చితే షేర్ చేయ్యండి

ప్రొ క‌బ‌డ్డీ లీగ్‌లో ఈసారి తెలుగు టైటాన్స్ డీలా ప‌డింది. వ‌రుస‌గా రెండుసార్లు ఓడిపోయింది. తాజాగా బుధ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్‌పాంథ‌ర్స్ చేతిలో ప‌రాజ‌యం పాలైంది. 24-28 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ జ‌ట్టులో సందీప్ న‌ర్వాల ఒక్క‌డే 6 పాయింట్లు సంపాదించి కాస్త ప‌ర్వాలేద‌నిపించాడు. మిగ‌తా ఆట‌గాళ్లు అంత‌గా రాణించ‌లేదు. సుఖేశ్‌ హెగ్డే ఏడు సార్లు రైడింగ్‌కు వెళ్లి.. ఒక్క పాయింటు కూడా సాధించలేకపోయాడు. ఫ‌స్ట్ హాఫ్‌ ముగిసేసరికి 12-12తో సమానంగా నిలిచిన రెండు జట్లూ.. ఆ తర్వాత పది నిమిషాలు కూడా అలాగే పోరాడాయి. అయితే జైపూర్ ఆ త‌ర్వాత పుంజుకుంది. స‌బ్‌స్టిట్యూట్‌గా రంగంలోకి దిగిన రాహుల్ కూడా పొర‌పాటుగా లాబీలోకి వెళ్ల‌డం మైన‌స్‌గా మారింది. దీంతో జైపూర్ పాంథ‌ర్స్ విజ‌యం సాధించింది. 28- 24 తేడాతో గెలుపొందింది. తెలుగు టైటాన్స్‌తో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More