న‌న్ను ఫిక్సింగ్ చేయ‌మ‌ని బుకీలు వెంట‌ప‌డ్డారు

నచ్చితే షేర్ చేయ్యండి

మ‌లేసియా స్టార్ ష‌ట్ల‌ర్ లీ చోంగ్ వి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. మ్యాచ్‌ల‌ను ఫిక్సింగ్ చేయాల‌ని బుకీలు త‌న‌ను తీవ్రంగా వేధించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. చాలా మ్యాచ్‌ల వ‌ర‌కు వారు వెంటాడ‌ర‌ని, అయితే, తాను ఎక్క‌డ త‌న మ‌నో ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకెళ్లాన‌న్నాడు. అయితే, ప్రస్తుతం త‌న టీమ్‌లోని ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డర‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొవ‌డం తీవ్రంగా బాధిస్తుంద‌న్నాడు. వారిద్ద‌రు త్వ‌ర‌లోనే విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. మ‌లేసియా స్టార్ ష‌ట్ల‌ర్ లీ చోంగ్ వి…వ‌ర‌ల్డ్‌లోనే ది బెస్ట్ ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అలాంటి ఆట‌గాడు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు అంత‌టా హాట్‌టాపిక్‌గా మారాయి. మ‌రోవైపు, అత‌ను గ‌తంలో డోపింగ్‌లో ప‌ట్టుబ‌డ్డాడు. ఆ టైమ్‌లోనే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే, ఆట‌లో రీ ఎంట్రీ ఇచ్చాకా…లీ మెరుగైన ఆట‌తీరుతో అంద‌రి మ‌న‌సులు గెల్చుకున్నాడు. అలాంటి ష‌ట్ల‌ర్‌,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

భార‌త బ్యాడ్మింట‌న్‌కు ఝ‌ల‌క్‌

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త బ్యాడ్మింట‌న్‌కు షాక్ త‌గిలింది. పురుషుల సింగిల్స్ కోచ్ ముల్య, ప‌ద‌వి నుంచి త‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌నే. బ్యాడ్మింట‌న్ లీగ్ త‌ర్వాత ఆయ‌న అధికారికంగా త‌న రాజీనామాను ప్ర‌క‌టించ‌నున్నాడు. ఇప్ప‌టికే, బాయ్ పెద్ద‌ల‌కు విష‌యాన్ని చేర‌వేసిన ఆయ‌న‌, వారి స‌ల‌హా మేర‌కు ఆ ప‌ద‌విలో లీగ్ పూర్త‌య్యేవ‌ర‌కు కొన‌సాగ‌నున్నాడు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే ఆయ‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు బాయ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తొమ్మిది నెలలుగా భారత బ్యాడ్మింటన్‌ సంఘం కోచ్‌గా కొనసాగుతున్న ముల్యో, పురుషుల సింగిల్స్‌ క్రీడాకారులకు నైపుణ్య‌మైన కోచింగ్ ఇచ్చాడు. అత‌ని శిక్ష‌ణ‌లో…కిదాంబి శ్రీకాంత్‌ నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ సహా మిగతా క్రీడాకారులు ఓ రేంజ్‌లో రాణించారు. బెంగళూరులో శిక్షణ పొందుతున్న సైనా నెహ్వాల్‌ సైతం తిరిగి హైదరాబాద్‌ రావడానికి ముల్యో కారణం. అలాంటి ముల్యో మ‌న జ‌ట్టును వ‌ద‌లం కాస్త ఇబ్బందిక‌ర ప‌రిస్థితే.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఫైన‌ల్లో నిరాశ‌ప‌ర్చిన సింధు

నచ్చితే షేర్ చేయ్యండి

బీడ‌బ్ల్యూఎఫ్ సూప‌ర్ సిరీస్ ఫైన‌ల్స్‌లో తెలుగుమ్మాయి పీవీ సింధు విజ‌యం ఫైన‌ల్లో ఓడిపోయింది. ఫైన‌ల్లో య‌మ‌గూచితో త‌ల‌ప‌డ్డ సింధు, అద్భుతైన పోరాట‌ప‌టిమ చూపించినా..విజ‌యం సమాత్రం సాధించ‌లేదు. ఈ టైటిల్‌ను గెల్చుకున్న తొలి భార‌త ష‌ట్ల‌ర్‌గా రికార్డ్‌ను సొంతం చేసుకోవాల‌నుకున్న సింధుకు నిరాశే మిగిలింది. తొలి గేమ్‌లో పీవీ సింధు అద్భుత‌మైన ఆట‌తీరుతో అద‌ర‌గొట్టింది. య‌మ‌గూచిపై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌త్య‌ర్థికి అస‌లేమాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా తిరుగులేని దూకుడితో ప్ర‌త్య‌ర్థిని కంగారుపెడుతూ 21-15తో విజ‌యం సాధించింది. ఈ గేమ్ త‌ర్వాత జ‌రిగిన రెండో గేమ్‌లో య‌మ‌గూచి పుంజుకుంది. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా దూకుడు పెంచి, సింధును ఇర‌కాటంలో ప‌డేసింది. 21-12తో య‌మ‌గూచి, సింధును ఈ గేమ్‌లో ఓడించింది, మూడో గేమ్ నువ్వా-నేనా అన్న‌ట్టు హోరాహోరీగా జ‌రిగింది. దీంతో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ ద‌శ‌లో వీరిద్ద‌రూ దూకుడిగా ఆడి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్‌కే షాకిచ్చిన శ్రీకాంత్‌

నచ్చితే షేర్ చేయ్యండి

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ సూప‌ర్ సిరీస్‌లో కిదాంబి శ్రీకాంత్ సంచ‌ల‌నం సృష్టించాడు. వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్ స‌న్‌వాన్ హోకు షాకిచ్చాడు. రెండో రౌండ్ పోటీల్లో శ్రీకాంత్ తిరుగులేని ఆట‌తీరుతో అల‌రించాడు. మొద‌టి గేమ్ నుంచి దూకుడిగా ఆడుతూ ప్ర‌త్య‌ర్థిని కంగారుపెట్టాడు. అత‌ని ఆట‌తీరుతో, నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్ స‌న్‌వాన్ హో 15-21, 21-13, 21-13తేడాతో విజ‌యం సాధించాడు. అంతేకాదు…ఇండోనేషియా సూప‌ర్ సిరీస్ దూకుడిని ఇక్క‌డ కూడా కొన‌సాగించి స‌త్తాచాటాడు. తొలి గేమ్‌లో త‌డ‌బాటు శ్రీకాంత్‌, ఆరంభంలోనే డీలాప‌డ్డాడు. ఈ గేమ్‌లో దూకుడిగానే ఆడినా, ప్ర‌త్య‌ర్థి స‌న్‌వాన్ హో ఇంకాస్త మెరుగ్గా ఆడ‌టంతో వెన‌క‌ప‌డేలా చేసింది. అయితే, ఈ టైమ్‌లో శ్రీకాంత్‌, స‌న్‌వాన్‌పై ఎటాకింగ్ గేమ్ మొద‌లుపెట్టాడు. ఫ‌లితంగా వ‌రుస‌గా రెండు సెట్ల‌లో విజ‌యం సాధించాడు. స‌ర్వీస్ గేమ్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శించిన శ్రీకాంత్‌….ప్ర‌త్య‌ర్థిని షేక్ చేయ‌డ‌మే కాదు, డీలాప‌డేలా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆడుతా…ఆటాడిస్తా

నచ్చితే షేర్ చేయ్యండి

ఆటడమే కాదు.. ఓ రేంజ్ లో అటాడిస్తానంటోంది గుత్తా జ్వాల. టాలెంట్ ఉండి ఆఫర్లను దక్కించుకోలేకపోతున్న అటగాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహిస్తానంటోంది. తన అకాడమీలో ప్లేయర్లను స్టార్లుగా తీర్చిదిద్దుతానని ధీమాగా చెబుతోంది. హైదరాబాద్ కూకట్ పల్లిలో గ్లోబల్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవం అనంతరం ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది జ్వాల. నగరంలోని 25 ప్రాంతాల్లో ఈ అకాడమీ నుంచే కోచింగ్ ఇస్తామంటోంది. అకాడమీ పెట్టాలన్న జ్వాల ఆలోచన ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. డబుల్స్, సింగిల్స్ అని తేడా లేకుండా అందరికి సమాన అవకాశాలు కల్పిస్తామంది. ఒలింపిక్ స్టార్లను చేయడమే లక్ష్యంగా అకాడమీ స్థాపించామని.. వినడానికి కాస్త ఎక్కువే అనిపించినా ఇది మాత్రం నిజమంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తన లక్ష్యం తప్పక నెరవేరుతుందన్నారు జ్వాల.గతంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్అథారిటీలో కోచ్ గా పనిచేసిన గోవర్ధన్ గ్లోబల్ అకాడమీకి చీఫ్ కోచ్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఎట్ట‌కేల‌కు పీవీ సింధుకు ద‌క్కింది

నచ్చితే షేర్ చేయ్యండి

ఒలింపిక్ మెడ‌ల్ విజేత పీవీ సింధుకు ఎట్ట‌కేల‌కు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. రెండు మెగా టోర్న‌మెంట్ల‌లో ఫెయిల్ అయినా, అస‌లేమాత్రం త‌డ‌బ‌డ‌కుండా రాణించి చైనా సూప‌ర్ సిరీస్‌ను ద‌క్కించుకుంది. ఇది ఆమె కెరీర్‌లో తొలి సూప‌ర్ సిరీస్ టైటిల్‌. ఫైన‌ల్లో కాస్త కంగారుప‌డ్డ‌ట్టు క‌నిపించినా…ఆ త‌ర్వాత పూర్తిగా కోలుకోని ఆమె విజ‌యం సాధించింది. చైనాకు చెందిన స‌న్ యూతో మూడు గేమ్‌ల‌లో జ‌రిగిన పోటీలో పీవీ సింధు విజేత‌గా నిలిచి అంద‌రిని ఎంట‌ర్‌టైన్ చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే సింధుపై అంద‌రిలో ఆస‌క్తి పెరిగింది. ఆమె వాటికి త‌గ్గ‌ట్టుగానే ప్ర‌త్య‌ర్థిని కంగారుపెట్టింది. తొలి గేమ్‌ను 21-11 తేడాతో విజ‌యం సాధించింది. రెండో గేమ్‌ను ఆమె మ‌రింత దూకుడిగా ప్రారంభించింది. అయితే, స‌న్ యూ కూడా కాన్ఫిడెంట్‌గా ఆడ‌టంతో సింధుకు రెండో సెట్‌లో ఓట‌మి త‌ప్ప‌లేదు. దీంతో..పోటీ 1-1తో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

వ‌రుస‌గా రెండో ఓట‌మి

నచ్చితే షేర్ చేయ్యండి

రియో ఒలింపిక్స్ త‌ర్వాత జ‌రిగిన రెండు సిరీసుల్లో వ‌రుస‌గా విఫ‌ల‌మైంది పివి సింధు. భారీ అంచ‌నాల‌తో టైటిల్ రేస్‌లో నిలిచి, రెండో రౌండ్‌లోనే ఇంటిదారి ప‌ట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన రెండు టోర్నీల్లో రెండో రౌండ్‌లోనే సింధు ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా జ‌రిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలోనూ నిరాశపరిచింది. రెండో రౌండ్లో చైనా క్రీడాకారిణి హి బింగ్‌జియో చేతిలో 22-20, 21-17 తేడాతో పరాజయం పాలైంది సింధు. ఒలింపిక్స్‌ తర్వాత సింధు ఆడిన రెండు టోర్నీల్లోనూ రెండో రౌండ్లోనే ఓటమిపాలైంది. మొదటిది డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌కాగా.. రెండోది ఫ్రెంచ్‌ ఓపెన్‌. అయితే వ‌చ్చే టోర్నీల్లో గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది సింధు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

డెన్మార్క్ టోర్నీ నుంచి సింధు ఔట్..!

నచ్చితే షేర్ చేయ్యండి

రియో ఒలింపిక్స్ తర్వాత పోటీపడ్డ తొలి టోర్నమెంట్‌లో పీవీ సింధు నిరాశపరిచింది.  డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో రెండోరౌండ్లో చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో ఫేవరెట్ సింధు 13-21, 23-21, 18-21తో జపాన్‌కు చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ సయాక సాటో చేతిలో పోరాడి ఓడింది. దీంతో సింధుతో పాటు ఇత‌ర ఆట‌గాళ్లు ఓడిపోవ‌డంతో డెన్మార్క్‌లో భార‌త్ పోరు ముగిసింది. ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్న సింధు ఓడిపోవ‌డంతో ఆమె అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

స‌క్సెస్ రాకెట్

నచ్చితే షేర్ చేయ్యండి

డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పీవీ సింధు శుభారంభం చేసింది. రియో ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన త‌ర్వాత సింధు తొలిసారి ఆడుతున్న టోర్నీ ఇదే..! ఈ టోర్నీలో సింధు రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. వుమెన్స్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి బింగ్జియావోపై 21-14, 21-19 పాయింట్ల తేడాతో వరుస సెట్లలో విజ‌యం సాధించింది సింధు. రెండో రౌండ్‌లో జపాన్‌ క్రీడాకారిణి సయాకా సాటోతో సింధు తలపడనుంది. ఈ టోర్నీలో టైటిల్ సాధించి రియో విజ‌యాన్ని కొన‌సాగించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది సింధు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More