దీప‌కుఆ గౌర‌వం ఇస్తారా..?

నచ్చితే షేర్ చేయ్యండి

రియో ఒలింపిక్స్ లో సంచ‌ల‌నం సృష్టించిన దీప‌క‌ర్మాక‌ర్ కు మ‌రింత ప్రోత్సాహం అందించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఒలింపిక్స్ లో దీప ప్రోడునోవా విన్యాసంతో అద‌ర‌గొట్టి నాలుగో స్థానంలో నిలిచిన విష‌యం తెలిసిందే. భార‌త్ నుంచి ఒలింపిక్స్ కు అర్హ‌త సాధించిన ఏకైక జిమ్నాస్ట్ దీప‌క‌ర్మాక‌ర్. అందుకే ఆమెకు త‌గినంత గౌర‌వం ఇవ్వాల‌ని లోక్ స‌భ స‌భ్యుడు, ఫుట్ బాల్ దిగ్గ‌జం ప్ర‌సూన్ బెన‌ర్జీ కేంద్ర క్రీడామంత్రి విజ‌య్ గోయెల్ కు విన్న‌వించారు. దీప‌ను భార‌త జిమ్నాస్టిక్స్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించాల‌ని కోరారు. దీనికి క్రీడామంత్రి సానుకూలంగా స్పందించార‌ని ప్ర‌సూన్ తెలిపారు. ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్ దీప కేవ‌లం భార‌త్ కు ప్రాతినిథ్యం మాత్ర‌మే వ‌హించ‌లేదని, జిమ్నాస్టిక్స్ విభాగంలో ఒలింపిక్స్ కు ఎంపికైన తొలి భార‌తీయ మ‌హిళ అని తెలిపారు. దీప‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ప‌రుగులో మొన‌గాడు

నచ్చితే షేర్ చేయ్యండి

జ‌మ‌కా చిరుత ఉసేన్ బోల్ట్ మ‌రో రికార్డ్ సాధించాడు.  కింగ్‌స్టన్‌లో నిర్వహించిన రేసర్స్‌ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్‌ మీటింగ్‌లో జరిగిన 100 మీ. రేసును 9.88 సెకండ్లలోనే పూర్తి చేశాడు. ఈ ఏడాది అత్యంత త‌క్కువ స‌మ‌యంలో 100 మీట‌ర్లు ప‌రుగెత్తిన క్రీడాకారునిగా రికార్డ్ న‌మోదు చేశాడు బోల్ట్‌. గ‌త కొంత‌కాలంగా గాయం వ‌ల్ల‌ విశ్రాంతి తీసుకుంటున్న బోల్ట్ తొలిసారి కింగ్‌స్ట‌న్‌లో నిర్వ‌హించిన రేస‌ర్స్ గ్రాండ్ ప్రి అథ్లెటిక్స్‌లో పాల్గొన్నాడు. ఈ పోటీలో ఒకే దేశానికి చెందిన బోల్ట్‌, పావెల్‌, బ్లేక్‌ ఒకే సారి పోటీపడడం ఇది నాలుగోసారి. బోల్ట్ 9.88 సెకండ్ల‌లో 100 మీట‌ర్లు పూర్తి చేయ‌గా, నికెల్‌ అష్మెద్‌ 9.94 సెకండ్లు,  యోహన్‌ బ్లేక్‌ 9.94 సెకండ్లు,  అసఫా పావెల్‌ 9.98  సెకండ్ల‌లో 100 మీట‌ర్లు పూర్తి చేశారు. ప‌రుగులో త‌న‌క‌న్నా మొన‌గాడు లేడ‌ని మ‌రోసారి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

APలో 2019 నేష‌న‌ల్ గేమ్స్‌..

నచ్చితే షేర్ చేయ్యండి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒలింపిక్ సంఘంకు బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కింది. 2019లో జ‌ర‌గ‌బోయే నేష‌న‌ల్ గేమ్స్‌ను నిర్వ‌హించే చాన్స్ కొట్టేసింది. గ‌తంలో..ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నేష‌న‌ల్ గేమ్స్‌ను కండ‌క్ట్ చేసిన అనుభ‌వం ఉండ‌ట‌మే కాకుండా, బిడ్ వేయ‌డంలోనూ త‌న ప్ర‌త్యేక‌త చాటుకుంది. 50ల‌క్ష‌ల‌కు వేసిన బిడ్‌తో ఈ గేమ్స్‌ను నిర్వ‌హించే అవ‌కాశం ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం. ఢిల్లీలో ప్రారంభ‌మైన ఐవోసీ స‌మావేశంలో ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. నేష‌న‌ల్ గేమ్స్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్వ‌హించ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని శాప్ ఎండీ మోహ‌న్ చెప్పారు. ప్ర‌స్తుతం..బిడ్ త‌మ రాష్ట్రానికి ద‌క్కింద‌ని, క్రీడ‌ల‌ను ఎంక‌రేజ్ చేసే చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఘ‌నంగా జాతీయ క్రీడ‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న అన్నారు. ఈ ఆఫ‌ర్ ద‌క్క‌డం వ‌ల‌న‌..ఏపీలో గ్రౌండ్ల ఏర్పాటుతో పాటు, స్టేడియాలకు పున‌ర్‌వైభ‌వం రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే వీటిపై ఓ బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేస్తామ‌ని ఆయ‌న…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

సుశీల్‌కు యోగేశ్వ‌ర్ ఝ‌ల‌క్

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త మ‌ల్ల‌యోధులు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. అయితే, ఈ సారి ఏ ప‌త‌కంతోనో, మ‌రో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తోనే కాదు. డిసెంబ‌ర్‌లో ప్రారంభం కాబోయే ప్రొ రెజ్లింగ్ లీగ్‌తో న్యూస్‌లో హాట్‌టాపిక్‌గా మారారు. ఇండియ‌న్ రెజ్లింగ్‌కు బ్ర‌ద‌ర్స్‌లా ఉన్న వీరిద్ద‌రూ..ఈ లీగ్ పుణ్య‌మా అని ఇప్పుడు కుస్తీమే స‌వాల్ అంటూ ఒక‌రిని ప‌డగొట్టేందుకు మ‌రోక‌రు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇయ‌ర్ ఎండింగ్‌లో..ఫ్యాన్స్‌కు ఆర్గ‌నైజ‌ర్స్‌కు అదిరిపోయే ప‌ట్టుతో ప‌వ‌ర్ చూపించాల‌ని చూస్తున్నారు. ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో ఒలింపిక్స్ మెడ‌ల్ డ‌బులిస్ట్ సుశీల్ కుమార్‌ను ఉత్త‌ర్ ప్ర‌దేశ్ జ‌ట్టు 38.20ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది. స్టార్ ప్లేయ‌ర్‌కు ఈ ధ‌ర ద‌క్క‌డం ఎవ‌రిని పెద్ద‌గా ఆశ్చ‌ర్యానికి గురిచేయ‌లేదు. అయితే, కాసేప‌టికే సీన్‌లోకి వ‌చ్చిన యోగేశ్వ‌ర్ ద‌త్ సుశీల్‌ను మించిపోయాడు. అత‌ని కంటే కాస్త ఎక్కువ ధ‌ర‌కే అత‌న్ని హ‌ర్యానా జ‌ట్టు ద‌క్కించుకుంది. వేలం పాట‌లో యోగేశ్వ‌ర్ ద‌త్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

లైంగిక వేధింపుల కేసులో కోచ్ అరెస్ట్

నచ్చితే షేర్ చేయ్యండి

సాయ్ …స్పోర్ట్స్ అథారాటీ ఆఫ్ ఇండియా ..అథ్లెట్లు శిక్ష‌ణ పొందే కేంద్రంలో మ‌హిళా అథ్లెట్ల‌పై వ‌రుస‌గా లైంగిక దాడుల ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. గ‌తంలో కేర‌ళ‌లోని సాయ్ హాస్ట‌ల్ లో లైంగిక వేధింపులు భ‌రించ‌లేదక మ‌హిళా అథ్లెట్లు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఇటువంటి సంఘ‌ట‌న‌లు వ‌రుస‌గా జ‌రుగుతున్నా…వెలుగు చూస్తున్న‌వి మాత్రం కొన్నే…తాజాగా క‌ట‌క్ లోని సాయ్ లో శిక్ష‌ణ పొందుతున్న మైన‌ర్ అథ్లెట్ పై అక్క‌డి కోచ్ లైంగిక దాడుల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు ఆ యువ‌తి ఆరోపించింది. క‌ట‌క్ లోని మ‌హిళా పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. మైనర్ అథ్లెట్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ సుశాంత్ రాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ‌త కొన్ని రోజులుగా కోచ్ సుశాంత్…త‌న‌ను మాన‌సికంగా, లైంగికంగా వేధిస్తున్నాడ‌ని మైన‌ర్ అథ్లెట్ పోలీసుల ఎదుట క‌న్నీటి ప‌ర్యంత‌మైంది.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

12ఏళ్ల త‌ర్వాత క్వార్ట‌ర్స్‌లో భార‌త్‌

నచ్చితే షేర్ చేయ్యండి

12ఏళ్ల త‌ర్వాత క్వార్ట‌ర్స్‌లో భార‌త్‌ బాస్కెట్‌బాల్‌లో భార‌త్ స‌రికొత్త హిస్ట‌రీని క్రియేట్ చేసింది. 28వ FIBA ఏషియా చాంపియ‌న్‌షిప్‌లో 12ఏళ్ల త‌ర్వాత ఫైన‌ల్లోకి చేరి చ‌రిత్ర‌ను సృష్టించింది. ఫిలిఫిన్స్ చేతిలో భార‌త్ ఓడినా..అంత‌కుముందు మ్యాచ్‌ల్లో మ‌నోళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌తో క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లోకి ఎంట్రీ ల‌భించింది. ఫిలిఫిన్స్ చేతిలో భార‌త్ 65-69 తేడాతో ఓడిపోయారు. సండే రోజు..పాలెస్టిన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ భారీ తేడాతో విజ‌యం సాధించింది. అందులో పాయింట్ల తేడా, మ‌న‌కు 12ఏళ్ల త‌ర్వాత 28వ FIBA ఏషియా చాంపియ‌న్‌షిప్‌లో క్వార్ట‌ర్స్ చేరేలా చేసింది. నిజానికి..బాస్కెట్‌బాల్‌లో మ‌న జ‌ట్టు ఈ స్థాయి ప్ర‌ద‌ర్శ‌న ఎవ‌రూ ఉహించ‌నిదే. అయితే, కుర్రాళ్ల ఆట‌తీరులో మార్పు రావ‌డం, ఎటాకింగ్ ప్లేతో ప్ర‌త్య‌ర్థిని కంగారు పెట్ట‌డం అల‌వాటుగా చేసుకున్నారు. ముఖ్యంగా..అమ్‌జ్యోత్ సింగ్‌, అమృత్‌పాల్ సింగ్ టీమ్‌కు కీ ప్లేయ‌ర్స్‌గా మారి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారు.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఫుట్ బాల్ ఆడుకున్నాడు

నచ్చితే షేర్ చేయ్యండి

నిజ‌మే…అది ఫుట్ బాల్ మ్యాచే.. కానీ ఆట అంతా ఒక్క‌డిదే అయిపోయింది. నిండు చందురుడు ఒక‌వైపు…చుక్క‌లు ఒక‌వైపు అని తెలుగులో ఒక పాట ఉన్న‌ట్టుగా….అత‌డు ఒక వైపు…ప్ర‌త్యర్థి మ‌రోవైపు అన్న‌ట్టుగా ఆట సాగింది. జ‌ర్మ‌నీ ఫుట్ బాల్ లీగ్ లో ఒకే ఒక్క‌డు వ‌రుస‌గా ఐదు గోల్స్ చేసి సంచ‌ల‌నం న‌మోదు చేశాడు. ఇత‌డు ఏ మెస్సీనో, రొనాల్డోనో కాదు…ఒక అనామ‌క ఆట‌గాడు… జర్మనీ ఫుట్ బాల్ లీగ్ లో ఓ అనామక ఫుట్ బాల్ ఆటగాడు ఏకంగా ఐదు గోల్స్ చేసి తన జట్టుకు చారిత్మాత్మక గెలుపును అందించాడు. రెండు రోజుల క్రితం బేయోరన్ మునిచ్-వాల్ఫ్ బర్గ్ ల మధ్య మ్యాచ్ జరిగింది. ఐతే ఫ‌స్ట్ హాఫ్ ముగిసే స‌రికి బేయోరన్ మునిచ్ జట్టు 1-0 తేడాతో వెనుకబడింది. ఆ సమయంలో మునిచ్ జట్టు తరపున…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

మేరీకోమ్ కంటతడి..సింధు ఓదార్పు

నచ్చితే షేర్ చేయ్యండి

ఐదుసార్లు బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచిన మేరీకోమ్ మరోసారి కంటతడి పెట్టింది. ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మేరీకోమ్ తో పాటు బ్యాడ్మింటన్ తెలుగు తేజం పీవీ సింధు కూడా పాల్గొంది. ఈ కార్యక్రమంలో బాక్సింగ్  ప్రస్తావన రాగానే…మేరీకోమ్ తనపై బాక్సింగ్ పెద్దలు వివక్ష చూపిస్తున్నారంటూ కంటతడి పెట్టింది. తనన ఆర్థికంగా ఆదుకునే వారు కూడా లేరంటూ విలపించింది. ఇంతలోనే పక్కనే కూర్చుని ఉన్న పీవీ సింధు…మేరీకోమ్ ను ఓదార్చింది. రీసెంట్ గా మణిపూర్ లో ఉన్న మేరీకోమ్ అకాడమీ పేరు మార్చేసింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా….అంతకు ముందు మేరీకోమ్ బాక్సింగ్ అకాడమీ గా ఉన్న పేరును…మేరీకోమ్-సాయ్ బాక్సింగ్ అకాడమీ గా మార్పు చేసింది.  మేరీకోమ్ కు సరైన ఆర్థిక సాయం అందించడంలో సాయ్ వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మేరీకోమ్‌,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ర‌న్ రాణీ రన్….

నచ్చితే షేర్ చేయ్యండి

ఆమె మొన్న‌టి వ‌ర‌కు వివాదాలతో స‌త‌మ‌త‌మైంది. కాంట్ర‌వ‌ర్సీలు వెంటాడుతున్నా ప‌రుగు ఆప‌లేదు. ఆట కోసం ప‌రుగు…తాను అమ్మాయినేన‌ని నిరూపించుకునేందుకు ప‌రుగు……ప్ర‌తీ ప‌రుగులోనూ విజ‌యం సాధిస్తోంది. తాజాగా మ‌రో ప‌రుగు పందెంలోనూ స్వ‌ర్ణ ప‌త‌కం సాధించి…గోల్డెన్ లేడీ అనిపించుకుంటోంది. భార‌త స్టార్ అథ్లెట్ ద్యూతీ చంద్ అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చింది. పురుష హార్మోన్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న నెపంతో త‌న‌పై విధించిన నిషేధాన్ని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేష‌న్‌లో స‌వాల్ చేసి విజ‌యం సాధించిన ఒరిస్సా అథ్లెట్ ద్యూతీ.. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్‌లో బంగారు ప‌త‌కం కైవ‌సం చేసుకుంది. కోల్‌క‌తాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌) కాంప్లెక్స్‌లో గురువారం జ‌రిగిన మ‌హిళ‌ల 100 మీ ప‌రుగులో ద్యూతీ చంద్ (రైల్వేస్‌).. 11.68 సెక‌న్ల టైమింగ్ న‌మోదు చేసింది. దీంతో ఈ టోర్నీలో ఆమె ఫాస్టెస్ట్ ర‌న్న‌ర్‌గా నిలిచింది.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More