థ్యాంక్యూ టీవీ9..యూ ఆర్ స్పెష‌ల్‌ 

థ్యాంక్యూ టీవీ9..యూ ఆర్ స్పెష‌ల్‌ 
నచ్చితే షేర్ చేయ్యండి

టీవీ9….చ‌దువుకునే రోజుల్లో ఎలాగైనా అక్క‌డ ప‌నిచేయాల‌నే క‌సితో మొద‌లైన ప్ర‌యాణం. అప్ప‌టి నుంచే ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడితే 2012లో కానీ క‌ల నిజం కాలేదు. అప్ప‌టి నుంచి జులై 14, 2017వ‌ర‌కు నా ప్ర‌యాణం ఎన్నో అద్భుత క్ష‌ణాల‌కు చేర‌వ‌చేస్తూ కొన‌సాగింది. లైఫ్‌లో ఎన్నో మ‌ధుర‌స్మృతులు ఇక్క‌డే నాకున్నాయి. అందుకే, టీవీ9లాంటి సంస్థ‌ను ఏ ద‌శ‌లోనూ విడిచిపెట్టొద్ద‌ని కోరుకునే వాడిని. అంతేకాదు…నాకంటూ ఈ సంస్థ‌లో ఓ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నాను.   ఈ సంస్థ‌లో రావ‌డానికి నాకు స‌హ‌క‌రించిన నా ప్రాణ‌మిత్రుడు కార్తీక్ ప‌వ‌న్ గాదెకు ముందుకు నా థ్యాంక్స్‌. ఆ టైమ్‌లో న‌న్ను ఇంట‌ర్యూ చేసిన దినేష్ ఆకుల గారు, చంద్ర‌మౌళి గారు, కృష్ణారావు గారికి కూడా ఎప్ప‌టికీ విధేయ‌త‌తో ఉన్నాను. ఉంటా కూడా. డెస్క్‌లో స్పోర్ట్స్‌లో ఎన్నో ప్ర‌యోగాలు చేయ‌డానికి దినేష్ ఆకుల…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

నా కూత‌కో లెక్కుంది…కామెంట్రీపై క్లారిటీ ఉంది

నా కూత‌కో లెక్కుంది…కామెంట్రీపై క్లారిటీ ఉంది
నచ్చితే షేర్ చేయ్యండి

నా ఆటైనా..మాటైనా సూటిగా ఉంటుంది రిక‌మండేష‌న్ల‌కు నేను చాలా దూరం నా ద‌గ్గ‌ర టాలెంట్ ఉంది కాబ‌ట్టే సెలెక్ట‌య్యా నేను, నా భ‌ర్త క్రీడాకారులం కాబ‌ట్టి మంచి అండ‌ర్‌స్టాడింగ్ ఉంది మా ఇద్ద‌రికి మా అమ్మాయే ఆద‌ర్శం ఎక్స్‌ప‌ర్ట్‌తో పాటు కామెంట్రీ పెద్ద చాలెంజ్‌ స్పోర్ట్స్ ఎన‌లిస్ట్ సి.వెంక‌టేష్ స‌హ‌కారం మ‌రువ‌లేనిది 1. ఎంబీఏ చేసిన అమ్మాయి…క‌బ‌డ్డీ కామెంట్రీతో చెడుగుడు ఆడేస్తుంది…? రాధిక శ్రీనివాస్ రెడ్డి : ఆటైనా..మాటైనా సూటిగా సుత్తిలేకుండా ఉండాల‌నేది నా ఆలోచ‌న‌. క‌బ‌డ్డీ అంటే ఇష్టం కాబ‌ట్టే..ఆ ఆట గురించి అంత‌లా చెప్ప‌గ‌ల్గుతున్నా. మ‌న దేశంలో పుట్టిన క‌బ‌డ్డీ ఇప్పుడు రూపు మార్చుకుంది. ఒలింపిక్స్‌కు క‌బ‌డ్డీ వెళ్తే మ‌రింత ఆనందం. అందులో నా భాగ‌స్వామ్యం ఉంటే మ‌రింత గౌర‌వంగా భావిస్తున్నా. ఇక విద్యార్హ‌త విష‌యానికొస్తే ఏంబీఏ చేయ‌డ‌మే కాదు, హెచ్ఆర్‌గా 15యేళ్ల అనుభ‌వం ఉంది….

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

క‌బ‌డ్డీ కామెంటేట‌ర్ మాధ‌వి బండారి ఇంట‌ర్వ్యూ

క‌బ‌డ్డీ కామెంటేట‌ర్ మాధ‌వి బండారి ఇంట‌ర్వ్యూ
నచ్చితే షేర్ చేయ్యండి

క‌బ‌డ్డీ తొలి తెలుగు కామెంటేట‌ర్ కావ‌డం అదృష్టం ఇండియ‌న్ స్పోర్ట్స్‌లో ప్రో క‌బ‌డ్డీ ఓ సంచ‌ల‌నం ఒలింపిక్స్‌లో క‌బ‌డ్డీ చూడాల‌నేదే కోరిక‌ కోచ్‌గా అవ‌కాశ‌మిస్తే స‌త్తా చాటుతా పిల్ల‌ల‌పై ఇష్టాలు రుద్ద‌లేదు..వాళ్ల లైఫ్ వాళ్లిష్టం 1. క‌బ‌డ్డీ కూత‌కు….మీ మాట‌లు..చ‌ప్ప‌ట్ల మోత మోగిస్తున్నాయి. ఎలా ఉంది అనుభ‌వం..? మాధ‌వి : చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ఆట‌ను మాట‌ల్లో చెప్ప‌డం ఓ స‌రికొత్త అనుభూతి. 2. తొలి తెలుగు మ‌హిళా కామెంటేట‌ర్ మీరు. నాల్గు సీజ‌న్లుగా ఎలాంటి స్పంద‌న ల‌భిస్తోంది…? మాధ‌వి : ఆద‌ర‌ణ అద్భుతం. ఎక్క‌డికి వెళ్లినా జ‌నాలు గుర్తిస్తున్నారు. ఓ సారి బ‌స్‌లో వెళ్తున్న టైమ్‌లో నా గొంతు విని, ఒక‌యాన సీటు ఇచ్చారు. అప్పుడే నాకు తెలిసింది…మా మాట‌ల‌న్ని జ‌నాలు ఎంత‌లా ఫాలో అవుతున్నారోన‌ని. 3. క‌బ‌డ్డీ ఇలా మెరిసిపోతుంద‌నుకున్నారా..? మీరు ఇలాంటి రోల్ ప్లే…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

రాహుల్.. మీ బ‌రువు మీరే మోసుకోండి !

రాహుల్.. మీ బ‌రువు మీరే మోసుకోండి !
నచ్చితే షేర్ చేయ్యండి

వెయిట్ లిఫ్టింగ్‌….క్రీడాభారతంలో అప్పుడ‌ప్పుడు వినిపించే పేరు. ప్ర‌భుత్వాల‌కు ఎప్ప‌టికీ క‌నిపించ‌ని అథ్లెట్స్‌. బ‌రువులు ఎత్తే భుజాల‌పై క‌నిపించే బాద్య‌త‌కు, బ‌రువైన హృద‌యాల‌లోని భావోద్వేగాల‌కు స‌మాధానం దొర‌క‌దు. మీడియా ప‌రిధి పెరిగిన‌ప్పుడు ప‌బ్లిసిటీ మాత్ర‌మే వ‌స్తుంది….స‌మ‌స్య‌కు ప‌రిష్కారం మాత్రం దొర‌క‌దు. ఎందుకంటే, అటువైపుగా మీడియా రాత‌లు, కెమెరా క‌న్నులు ప్ర‌య‌త్నించ‌వు. వేడిగా ఉన్న‌ప్పుడే వ‌డ్డించాలి..చ‌ల్లారిన‌ప్పుడు ప‌లాయ‌నం చిత్త‌గించాల‌ని చూసే ఫోర్త్ ఎస్టేట్ చేసే హ‌డావుడి సంద‌ట్లే స‌డేమియాలాంటిదే. రాగాల సోద‌రులకేది ప్రొత్సాహం…? రాగాల రాహుల్‌, వ‌రుణ్‌..కామ‌న్వెల్త్ చాంపియ‌న్‌షిప్‌లో సాధించిన ఘ‌న‌త‌లు, నెల‌కొల్పిన‌ రికార్డ్‌లు…..దేశ కీర్తిని మాత్ర‌మే కాదు…తెలుగోడి స‌త్తా ఏంటో అంద‌రికి తెలియ‌జేశాయి. ఇవి మాత్ర‌మే అంద‌రికి క‌నిపించాయి.. క‌నిపిస్తున్నాయి కూడా. బిడ్డ‌ల భ‌విష్య‌త్ కోసం పూరిల్లుకు మారిన తండ్రి ఆవేద‌న‌….వారి కోసం ఆలోచ‌న సాగ‌రంలో మునిగి క్యాన్స‌ర్‌తో క‌న్నుమూసిన ఓ త‌ల్లి వేద‌న‌….తెలిసింది ఎంత‌మందికి. ప్రాతినిథ్యం వ‌హిస్తున్న…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

బుడ్డోళ్ల క‌బ‌డ్డీ కూత‌…కిర్రాక్ పుట్టిస్తోంది భ‌య్యో

బుడ్డోళ్ల క‌బ‌డ్డీ కూత‌…కిర్రాక్ పుట్టిస్తోంది భ‌య్యో
నచ్చితే షేర్ చేయ్యండి

దుమ్ముదులిపే క‌బ‌డ్డీ ఆట‌..ద‌మ్మున్న ప్ర‌తోడి గుండె చెడుగుడు, చెడుగుడు అంటూ కొట్టుకుంటూనే ఉంటుంది. మ‌ట్టిలోని ఆట కాస్త మ్యాట్‌పైకి వ‌చ్చేస‌రికి, క‌ళ్లు క‌ల‌ర్‌ఫుల్‌గా మార‌డ‌మే కాదు, కాస్త టైమ్ చేసుకోని మ‌రీ ఆ ఆట‌పై త‌మ ఇష్టాన్ని, ఓ ర‌కంగా పిచ్చిని ప్ర‌ద‌ర్శించేలా చేశాయి. అలాంటి క‌బ‌డ్డీ కూత కార్పొరేట్ హంగుల‌తో మ‌రింత‌గా ముస్తాబై అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. ఇప్పుడు ఆ కూతే, ఇంకాస్త గ‌ట్టిగా రెడీ అయి…మూడు నెల‌లు మ‌జా అందించేందుకు సిద్ధ‌మైంది. ఇలాంటి టైమ్‌లో మండే రోజు జ‌రిగిన ఫైట్ అంత‌టా హాట్‌టాపిక్‌గా మారింది. బుడ‌త‌ల కోసం చెడుగుడు వివో ప్రొ క‌బ‌డ్డీ లీగ్ ఐదో సీజ‌న్‌లో చిన్నారుల కోసం కేబీడీ జూనియ‌ర్స్ పేరుతో ముందుకొచ్చింది నిర్వ‌హ‌క బృందం. లాస్ట్ సీజ‌న్‌లో మ‌హిళ‌ల క‌బ‌డ్డీతో అంద‌రిలో అటెన్ష‌న్ క్రియేట్ చేసిన స్టార్ గ్రూప్‌, ఈసారి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

మ‌ర‌ణ శ‌య్య‌పై తెలుగు స్పోర్ట్స్ జ‌ర్న‌లిజం …స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్స్‌ డే స్పెష‌ల్‌

మ‌ర‌ణ శ‌య్య‌పై తెలుగు స్పోర్ట్స్ జ‌ర్న‌లిజం …స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్స్‌ డే స్పెష‌ల్‌
నచ్చితే షేర్ చేయ్యండి

తెలుగురాష్ట్రాల్లో జ‌ర్న‌లిజం ఓ వ్యాపారం. మీడియా హౌజ్ అంటే రేటింగ్స్ హ‌డావుడి, సందేహాల పేరుతో సంత‌లో కూర‌గాయాల్లా వార్త‌లు అమ్ముకునే సంస్థ అనే అభిప్రాయం జ‌నాల్లో బ‌లంగా నాటుకుపోయింది. ఇలాంటి రంగంలో….స్పోర్ట్స్ జ‌ర్న‌లిజం ఆట‌లో అర‌టిపండుగా మారిపోయింది. ఏదో ఇంపార్టెంట్ క్రికెట్ మ్యాచ్ ఉంటే త‌ప్ప‌, అటు వైపు పెద్ద‌గా శ్ర‌ద్ధ పెట్ట‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. అస‌లు ఒక మాట‌లో చెప్పాలంటే, మ‌ర‌ణ శయ్య‌పై ఉన్న పేషెంట్‌ను కాసేపు ఆక్సిజ‌న్ పెట్టి బ‌తికించిన‌ట్టు, అవ‌స‌రం ఉన్న‌ప్పుడు స్పోర్ట్స్ డెస్క్‌ను వాడుకుంటున్నారు. తెలుగు చానెళ్ల‌కు స్పోర్ట్స్ అంట‌రానిదే…! నిన్న‌టి వ‌ర‌కు ఏబీఎన్‌, సీవీఆర్‌, హెచ్ఎంటీవీ, టీవీ9 లాంటి చానెళ్ల‌లోనైనా స్పోర్ట్స్ బులెటిన్‌లు ఉండేవి. ఆ రోజు హాట్‌టాపిక్స్‌, హైలైట్స్ అభిమానుల‌కు చేరువ చేసేవి. అయితే, ఇప్పుడు ఆ లిస్ట్‌లోంచి టీవీ9 బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రొగ్రామ్స్‌లో మార్పుల కార‌ణంగా, స్పోర్ట్స్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

గ‌ట్టిగా చెప్పాడు…బుద్దిగా ఇంటికెళ్లాడు

గ‌ట్టిగా చెప్పాడు…బుద్దిగా ఇంటికెళ్లాడు
నచ్చితే షేర్ చేయ్యండి

స్కూల్లో కాస్త గ‌ట్టిగా చెప్పే మాస్ట‌రంటే ఎవ‌రికీ ఇష్ట‌ముండ‌దు. బెత్తంతో చెప్తే అత‌ను చెడ్డొడ‌ని, పాఠాలు చెప్ప‌కుండా సోది చెప్తే చాలా మంచోడ‌ని పొంగిపోతాం. ఆ వ‌య‌సులో మ‌న‌కి అర్థ‌మ‌య్యేది అంతే. వాస్త‌వం గ్ర‌హించేస‌రికి మ‌న మాస్ట‌ర్ విలువెంటో తెలుస్తుంది. క‌థ కాస్త బోరింగ్‌గా ఉన్నా… రియాల్టీ ఇదే. ఇండియ‌న్ క్రికెట్‌లో జ‌ర‌గ‌బోయేది కూడా ఇదే. ఈయ‌న పాఠాలు మా వ‌య‌సుకు త‌గ్గ‌ట్టుగా లేవు సార్‌, తీసేయండని కెప్టెన్ చెప్ప‌డ‌మే ఆల‌స్యం….కొత్త కో్‌చ్ కావాల‌ని ఉద్యోగ ప్ర‌క‌ట‌న వేసింది బీసీసీఐ. ఈ తీరు ఆ మాస్ట‌ర్‌ను స్వ‌చ్ఛంద విర‌మ‌ణ చేసేలా చేసింది. కోహ్లీతో విభేదాలే కార‌ణం…! అనిల్ కుంబ్లే కాంట్రాక్ట్ నేటితో ముగిసిపోతుంది. అయితే, బోర్డ్ మాత్రం వెస్టిండీస్ టూర్ వ‌ర‌కు కొన‌సాగాల‌ని కోరింది. స‌ల‌హా క‌మిటీ గంగూలీ, ల‌క్ష్మ‌ణ్‌, స‌చిన్‌లు కూడా కుంబ్లేతో మాట్లాడారు. కానీ,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

దేవుడి ముందే ధోనీకి ప‌ట్టాభిషేకం

దేవుడి ముందే ధోనీకి ప‌ట్టాభిషేకం
నచ్చితే షేర్ చేయ్యండి

స‌మ‌యం సాయంత్రం 6 00గంట‌లు.. ఐపీఎల్ ఫైన‌ల్ ప్రారంభానికి స‌రిగ్గా 2గంట‌ల ముందు.. గేట్ నెంబ‌ర్ 5 ద‌గ్గ‌ర ఆఫీసు వెహికిల్ దిగుతున్న టైమ్‌లో… అన్ని చానెళ్ల కెమెరాలు అభిమానుల కోలాహ‌లాన్ని బంధిస్తున్నాయి. తొలిసారి ఫైన‌ల్‌కు అతిధ్య‌మిస్తున్న రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ స్టేడియంలో ఎటుచూసిన ఫ్యాన్స్ సంద‌డే. టైటిల్ విన్న‌ర్‌ను డిసైడ్ చేయ‌బోయే మ్యాచ్‌ను వీక్షిస్తున్నామ‌నే ఆనందంతో పాటు హేమాహేమీ క్రికెట‌ర్ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూడొచ్చ‌నే ఆనందం వాళ్ల‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అభిమాన‌లోకం..ఇలాంటి అనుభ‌వాల‌తో మైదానానికి వ‌చ్చే స‌న్నివేశాలు నాకే కాదు, కెమోరా కంటికి చాలా సంతృప్తినిస్తాయి. నిజానికి పుణె, ముంబై లాంటి జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ అంటే ఫేవ‌రెట్ రోహిత్‌సేనే. స‌చిన్ టెండూల్క‌ర్ మెంటార్‌గా ఉన్న ఆ జ‌ట్టుకు..హైద‌రాబాద్‌లో అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ్తార‌న‌డంలో సందేహాం లేదు. కానీ, ఈసారి ఎందుకో సీన్ రివ‌ర్సైంది. ఏ గేటు ద‌గ్గ‌ర…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆడితో జాగ్ర‌త్త‌రా స్మిత్తూ…ఆటాడేసుకుంటాడు

ఆడితో జాగ్ర‌త్త‌రా స్మిత్తూ…ఆటాడేసుకుంటాడు
నచ్చితే షేర్ చేయ్యండి

కొంద‌రికి తిక్క‌రేగ‌లేమో…నాకు ఎప్పుడూ ఆన్‌లోనే ఉంట‌ది…డైలాగ్‌లో మీనింగ్ వెతికేలోపే, చెప్పిన ఫోర్స్‌తోనే ఆ ప‌వ‌రెంటో అర్థ‌మైపోతుంది. అంత‌లా మాస్‌ను క‌ట్టిప‌డేస్తుంది..క్లాస్‌ను క‌వ్విస్తుంది. ఇప్పుడు ఇలాంటి పంచే..టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌కిచ్చాడు. మాములుగా కాదు..మైండ్ దొబ్బి అలా మాట్లాడాను అని చెప్పినా స‌రే, సోది చెప్ప‌కు, నీ స్టోరీ అంతా తేలుస్తా అని చెప్పాడంటే, మ‌నోడికి ఎంత‌లా కాలిందో తెలిసిపోతుంది. యూడీఆరెస్ అంటేనే, గ్రౌండ్‌లోనే ఉన్న అంపైర్ నిర్ణ‌యాన్ని థర్డ్ అంపైర్‌తో స‌వాల్ చేయ‌డం. అలాంటి సిస్ట‌మ్‌ను, డ్రెస్సింగ్ రూమ్ ప‌ద్ద‌తిగా మార్చేసింది ఆస్ట్రేలియా. ఆన్ ద ఫీల్డ్‌లో ఔటైతే…డ్రెస్సింగ్ రూమ్‌లో ఔటో కాదో అని అడిగి, అంపైర్‌ను రివ్యూకోరుతున్నారంటే, ఆసీస్ ఎంత‌లా దిగ‌జారిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ తీరునే ప్ర‌శ్నించాడు కోహ్లీ. మూడు రోజుల నుంచి గ‌మ‌నించి మ‌రీ, కంగారూల న‌క్క‌తెలివితేట‌ల‌ను బ‌య‌ట‌పెట్టాడు. కోహ్లీ..ఆన్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

టీమిండియా ఓడిపోయినా నో ప్రాబ్ల‌మ్ కానీ…

టీమిండియా ఓడిపోయినా నో ప్రాబ్ల‌మ్ కానీ…
నచ్చితే షేర్ చేయ్యండి

ఔను, మ‌న జ‌ట్టు ఎప్పుడూ గెల‌వాల‌ని నేను కోరుకోను. ఆ మాట‌కొస్తే ఓడిపోవాల‌ని ఆశించ‌ను. కానీ, ఈ రెండింటిని తెలియ‌జేసే ఫైటింగ్ స్పిరిట్ అనేది ఒక‌టి ఉంటుంది క‌దా, రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా భ‌లే ఫైట్ చేశారురా అనుకునే మాట అది మాత్రం అంద‌రి నోట విన‌బ‌డాలి. అంతేకాదు.. ఎంత‌సేపు ప‌క్కొడిని తిప్ప‌డం కాదు..మ‌న‌మూ కూడా తిరుగుతున్నాం, వాళ్లు తిప్పేస్తున్నారు అనే ఆలోచ‌న‌లోకి రావాలి. ఇంట్లో కాల‌ర్ ఎగ‌రేయ‌డ‌మే కాదు లుంగీ లేకుండా కూడా డ్యాన్స్ చేస్తాం..అదే రోడ్డు మీద గుడ్డ ముక్క ప‌క్క‌కు జ‌రిగినా అవ‌మానంగా ఫీల‌వుతావు. ఇప్పుడు కావాల్సింది అదే..గుడ్డ ముక్క కూడా ప‌క్క‌కు జ‌ర‌గ‌కుండా కాల‌ర్ ఎగ‌రేయ‌డం. తొలి టెస్ట్‌లో ఓడిన‌ప్పుడు అంద‌రూ పిచ్‌ను తిట్టారు. క్యూరేట‌ర్‌పైన కారాలు, మిరియాలు నూరారు. ఆ మ్యాచ్‌లో ఓకీఫ్‌ వికెట్లు తీస్తే బై ల‌క్ అన్నారు….

నచ్చితే షేర్ చేయ్యండి
Read More