అమెరికాకు క్రికెట్ పిచ్చి అంటించేద్దామా?

నచ్చితే షేర్ చేయ్యండి

క్రికెట్ ఒక పిచ్చి…వేలం వెర్రి. కారల్ మార్క్స్ మతం ఒక మత్తు మందు అన్నాడు కానీ క్రికెట్‌ను మించిన మత్తు మరొకటి లేదు. డ్రింకు, పొగాకు దీని ముందు దిగదుడుపే. ఇండియా మ్యాచ్ ఉందంటే పరీక్షలున్నా, ఆఫీసున్నా చూసితీరాల్సిందే. తప్పనిసరిగా బయటికెళ్ళాల్సి వచ్చినా పది నిముషాలకోసారి స్కోరు తెలుసుకోవాల్సిందే. మరి ఈ ఆట మత్తులో పట్టుమని పది దేశాలే పడ్డాయెందుకని? బ్రిటిష్ వారు తమ వలస రాజ్యాలని తెగ దోచేసుకుని ఇంగ్లీషు, క్రికెట్టు మనకు కానుకగా ఇచ్చివెళ్ళారు నిజమే కానీ బ్రిటిష్ వలసలు ఇంకా చాలా ఉన్నాయి కదా. వాటికి ఈ  ఆట అబ్బలేదెందుకని? పొరుగున ఉన్న చైనాకు గానీ, అగ్ర రాజ్యం అమెరికాకు గానీ ఈ పిచ్చి అంటుకోలేదే? ప్రపంచం మొత్తంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ఆట ఫుట్‌బాల్. పాప్యులారిటీలో రెండో స్థానం క్రికెట్‌దే. గమ్మత్తేమిటంటే…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఏ కులము నీదంటే…

నచ్చితే షేర్ చేయ్యండి

ఒలింపిక్ పతక విజేత పి.వి.సింధు కులం ఏంటని బోలెడంతమంది ఇంటర్నెట్‌లో వెతికేశారంటూ వార్తలొచ్చాయి. దీనిపై ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో ఘాటైన స్పందనలు కూడా వచ్చాయి. ఈ రోజుల్లో కూడా ఇంకా కులం గురించి అంత కుతూహలం ఎందుకని మోడరన్ మేధావులు, అభ్యుదయ వాదులు తెగ బాధపడిపోయారు. అయితే ఇక్కడ కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎదుటివాడి కులం తెలుసుకోవాలన్న కుతూహలం మనందరిలోను ఉంటుందనేది ఓ నగ్న సత్యం. గొప్ప గొప్ప మేధావులు సైతం కొత్తగా పరిచయమైన వాళ్ళ ఇంటిపేరు అడిగి తద్వారా వారి కులం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వారి వారి కులాలను బట్టి వ్యక్తుల ప్రవర్తనను, లక్షణాలను అంచనా వేయడం మనసమాజంలో ప్రతి ఒక్కరికి సంక్రమించిన అంటువ్యాధి. అలాగే ప్రముఖ వ్యక్తుల కులాలు తెలుసుకోవాలన్న కుతూహలం కూడా మనకెప్పుడూ ఉంటూనే ఉంటుంది. నరేంద్ర మోదీ, కేజ్రీవాల్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

గోపి గీసిన బొమ్మ!

నచ్చితే షేర్ చేయ్యండి

మన భారతీయ సంప్రదాయాల్లో ప్రధానమైనది, ప్రత్యేకమైనది గురుశిష్య పరంపర. గురుకులాలు కనుమరుగైనా ఇప్పటికీ అన్ని రంగాల్లో మనకు ఆ సంప్రదాయం కనిపిస్తూనే ఉంటుంది, ముఖ్యంగా క్రీడారంగంలో. కేంద్ర ప్రభుత్వం కూడా ఆటగాళ్ళకు ఇచ్చే అత్యున్నత అవార్డుకు ‘ అర్జున ‘ అని, కోచ్ కిచ్చే అవార్డుకు ‘ద్రోణాచార్య ‘ అని సరైన నామకరణం చేసింది. అలాంటి ఒక ‘అర్జున ‘ గ్రహీత పి.వి.సింధు, ఒక ‘ద్రోణాచార్య ‘ పుల్లెల గోపీచంద్ కలిసి రియో ఒలింపిక్స్‌లో మనం తలెత్తుకునేలాగ చేశారు. ఈ జోడీ తెచ్చిన వెండి పతకంతో రియో వరస వైఫల్యాల వల్ల వాడిపోయి ఉన్న మన ముఖాల్లో మళ్ళీ వెన్నెలలు వెల్లివిరిశాయి. ఫి.టి ఉష లాంటి పరుగుల రాణిని మనకందించిన ఘనత ఆమె కోచ్ నంబియార్‌కు దక్కుతుంది. సింధు విషయంలో గోపీచంద్ పాత్ర కూడా అలాంటిదే. సైనా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

సవాళ్ళపై సంధించిన ‘ఏస్ ‘

నచ్చితే షేర్ చేయ్యండి

ఆర్నబ్ గోస్వామి, రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటి జాతీయ ఛానెల్ యాంకర్లు రాజకీయ నాయకులతో, సెలెబ్రిటీస్ తో ఆడుకుంటుంటారు. తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తారు. కానీ సానియా ఇక్కడ…ఈ మధ్య ఇండియా టుడే ఛానెల్ తరఫున ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడ్డంగా దొరికిపోయాడు. ” సెలెబ్రిటీగా వెలిగిపోతున్నావు, బాగానే వుంది కానీ లైఫులో ఇంకా ఎప్పుడు సెటిలవుతావు సానియా… కాపురం ఎక్కడ దుబాయ్ లోనా…తల్లి కావడం సంగతేంటి” అని కుశల ప్రశ్నలు వేశాడా సీనియర్ పాత్రికేయుడు. అంతే, సానియా అతనిపై సివంగిలాగ విరుచుకుపడింది. ” నేను పిల్లల్ని కనడం వదిలేసి ప్రపంచ టెన్నిస్‌లో  నంబర్ వన్ ర్యాంకు సాధనతో తృప్తి పడటం మీకు నిరాశ కలిగించినట్టుంది. ఎన్ని వింబుల్డన్ టైటిల్స్ గెలిచావన్నది గాని, నంబర్ వన్ ర్యాంకు సాధించావన్నది గాని…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

వన్ టప్ ఔట్!

నచ్చితే షేర్ చేయ్యండి

అపార్టుమెంట్లు పుట్టకముందు నగరాల్లో ఆటస్థలాలనేవి ఉండేవి. కార్లు, స్కూటర్లు తక్కువగా ఉన్న రోజుల్లో గల్లీలల్లో క్రికెట్ ఆడుకునే వీలుండేది. పెద్ద గ్రౌండులో ప్యాడ్లు కట్టుకొని, చేతికి గ్లోవ్స్ తొడుక్కుని ఆడేది అసలైన క్రికెట్ కావచ్చు. కానీ గల్లీ క్రికెట్ మజా వేరే. గవాస్కర్ దగ్గరనుంచి గొప్ప క్రికెటర్లందరూ ఇలా వీధుల్లో ఓనమాలు దిద్దుకున్నవారే. పేరుకు హాకీ మన జాతీయ క్రీడ కావొచ్చు గానీ మనలో చాలా మంది హాకీ స్టిక్ ఒక్కసారి కూడా పట్టుకుని ఉండరు. క్రికెట్ మాత్రం ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆడే ఉంటారు. ఒకప్పుడు ఇంటి ముందువైపునో, వెనక వైపునో కాస్తంత జాగా ఉండేది, ఖాళీ స్థలాలు కూడా దొరికేవి. ఇక వీధి ఉండనే ఉంది. మనమంతా అలాంటి చోట్ల క్రికెట్ ఆడినవాళ్ళమే. ఎవరి శక్తి కొలదీ వారు మట్టితోనో, వెండితోనో, బంగారంతోనో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

గ్రామీణ క్రీడ ఇప్పుడు గ్లామర్ గేం!

నచ్చితే షేర్ చేయ్యండి

విమానం ఢిల్లీ సమీపిస్తుండటంతో రాజు భవ్సార్ చాలా ఉద్వేగంతో ఉన్నాడు. 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన భారత జట్టు ఆటగాళ్ళలో అతనొకడు. ‘ఎయిర్‌పోర్టుకి జనం తండోపతండాలుగా వస్తారు. పూల వర్షం కురిపిస్తూ ఊరేగింపుగా తీసుకెళ్తార ‘ ని అనుకున్నాడతను. భవ్సార్ అలా అనుకోవడంలో తప్పులేదు. పి.టి. ఉష లాంటి వారు కూడా పసిడి వేటలో చతికిలబడ్డ ఆ సంవత్సరం ఆసియా క్రీడల్లో ఇండియాకు దక్కిన ఒకే ఒక స్వర్ణాన్ని కబడ్డీ జట్టే అందించింది. తీరా విమానం ఢిల్లీ చేరాక కబడ్డీకి అంత సీను లేదని భవ్సార్‌కు అర్థమయింది. పూల వర్షం కాదు కదా పట్టించుకునే నాథుడు కూడా కరువయ్యాడు.  సీను కట్ చేస్తే, మొన్నటి జనవరిలో విజయవాడలో జరిగిన జియో అమరావతి రన్ లో రాహుల్ చౌదరి లాంటి కబడ్డీ స్టార్లు పాల్గొన్నారు.కుర్రకారు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ప్లీజ్…దీన్ని ప్రపంచ కప్ అనొద్దు!

నచ్చితే షేర్ చేయ్యండి

వాల్డ్ కప్‌ను తెలుగులో ఎలా రాయాలి? 1983 నుంచి నాలాంటి తెలుగు పాత్రికేయుల్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. (అంతకు ముందు కూడా క్రీడల్లో వాల్డ్ కప్‌లుండేవి, కానీ అప్పట్లో తెలుగు పత్రికలు ‘ఆట ‘ లాడేవి కాదు). వరల్డ్ కప్ అని రాస్తే ‘వరస్టు ‘ గా ఉంటుంది. ప్రపంచ కప్ అని తెలుగు ఇంగ్లీషు పదాలు కలిపి రాస్తే అతుకుల బొంతలాగ ఉంటుంది. దుష్ట సమాసం అని వ్యాకరణ పండితులు అభ్యంతరం లేవనెత్తుతారు. కానీ ప్రపంచ బ్యాంక్ మల్లేనే సౌండింగ్ బాగున్నా లేక పోయినా  ప్రపంచ కప్ అనే పదాన్ని మనం సృష్టించుకోవాల్సి వచ్చింది. ఎవరెలా రాసినా ప్రతి క్రీడలో ప్రపంచ కప్ ఒక్కటే ఉంటుంది. మనకు ఒకటే భూగోళం, ఒకటే ప్రపంచం ఉన్నాయి. నాలుగేళ్ళకొకసారి ఎలా ఒలింపిక్స్ జరుగుతాయో క్రికెట్లో కూడా ప్రపంచ కప్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

రెడ్ చెర్రీ లేదనేదే అసలు వర్రీ 

నచ్చితే షేర్ చేయ్యండి

టెస్ట్ క్రికెట్ ఓ పంచ రంగుల కల.నీలాకాశం, ఆకుపచ్చని మైదానం, మధ్యలో ఊదా రంగు పిచ్, తెల్లని దుస్తుల్లో ఆటగాళ్ళు, బౌలర్ చేతిలో ఎర్రటి బంతి…ఎంత హాయిగా కంటికింపుగా ఉంటుందా దృశ్యం. మిగతావన్నీ లేత రంగులవడంతో ఎర్రటి బంతి మిల మిలా మెరిసిపోతుంటుంది. కామెంటేటర్లు దాన్ని ‘రెడ్ చెర్రీ అని ముద్దుగా పిలుస్తుంటారు. బంతి మధ్యలో తెల్లటి దారంతో ఉండే సీం (కుట్టు) దానికి వింత సొగసులద్దుతుంది. అన్ని రకాల ఆటల్లో వాడే క్రీడా సామాగ్రి మొత్తంలో ఎర్రటి క్రికెట్ బంతిని మించిన అందమైన వస్తువు మరొకటి లేదు.  బౌలర్లు అనబడే శ్రమజీవుల కష్టానికి ప్రతిబింబం కాబట్టి కొన్నిసార్లు అది వారి చేతిలో రక్తపుముద్ద లాగ కూడా అనిపిస్తుంటుంది. సచిన్, సెహ్వాగ్ వంటివారి బారిన పడినప్పుడు నిలువెల్ల గాయాలై కొంత వన్నె కోల్పోతుంది కానీ అయినా దాని…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్…పిచ్

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా ఏ మ్యాచ్ గెలిచినా మనకదో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. మనకు తెలియకుండానే మంచి మూడ్ లోకి వెళ్ళిపోతాము. కానీ ఎందుకనో మొహాలీ టెస్ట్ గెలుపు విషయంలో ఎందుకనో అలాంటి ఫీలింగ్ కలగడం లేదు. బంతి గిరగిరా స్పిన్ తిరిగే డిజైనర్ పిచ్ పైన వండి వార్చుకున్న ఈ విజయంలో మజా మిస్సవుతున్నట్టే ఉంది.   హోం అడ్వాంటేజ్ ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. కానీ మరీ ఇంతగానా? మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలించి ఆ తరువాత టర్న్ అయ్యే పిచ్ అయితే ఫరవాలేదు. కానీ,  మరీ మొహమాటం లేకుండా మొదటి రోజు నుంచి బొంగరం లాగ బంతి సుడులు తిరిగే పిచ్ తయారు చేసుకుని సౌతాఫ్రికాను ఓడించేశామోచ్ అని జబ్బలు చరుచుకోవడం ఎంతవరకు కరెక్టు? మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఇది పిచ్ ఫిక్సింగ్! మొన్నటి ముంబై…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

సారీ స‌చిన్…యూ ఆర్ రాంగ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

చాలా రోజుల తర్వాత క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్!  రెండు బలమైన జట్లు, మూడు టి20లు, నాలుగు టెస్టులు, ఐదు వన్‌డేలు …మూడు ఫార్మాట్స్‌లో కూడా పూర్తి స్థాయిలో పోటా పోటీ. ఒక వైపు డివిలియెర్స్, ఆంలా, స్టెయిన్…మరో వైపు ధోనీ, కోహ్లీ, అశ్విన్. సై అంటే సై. టాప్ క్లాస్ యాక్షన్ థ్రిల్లర్‌కు రంగం సిద్ధం. ఇటీవలి కాలంలో చాలా జట్లు (ఆస్ట్రేలియాతో సహా) సొంతగడ్డపైనే చెలరేగుతున్నాయి. స్వదేశం బయట తేలిపోతున్నాయి. కానీ సౌతాఫ్రికా ఇందుకు మినహాయింపు. ఇంటా బయటా కూడా సత్తా చూపుతున్న ఒకే ఒక జట్టు అది. అయినా కూడా నా దృష్టిలో ఈసారి మాత్రం ఇండియానే ఫేవరైట్‌గా బరిలోకి దిగుతోంది. ఇందుకు ప్రధాన కారణం – మన స్పిన్ బౌలింగ్. ప్రస్తుతం అశ్విన్ సూపర్ ఫాంలో ఉన్నాడు. అతనికి మిశ్రా, అక్షర్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More