గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి…ఇద్ద‌రు కొడుకుల‌ను పిలిచాడు

నచ్చితే షేర్ చేయ్యండి

ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ వ‌రుడిగా మారాడు. చాలా కాలంగా సహ‌జీవ‌నం చేస్తున్న రాట్‌క్లిఫ్‌ను పెళ్లిచేసుకున్నాడు. ఈ వివాహ‌వేడుక‌కు, స‌న్నిహితులు, స్నేహితుల‌తో పాటు, ఈ జంట‌కు జ‌న్మించిన ఇద్ద‌రు పిల్ల‌లు కూడా వ‌చ్చారు. వారం రోజుల క్రితం తాగిన మైకంలో గొడ‌వ‌కు దిగి, ప్ర‌స్తుత క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు ఎదుర్కొంటున్న స్టోక్స్‌, దొరికిన గ్యాప్‌లో ప్రియురాలిని పెళ్లిచేసుకున్నాడు.

గ‌ర్ల్‌ఫ్రెండ్ రాట్‌క్లిఫ్‌తో చాలా కాలంగా స‌హ‌జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు స్టోక్స్‌. అత‌నికి ఇప్ప‌టికే ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. అయితే, పెళ్లిపై వీళ్లిద్ద‌రూ ఇన్నిరోజులు ఆలోచ‌న చేయ‌లేద‌ట‌. అయితే, ఇప్పుడు ఓ అవ‌గాహ‌న‌కు రావ‌డ‌మే కాకుండా, పెళ్లి అనే బంధంతో త‌మ బందాన్ని మ‌రింత దృఢంగా చేసుకోవాల‌ని భావించిన వీరిద్ద‌రూ పెళ్లితో త‌మ బందాన్ని ఒక్క‌టిగా మార్చుకున్నారు.

ఈ పెళ్లికి ఇంగ్లండ్ క్రికెట‌ర్లు రూట్‌, మోర్గాన్‌, బ్రాడ్‌, గ్రాహం అనియ‌న్స్‌, జోస్‌బ‌ట్ల‌ర్‌, అలిస్ట‌ర్ కుక్‌లు హాజ‌ర‌య్యారు. ఐపీఎల్‌లో భారీ ధ‌ర ద‌క్కించుకోని అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసిన ఈ స్టార్ ప్లేయ‌ర్‌, ఇప్పుడు మ‌రోసారి పెళ్లితో హాట్‌టాపిక్‌గా మారాడు. ఇంగ్లండ్‌లో ఇలాంటి పెళ్లిళ్లు మాములే అయినా, మ‌న ఫ్యాన్స్‌కు మాత్రం కాస్త డిఫ‌రెంట్ డిబేట్ టాపిక్‌గా మారింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts