ఎడ‌మ‌చెత్తో తిప్పేస్తే….118ర‌న్స్‌కే ఆలౌట‌య్యారు

నచ్చితే షేర్ చేయ్యండి

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టీట్వంటీ సిరీస్‌లో భార‌త్ 118 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ప్ర‌త్య‌ర్థి ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన‌, ఆరంభంలోనే నాల్గు కీల‌క వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఓపెన‌ర్లు రోహిత్, శిఖ‌ర్ ధావ‌న్‌తో పాటు కోహ్లీ, పాండే సింగిల్ డిజిట్‌కే పెవిలియ‌న్ చేరారు. ఈ నాల్గు వికెట్ల‌ను ఆసీస్ కొత్త బౌల‌ర్ బెహ్ర‌న్‌డార్ప్ ద‌క్కించుకున్నాడు. దీంతో…భార‌త్ 27ప‌రుగుల‌కే 4వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది.

ఈ టైమ్‌లో జ‌త‌క‌లిసిన ధోనీ, జాద‌వ్ కాసేపు టీమ్‌ను ఆదుకున్నారు. వీరిద్ద‌రూ ఆసీస్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించారు. అయితే, జంపా ఎంట్రీతో సీన్ మారింది. వీళ్లిద్ద‌రూ త‌క్కువ స్కోర్ వ్య‌వ‌ధిలోనే పెవిలియ‌న్ చేర్చాడు. పాండ్యా భారీ సిక్స‌ర్‌తో ఆశ‌లు రేపినా కేవ‌లం 23ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్ 16స్కోర్‌తో రాణించారు. దీంతో….భార‌త్ 118ప‌రుగుల‌కు ఆలౌటైంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts