షాహిది ఆఫ్రిది బూమ్ బూమ్ మ్యాజిక్ చేశాడు. 38యేళ్ల వయసులో ఫిట్నెస్ను కాపాడుకోవడమే కాదు, అదిరిపోయే క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. బౌండరీ లైన్ దగ్గర, తనని తాను అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ…ఒంటి చెత్తో క్యాచ్ పట్టుకోని అందరిని ఆశ్చర్యపర్చాడు. ఇప్పుడు ఈ క్యాచ్ అంతటా హాట్‌టాపిక్‌గా మారడమే కాదు, ఫ్యాన్స్‌ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో షాహిది ఆఫ్రిది బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. బ్యాట్స్‌మెన్ కొట్టిన షాట్‌ను, అద్భుతంగా ఆపిన ఆఫ్రిది, సిక్సర్ వెళ్లకుండా ఆపడమే కాదు, బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన విన్యాసాలతో క్యాచ్ అందుకున్నాడు. 38 యేళ్ల వయసులోనూ ఓ రేంజ్లో క్యాచ్ అందుకోని ఆకట్టుకున్నాడు ఆఫ్రిది.
Read MoreAuthor: REGELLA
వామ్మో..ధోనీకి ఇంత కోపం ఎందుకు వచ్చింది..?
రెండో టీట్వంటీలో ధోనీ, మనీష్ పాండే కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో టీమ్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ అజేయంగా ఐదో వికెట్‌కు ఏకంగా 98పరుగులు జోడించారు. అంతేకాదు..అర్థసెంచరీలు కూడా సాధించారు. అయితే, అంత చక్కటి పార్టనర్షిప్తో ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేసిన వీరిద్దరూ మధ్యలో ఒకరిపై ఒకరు అరుచుకున్నారంటే నమ్ముతారా. ఈ విషయంలో కాస్త మనీష్ పాండే కాస్త వెనక్కి తగ్గినా..ధోనీ మాత్రం వీరావేశంతో గట్టిగా అరిచాడంటే నిజమేనని ఒప్పుకుంటారా..? అచ్చంగా ఇలాగే జరిగింది రెండో టీట్వంటీలో. ఓ పరుగు విషయంలో ఇద్దరి మధ్య కాస్త హాట్ సీన్ ఏర్పడింది. ధోనీ ఒక్కసారిగా బిగ్గరగా మనీష్ పాండేపై అరుస్తూ, ఎటు చూస్తున్నావ్, నేను ఇక్కడ పిలుస్తుంటే, నువ్వేంటి అక్కడ చూస్తున్నావ్…ఆటపై శ్రద్ధ పెట్టంటూ మండిపడ్డాడు. ఇప్పుడీ వీడియో అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. ఇంకా నమ్మబుద్ది కాకపోతే క్రింద వీడియో చూడండి.…
Read Moreనన్ను ఫిక్సింగ్ చేయమని బుకీలు వెంటపడ్డారు
మలేసియా స్టార్ షట్లర్ లీ చోంగ్ వి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేయాలని బుకీలు తనను తీవ్రంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా మ్యాచ్‌ల వరకు వారు వెంటాడరని, అయితే, తాను ఎక్కడ తన మనో ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకెళ్లానన్నాడు. అయితే, ప్రస్తుతం తన టీమ్‌లోని ఇద్దరు ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడరనే ఆరోపణలు ఎదుర్కొవడం తీవ్రంగా బాధిస్తుందన్నాడు. వారిద్దరు త్వరలోనే విచారణకు హాజరుకానున్నారు. మలేసియా స్టార్ షట్లర్ లీ చోంగ్ వి…వరల్డ్‌లోనే ది బెస్ట్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అలాంటి ఆటగాడు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు అంతటా హాట్‌టాపిక్‌గా మారాయి. మరోవైపు, అతను గతంలో డోపింగ్‌లో పట్టుబడ్డాడు. ఆ టైమ్‌లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, ఆటలో రీ ఎంట్రీ ఇచ్చాకా…లీ మెరుగైన ఆటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. అలాంటి షట్లర్,…
Read Moreటీమిండియాను దాటేసిన ఆస్ట్రేలియా
సఫారీలపై రెండో వన్డేలో ఓడి, కీలకమైన మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న భారత్‌ను…ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా దాటేసింది. వరుస విజయాలతో ట్రై సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆసీస్, ర్యాంకింగ్స్‌లో రెండోస్థానంలోకి దూసుకెళ్లింది. ఏకంగా ఆసీస్ టీమ్ 15పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 126రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్‌తో సమానంగా నిలిచింది ఆసీస్. అయితే, 0.19 వ్యత్యాసం కారణంగా ఆసీస్ రెండోస్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీట్వంటీల సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో రెండు జట్లు సమానంగా ఉన్నాయి. అయితే, ఈ సిరీస్‌లో ఉన్న మూడు మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా మనోళ్లు ముందుకెళ్లి ఉంటే, ర్యాంకింగ్స్‌లోనూ మనోళ్లు అదే స్థానంలో ఉండేవారు. కానీ, రెండో టీట్వంటీ క్లాసెన్ మెరుపులు, డుమినీ డమరుకం ఆడించడంతో సీన్ రివర్సైంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లిస్ట్ క్రింద ఇవ్వబడినది గమనించగలరు.
Read Moreతలకు బాల్ తగిలి…సిక్సర్‌గా మారింది
బంతి మరోసారి కంగారుపెట్టింది. ఏకంగా బౌలర్ తలను బలంగా తాకి, సిక్సర్ వెళ్లింది. ఇది కాస్త ఆశ్చర్యం కల్గించినా…బౌలర్‌కు ఎలాంటి గాయం కాకపోవడంతో అందరూ రిలీఫ్ అయ్యేలా చేసింది. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్‌కు గురిచేస్తూనే, ఔరా ఎంత లక్కీఫెల్లో బౌలర్ అనుకునేలా చేసింది. కివీస్ డొమెస్టిక్ క్రికెట్లో ఆక్లాండ్ బ్యాట్స్‌మెన్ జీత్ రావల్ బలంగా కొట్టిన షాట్, బౌలర్ ఆండ్రూ ఎలిస్ తల ముందు భాగంలో తగిలింది. అంతేకాదు, అతని తలను తాకి, ఆ బంతి నేరుగా బౌండరీలైన్ దాటింది. అయితే, బాల్ తాకిన బౌలర్ పరిస్థితిని తలుచుకోని ఒక్కసారిగా అందరూ ఊలిక్కిపడ్డారు. అసలేం జరిగిందో అర్థం చేసుకోని తెరుకునేలోపే బౌలర్ రిలాక్స్ కనిపించడంతో షాకయ్యారు. బంతి బలంగా తాకినా…బౌలర్‌కి అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. తలను చేత్త రుద్దుకుంటూ, కాసేపు…
Read Moreదుమ్మురేపిన ధోనీ…సెంచూరీయన్‌లో చెడుగుడు
ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కీలకమైన మ్యాచ్‌లో, కీలకమైన టైమ్‌లో తిరుగులేని ఆటతీరుతో అదరగొట్టాడు. అసలేమాత్రం తగ్గకుండా చివరి బంతి వరకు మెరుగైన ఆటతీరుతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతని ఆటతీరు అభిమానులను అలరించడమే కాదు, స్కోర్‌కార్డ్‌ను రెండు వందలకు చేరువ చేసింది. 28 బంతుల్లోనే 52 పరుగులు ధోనీ ఆరంభంలో ఎప్పటిలాగే నిదానంగా ఆడాడు. అయితే, ఆ తర్వాత దూకుడు పెంచాడు. వరుసగా మెరుగైన షాట్లతో స్కోర్‌కార్డ్‌ను పరిగెత్తించాడు. మనీష్ పాండేకు తగ్గట్టుగా బ్యాట్‌కు పనిచెప్పాడు. ఫలితంగా, 28 బంతుల్లోనే నాల్గు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. చివరి పది ఓవర్లలో భారత్ సాధించిన 102పరుగుల్లో ధోనీవే సగం పరుగులున్నాయంటే అతని దూకుడు అర్థం చేసుకోవచ్చు. చివరి ఓవర్లో 17 పరుగులు టీమిండియా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ధోనీ దూకుడిగా ఆడాడు. తాను…
Read Moreమనీష్ పాండే సూపర్ ఇన్నింగ్స్
టీమిండియా మిడిలార్డర్ యంగ్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే అదరగొట్టాడు. అసలేమాత్రం తగ్గకుండా భారీ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపాడు. సఫారీలపై టాపార్డర్ కంగారుపడ్డ టైమ్‌లో మెరుగైన ఆటతీరుతో స్కోర్‌కార్డ్‌ను పరిగెత్తించాడు. అతను సాధించిన పరుగులు ఇప్పుడు టీమ్ మెరుగైన స్థానంలో నిలబడేలా మాత్రమే కాదు, ఓ రేంజ్లో మ్యాచ్ ఫలితాన్ని శాసించేలా చేశాయి. అంతేకాదు, మనీష్ పాండే ఫామ్, ఫిట్నెస్ మరోసారి నిరూపించుకున్నాడు. కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే, నిలకడగా ఆడాడు. వికెట్ల మధ్య పరిగెత్తడంలో దూకుడు ప్రదర్శించిన మనీష్ సురేష్ రైనాతో కలిసి నాల్గో వికెట్‌కు 45పరుగులు జోడించాడు. రైనా ఔటయ్యాకా కూడా అదే జోరును కొనసాగించిన మనీష్ పాండే, అర్థసెంచరీతో టీమ్ స్కోర్‌ను వంద పరుగులు దాటించాడు. అంతేకాదు, ధోనీతో కలిసి ఐదో వికెట్‌కు కీలకమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసి, టీమ్‌ను రెండో…
Read Moreసెంచూరీయన్‌లో సౌతాఫ్రికా టార్గెట్ 189
రెండో టీట్వంటీలో టీమిండియా సఫారీల ముందు లక్ష్యాన్ని నిర్థేశించింది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్, మనీష్ పాండే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఆరంభంలో శిఖర్ ధావన్, సురేష్ రైనా విలువైన పరుగులతో టీమ్‌ను ముందుకు నడిపించారు. చివర్లో ఎప్పటిలాగే, యం. యస్ ధోనీ మరోసారి తనదైన స్టయిల్లో దూకుడు ప్రదర్శించాడు. దీంతో…టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కలసొచ్చిన యూడీఆరెస్ నిజానికి..ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే ధావన్ ఔటయ్యాడు. అయితే, యూడీఆరెస్ తీసుకోవడంతో నాటౌట్‌గా తేలిపోయింది. ఈ అవకాశం తర్వాత రెచ్చిపోయిన ధావన్ వరుస బౌండరీలతో హోరెత్తించాడు. అయితే డుమినీ అతన్ని పెవిలియన్ చేర్చాడు. ఈ టైమ్‌లో వచ్చిన సురేష్ రైనా ఆచితూచి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అతను సాధించిన 31పరుగులు టీమ్‌ను మిడిల్ ఓవర్స్‌లో కాస్త…
Read Moreసెంచూరీయన్‌లో మనీష్ పాండే అర్థసెంచరీ
ఐపీఎల్ ఆక్షన్‌లో 11కోట్లు పలికిన మనీష్ పాండే, ఆ లీగ్కంటే ముందే చెలరేగిపోయాడు. సెంచూరీయన్‌లో, సౌతాఫ్రికాతో జరుగుతున్న టీట్వంటీలో 33 బంతుల్లో నాల్గు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో అర్థసెంచరీ చేశాడు. టాపార్డర్ విఫలమైన టైమ్‌లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. ముందు రైనాతో కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన మనీష్ పాండే, ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తూ ధోనీతోనూ విలువైన పార్టనర్‌షిప్‌ను నమోదు చేశాడు. అతని భారీ ఇన్నింగ్స్‌తో భారత్, రెండో టీట్వంటీలో మెరుగైన స్కోర్ దిశగా వెళ్తోంది.
Read Moreఇటు ధావన్, అటు రోహిత్ ఫస్ట్‌బాల్‌కే ఔట్ కానీ…
రెండో టీట్వంటీలో భారత్‌కు అదృష్టం కలసివచ్చింది. ఫలితంగా…ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోవాల్సిన టీమ్ గట్టెక్కితే, సెంచరీతో గాడిలో పడ్డట్టు కనిపించిన రోహిత్ శర్మ, మరోసారి నిరాశపర్చాడు. అయితే, యూడీఆరెస్తో ధావన్ గట్టెక్కితే, డాలా ఇన్‌స్వింగర్‌కి రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. ఫస్ట్‌బాల్‌కే ధావన్ ఔట్ టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఫస్ట్ బాల్కే వికెట్ కోల్పోయింది. క్రిస్ మోరిస్ వేసిన ఫస్ట్ బాల్కే వికెట్ల దగ్గర దొరికిపోయాడు. అయితే, ధావన్ రివ్యూ కోరడం, రిప్లేలో బంతి, బ్యాట్‌ను తాకినట్టు కనిపించడంతో ధావన్ నాటౌట్‌గా ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అయితే, ఆ భయంతోనేమో కానీ ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా తీయలేదు. అయితే, తర్వాత దూకుడు ప్రదర్శించి 3ఫోర్లు, రెండు భారీసిక్సర్లతో 24రన్స్ చేశాడు. అయితే, డుమినీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.…
Read More