జ‌డేజా, అశ్విన్‌కు మ‌ళ్లీ హ్యాండ్‌…రాహుల్‌కు బ్యాండ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌బోయే వ‌న్డే సిరీస్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ. ముంబైలో కీల‌క స‌మావేశం త‌ర్వాత‌..సెలెక్ట‌ర్లు ప‌దిహేను మందితో కూడిన టీమ్‌ను ఎనౌన్స్ చేశారు. ఈ లిస్ట్‌లో జ‌ట్టులోకి రీఎంట్రీ ఇస్తాన‌ని ధీమాగా చెప్పిన ఆర్‌.అశ్విన్‌తో పాటు, జ‌డేజాకు చోటు ద‌క్క‌లేదు. అంతేకాదు…వీళ్లిద్ద‌రూ మ‌ళ్లీ జ‌ట్టులోకి వ‌స్తారో లేదోన‌నే అనుమానం క‌ల్గించేలా సెలెక్ట‌ర్లు టీమ్‌ను ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం జ‌ట్టులో ఉన్న కేఎల్ రాహుల్‌ను కూడా సెలెక్ట‌ర్లు ప‌క్క‌న పెట్టారు. టాపార్డ‌ర్ నుంచి మిడిలార్డ‌ర్‌కి మారాకా పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్న రాహుల్‌ను సెలెక్ట్ చేయ‌ని బోర్డ్‌, ఉమేష్ యాద‌వ్‌తో పాటు ష‌మిని కూడా టీమ్ నుంచి ఉద్వాస‌న ప‌లికారు. ఆశ్చ‌ర్యంగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరంగా ఉన్న శార్ధాల్ ఠాకూర్‌కు తిరిగి టీమ్‌లోకి చోటు ఇచ్చారు. యంగ్‌స్ట‌ర్స్‌పైనే సెలెక్ట‌ర్లు న‌మ్మ‌కం ఉంచిన‌ట్టు తెలుస్తోంది.

టీమ్ వివ‌రాలు క్రింద ఇవ్వ‌బ‌డిన‌వి గ‌మ‌నించ‌గ‌ల‌రు

కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ధావన్‌, రహానె, మనీష్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, ధోని (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌, బుమ్రా, భువనేశ్వర్‌, శార్దూల్‌ ఠాకూర్‌.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts